Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!

April 8, 2026 by M S R

.

పాత పేరు, కొత్త ఎజెండా… అని కల్వకుంట్ల కవిత మీడియా చిట్‌చాట్‌లో చెప్పిన ఒక వాక్యం ఆధారంగా… ఆమె టీఆర్ఎస్ పార్టీ పేరునే వాడుకోబోతోందని రకరకాల ఊహాగానాలు సాగాయి… డిజిటల్, వెబ్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ కూడా అవే భ్రమలకు లోనైంది… అవున్నిజమే అని రాసుకొచ్చాయి… ఈరోజు కూడా కొన్ని వెబ్ పత్రికలలో కనిపించాయి ఆ వార్తలు…

తెలంగాణ రాష్ట్ర సమితి… ప్రత్యేక రాష్ట్ర స్థాపనకు ఉద్యమించి, తొలిసారే అధికారంలోకి వచ్చిన పార్టీ… ఉద్యమ వేదికగా దానికి ఓ చరిత్ర ఉంది… కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశ, అపసవ్య విధానాలతో ఆ పార్టీ పేరు బదనాం అయ్యింది… తరువాత ప్రధాని ఆశలతో, కలలతో కేసీయార్ అందులో నుంచి తెలంగాణ ఆత్మను కత్తిరించేసి, భారత రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీగా చేయడంతో, మొత్తం టీఆర్ఎస్ పేరే మాయమైపోయింది…

Ads

ఆ ఆత్మను కోల్పోయి, కేసీయార్ అంతిమంగా ఏం కోల్పోయాడనే విశ్లేషణ ఎలా ఉన్నా… తిరిగి అదే పేరును… ఆయనతో విభేదించి, ఆ కుటుంబానికి దూరమైన ఆయన బిడ్డ కవిత వాడుకోనుందనే పాయింట్ మంచిదే, ఆసక్తికరమే… టీఆర్ఎస్ పేరు మరొకరు రిజిష్టర్ చేసుకోకుండా ఉండే ‘బ్యాన్ పీరియడ్’ కూడా ముగిసింది కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు… ఎస్, ఆ పేరు ఇప్పుడు ఆమె తీసేసుకుంది… కానీ, వాడుకోదలుచుకోలేదు…

తన పట్ల కేసీయార్, కేటీయార్, కుటుంబం, బీఆర్ఎస్ నేతల వ్యవహార ధోరణి మీద విపరీతమైన కోపంలో ఉంది ఆమె… అందుకే కేసీయార్ లెగసీని ఆమె వాడుకోదల్చుకోలేదు… చివరకు తన జెండాలో పింక్ కలర్ ఛాయలు కూడా ఉండకూడదని భావిస్తోందంటున్నారు… సో, తన పేరులో తెలంగాణ అనే పదముంటుంది… తనను తెలంగాణ జనంలో ఉంచిన జాగృతి పదం కూడా ఉంటుంది…

పార్టీ జెండా, పార్టీ పాలసీ ఖరారులో ఉందామె ఇప్పుడు… మేధావులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, పలు రంగాల ప్రముఖులతో మాట్లాడుతూ సూచనలు, సలహాలు తీసుకునే పనిలో ఉంది… ఎలాగూ ఈ నెలాఖరులో ఇవన్నీ ప్రకటించేసి, ఇక రాష్ట్రమంతా తిరగాలని ప్లాన్… అయితే ఇక్కడ ఓ చిన్న ప్రశ్న… ఆమె ఐడీకార్డులు, పాస్‌పోర్టులో ఇంటిపేరు ఏం ఉందో తెలియదు గానీ…

(కేసీయార్ లెగసీ నాకు వద్దు అనుకుంటే… ఐడీ కార్డుల్లో అధికారిక ఇంటి పేరు ఎలా ఉన్నా సరే… రాజకీయంగా తమ అత్తింటి పేరు దేవనపల్లి వాడుకోవాలేమో మరి..!) ఆమె ఇంటి దగ్గర వచ్చీపోయేవాళ్ల కోలాహలం బాగానే కనిపిస్తోంది… జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది… లిక్కర్ కేసు కొట్టివేత కూడా తనకు అనుకూలించే అంశమనీ, తనకు కాలం సహకరిస్తున్నదనీ ఆమె భావనగా తెలుస్తోంది…

సిద్దిపేట, గజ్వెల్ గనుక మహిళలకు రిజర్వయితే అక్కడ పోటీచేస్తానని అనడం మాత్రం సరైన ఎక్స్‌ప్రెషన్ కాదు… ఎక్కడైనా సరే, నిలబడాలి… ఎలాగూ వచ్చే ఎన్నికల నాటికి ఎంపీ సీట్లు మాత్రమే కాదు, ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి, మూడో వంతు మహిళలకు రిజర్వవుతాయి… లేడీ రిజర్వ్‌డ్ సీట్లు తన అత్తింటి జిల్లా నిజామాబాద్‌లోనే దొరక్కపోవు… కానీ వైనాట్ ఇన్ సిద్దిపేట అగెయినెస్ట్ హరీష్ రావు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట
  • ఈమె తెగువకు ఓసారి గట్టిగా చప్పట్లు కొడదాం… ఎందుకంటే..?
  • ‘‘నీ పో మోనే విజయ…’’ కేరళలో భలే పేలిన రేవంత్ రెడ్డి క్యాంపెయిన్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions