నాసిరకం సరుకు అనగానే చైనా మాల్ అనేస్తుంటాం… నమ్మడానికి వీల్లేని బేమాన్ గుణం అనగానే చైనా గుణం అంటుంటాం… కానీ కొన్ని చైనా వాడే చేయగలడు… అంటే కరోనా వైరస్ వంటివి కాదు… భారీ నిర్మాణాలు, అత్యంత భారీ ప్రాజెక్టులకు క్లిష్టతరమైన ఆధునిక టెక్నాలజీని వాడి అబ్బురపరుస్తారు… పైగా వేగంగా, అడ్డంకుల్లేకుండా సాఫీగా, పర్ఫెక్ట్ ప్లానింగుతో పూర్తిచేసేస్తారు… బోలెడు ఉదాహరణలున్నయ్… ఇది చూడండి… 28 గంటల్లో అంటే దాదాపు జస్ట్, ఒక రోజుల్లో ఏకంగా పది అంతస్థుల రెసిడెన్షియల్ భవనాన్ని కళ్ల ముందు నిలిపారు… నమ్మబుల్ అనిపించడం లేదా..? దిగువన ఓ వీడియో ఉంటుంది… బ్రాడ్ గ్రూపు వాళ్లు నిర్మించారు దాన్ని… ఆ వీడియోలో నిర్మాణ వివరాలు, భవన విశేషాలు పొందుపరిచారు… కేవలం నాలుగున్నర నిమిషాల వీడియో… భవనానికి ‘లివింగ్ బిల్డింగ్’ అని పేరు కూడా పెట్టారు…
ఈమధ్య కొన్నిచోట్ల కడుతున్నారుగా… త్రీడీ ప్రింటింగ్ అనీ, ఒకేరోజులో నిర్మాణం అని వార్తలు వస్తున్నాయిగా… మరి ఇదీ అలాంటిదేనా..? కాదు..! ప్రిఫాబ్రికేటెడ్… అంటే ఫ్యాక్టరీలో ముందే తయారు చేసుకుని, కంటైనర్ల వంటి అపార్ట్మెంట్లను సైటు వద్దకు తీసుకొచ్చి, అసెంబుల్ చేస్తారు… అవును, ఓ కారును అసెంబుల్ చేసినట్టే…! ఒక దానిపై ఒకటి పేర్చి, నట్లూ బోల్టులు ఫిట్ చేయడమే… అనుకోవడానికి వీజీగా ఉంటుంది గానీ చాలా ప్లానింగు, మెరిట్ అవసరం… అదేదో అల్లాటప్పాగా ఓ కంటైనర్ వంటి బిల్డింగు కూడా కాదు… ఇతర నిర్మాణాల్లాగే… పైగా 28 గంటల 45 నిమిషాల్లో విద్యుత్తు, లిఫ్టులు, నీరు, ఫర్నీచర్, గ్లాస్ డోర్స్, బాల్కనీలు, వెంటిలేషన్ గట్రా అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేశారు… అంటే, రెడీటుఎంటర్… పుణ్యవచనం చేయించుకుని గృహప్రవేశం చేసేయడమే… వావ్… అనిపిస్తోందా ఇప్పుడు..?
Ads
Share this Article