Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాతతరం చీప్ మిసైళ్లతో అమెరికాకు చుక్కలు… నేలరాలిన విమానాలు…

April 9, 2026 by M S R

.

Pardha Saradhi Potluri ….. అమెరికా, ఇజ్రాయేల్ Vs రష్యా, చైనా, ఇరాన్… కోల్డ్ వార్ ఎరా టెక్నాలజీ అమెరికా కొంప ముంచింది!
సోవియట్ యూనియన్ కి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో ( 1945-1989 ) పోటా పోటీగా ఆయుధాలని ఉత్పత్తి చేస్తున్న రోజులలో సోవియట్ యూనియన్ లో అభివృద్ధి చేయబడ్డ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 2026 లో అమెరికన్ ఫైటర్ జెట్స్ ని కూల్చాయి!
వినడానికి వింతగా ఉన్నా రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలని విశ్లేషించి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చివరికి సోవియట్ కాలం నాటి పాత ఆయుధాలని ఉపయోగించి ఇరాన్ అమెరికన్ ఫైటర్ జెట్స్ ని కూల్చింది అని నిర్ధారించారు.

అఫ్కోర్స్! కోల్డ్ వార్ సమయంలో KGB, CIA లు ఒకరి టెక్నాలజీని ఇంకొకరు దొంగతనం చేయడమో లేదా డబ్బు ఆశచూపి తీసుకోవడమో జరిగేది! ఈ రెండూ కాకపొతే హానీ ట్రాప్ అనే ఆయుధం ఉండనే ఉంది!
అయితే ఇరాన్ ఉపయోగించిన సర్ఫెస్ to ఎయిర్ మిసైల్స్ రెండు వేరియంట్స్ గా ఉన్నట్లు గుర్తించారు.

Ads

1.సోవియట్ కాలం నాటి రేడియో సిగ్నల్ ఆధారిత లో ఆల్టిట్యూడ్ ( Low Altitude ) మిసైల్.
2. ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ హీట్ సీకింగ్ మిసైల్.

ఇరాన్ ఉపయోగించిన సర్ఫెస్ to ఎయిర్ మిసైల్ చాలా సింపుల్ టెక్నాలజీతో తయారుచేసిందే. వరల్డ్ వార్ 2 సమయంలో జపాన్ బాంబర్ విమానాలని కూల్చడానికి అమెరికా తయారుచేసిన షార్ట్ రేంజ్ సర్ఫెస్ to ఎయిర్ మిసైల్ ని పోలి ఉన్నట్లుగా తెలుస్తున్నది.
షార్ట్ రేంజ్ సర్ఫెస్ TO ఎయిర్ మిసైల్ అని అంటూ బాంబర్లని ఎలా కూలుస్తుంది అనే సందేహం రావచ్చు కానీ రెండో ప్రపంచ యుద్ధకాలంలో బాంబర్స్ తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడి చేసేవి.

అమెరికన్ మిలిటరీ వాడిన షార్ట్ రేంజ్ సర్ఫెస్ to ఎయిర్ టెక్నాలజీ ఇరాన్ దగ్గరికి ఎలా వచ్చిందో తెలీదు. బహుశా రష్యా లేదా చైనా ఇచ్చివుండవచ్చు!
ఇరాన్ వాడిన మిసైల్స్ ని SA -67 లేదా SAQR 1 గా వ్యవహరిస్తున్నారు. నాటో కోడ్ నేమ్ 358. SAQR అంటే గద్ద ( HAWK ).

మొదటి వర్షన్ మిసైల్ రేడియో సిగ్నల్స్ ని ఆధారంగా చేసుకొని టార్గెట్ ని చేధిస్తుంది. విమానం లేదా UAV, కామికాజ్ డ్రోన్, హెలికాప్టర్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ ని ఆధారం చేసుకొని ఆ దిశగా ప్రయాణించి రేడియో సిగ్నల్ బలంగా వెలువడుతున్న ప్రదేశం దగ్గర హై ఎక్సప్లోజీవ్ పేలుడు పదార్ధాన్ని విడుదల చేస్తుంది. నేరుగా టార్గెట్ ని ఢీ కొట్టదు.

రెండవ వర్షన్ SAQR -1 లేదా SA-67. దీనిలో గైడెన్స్ కోసం Im Ir ( Imaging Infrared ) సీకర్, ఎలక్ట్రో ఆప్టికల్ 16X ఆక్టివ్ లేజర్ ప్రొక్సిమిటీ ఫ్యూజ్ (Electro – Optical 16x Active – Laser – Proximity- Fuze ) ఉంటుంది.
లాంచర్ : 45 డిగ్రీల కోణంలో చిన్న లాంచర్ నుండి ప్రయోగిస్తారు.

ఒకసారి టార్గెట్ దగ్గరలో ఉందని తెలిస్తే టార్గెట్ వైపు ప్రయోగిస్తే 8 అంకె ఆకారంలో తిరుగుతూ Im IR సీకర్ తో టార్గెట్ ని వెతికి ఆ దిశగా వెళ్లి టార్గెట్ దగ్గరికి వెళ్లి హై ఎక్సప్లోజీవ్ ఫ్రాగ్మెంట్స్ ని రిలీజ్ చేస్తుంది.
28,000 అడుగుల రేంజ్ కలిగి ఉంది.

డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం…
చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసారు! హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ప్రయోగించడం చాలా తేలిక. చిన్న నిచ్చెన లాంటి లాంచర్ తో ప్రయోగించి లాంచర్ కనపడకుండా ఇసుక కప్పేయవచ్చు. టార్గెట్ ని చేధించడంలో 90% అక్క్యూరసి కలిగి ఉంది! ఫైర్ అండ్ ఫర్గెట్.

ఇరాన్ స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకోవడానికి దుబాయ్ కేంద్రంగా కొన్ని షెల్ కంపెనీలని తెరిచి దుబాయ్ కి రాగానే ఇరాన్ కి బోట్ల ద్వారా తరలించింది! దుబాయ్ అధికారులకి తెలిసే ఇదంతా జరిగింది! కానీ ఇరాన్ దుబాయ్ ని కానీ UAE ని కానీ వదిలిపెట్టలేదు. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

SAQR -1 లేదా SA-67 కి బలయ్యింది ఎన్ని?
అమెరికన్ MQ-9 రీపర్ UAV లు నాలుగు.
అమెరికన్ F-15E లు రెండు.
అమెరికన్ F-35 ఒకటి.
అమెరికన్ ట్రాన్స్పోర్ట్ విమానం C-130 ఒకటి.
రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చిన బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లు రెండు.
ఒక్క F-35 తప్ప మిగతావన్నీ ఒకే రోజులో కోల్పోయింది అమెరికా.

తప్పెవరిది?
ముందుగా ఇరాన్ మీద దాడులు కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ ది. ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ అనేది లేదని అన్నీ ధ్వంసం అయిపోయాయాని నివేదిక ఇచ్చిన centcom ది. CENTCOM ఇచ్చిన నివేదికని పెంటగన్ అధికారులు ట్రంప్ చెవిన వేస్తే ట్రంప్ అంతర్జాతీయ మీడియా ముందు అవర్ బర్డ్స్ ఆర్ ఫ్లైయింగ్ ఫ్రీలీ ఆన్ టెహరాన్ అని ప్రకటించడం!

ఇజ్రాయేల్ వార్ ప్లానర్స్ కూడా సరైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ లేకుండా నాంతాజ్, ఇస్ఫాహాన్ లలో శుద్ధి చేసిన యూరేనియం నిల్వలు ఉన్న ప్రదేశాన్ని రెక్కీ చేయమని F-15E ని పంపించడం… F-15 జెట్ వస్తున్న సమాచారం తన సాటిలైట్స్ ద్వారా గుర్తించిన చైనా వెంటనే IRGC కి సమాచారం ఇవ్వడంతో IRGC తన SA-67 లాంచర్స్ తో సిద్ధంగా ఉండి F-15E తక్కువ ఎత్తులో ఎగురుతుండడంతో ( రెక్కీ కోసం తక్కువ ఎత్తులో వెళ్తారు ) మిసైల్ ప్రయోగించి కూల్చడం జరిగింది!

F-15E ఫైటర్ జెట్ లో ఇద్దరు ఉన్నారు, ఒకరు పైలట్ అయితే రెండవవారు WSO (Weapon Systems Officer cum Navigator ). మిసైల్ అటాక్ చేయగానే పైలట్, WSO ఇద్దరూ eject అయ్యారు.
తన జెట్ ని మిసైల్ అటాక్ చేసిందని eject అవుతున్నామని పైలట్ centcom కి సందేశం పంపించాడు.
పైలట్ చివరిసారిగా రేడియోలో ఏ లొకేషన్ నుండి మెసేజ్ పంపించాడో ఆ ప్రాంతానికి అక్కడికి సెర్చ్ కోసం MQ-9 రీపర్ UAV ని పంపారు. అప్పటికే అదే ప్రాంతంలో మరో MQ-9 రీపర్ UAV ఇంటెలిజెన్స్ కోసం గాల్లో ఎగురుతున్నది! పైలట్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన MQ-9 రీపర్ ని IRGC SA-67 తో కూల్చేశారు.

రెస్క్యూ కోసం పంపిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్ల ని కూల్చేశారు. అక్కడి పరిస్థితిని అంచనా వేయడం కోసం MQ-9 రీపర్ ని పంపించాగా దానిని కూడా కూల్చేశారు.
మరో C-130 రవాణా విమానాన్ని పంపగా దానిని కూడా కూల్చేశారు.

C-130 రవాణా విమానం ఎందుకు పంపించారు?
C-130 లో శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ ఉందో కనిపెట్టే ఏక్విప్మెంట్ ఉంది. కానీ యురేనియం జాడ తెలుసుకునే లోగానే ఇరాన్ కూల్చివేసింది.
C-130 కూలిపోగానే అందులోని సిబ్బందిని రక్షించడానికి మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు వచ్చాయి. C-130 కూలిపోయినప్పుడు అందులో ఎంతమంది సిబ్బంది ఉన్నారో, ఎంతమంది బ్రతికారు, ఎంతమంది చనిపోయారో తెలియరాలేదు కానీ యురేనియంని గుర్తించడానికి ఉద్దేశించిన ఏక్విప్మెంట్ ఇరాన్ కి దొరకకుండా మొత్తం శిధిలాలని బాంబులతో పేల్చివేశారు.

F-15 ఫైటర్ జెట్ ని కూడా ఆనవాళ్లు దొరకకుండా పేల్చివేశారు!
15 వేల డాలర్లు విలువగల SA -67 మిసైల్ తో $600 మిలియన్ల విలువచేసే మిలిటరీ జెట్స్ ని నాశనం చేశారు.
F-15 పైలట్ ని రక్షించుకోగలిగిన అమెరికా వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ కోసం ఇంకా గాలిస్తూనే ఉంది. WSO దగ్గర మిషన్ ఉద్దేశ్యాలు, మాప్ లు, భవిష్యత్ వ్యూహలు లాంటి కీలక సమాచారం ఉంటుంది. మరో వైపు ఇరాన్ లో ఇప్పటికీ కొండగుహలలో నివసించే ట్రైబల్స్ ఉన్నారు. ఇస్ఫాహాన్ చుట్టుపక్కల నివసించే ట్రైబల్స్ WSO కోసం గాలిస్తున్నారు.

IRGC ట్రైబల్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది…. WSO ఎక్కడ ఉన్నాడో సమాచారం ఇస్తే 5,000 డాలర్లు, సజీవంగా పట్టుకొని పోలీసులకి అప్పగిస్తే 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది!
రెస్క్యు ఆపరేషన్ తో చావు దెబ్బతిన్న అమెరికా wso కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపడితే తమకే నష్టం అని ఆపేసింది!

నీరు, ఆహారం లేకుండా ఫైటర్ జెట్ పైలట్ వారం రోజుల వరకూ బ్రతికే విధంగా శిక్షణ ఇస్తారు! పైలట్స్ కోసమే ప్రత్యేకంగా ప్రోటీన్ చాక్లెట్స్ తయారుచేసి ఇస్తారు. ఒక చాక్లెట్ ఒక పూట ఆహరం లేకుండా చురుకుగా ఉంచుతుంది పైలట్ ని.

కర్ణుడి చావుకి వేయి కారణాలు!
పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ కోసం వాడే ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయాయి! దక్షిణ కొరియా నుండి తీసుకున్న 160 ఇంటర్సెప్టర్ మిసైల్స్ అయిపోయాయి!
పొలాండ్ దగ్గర ఉన్న పెట్రియాట్ మిసైల్స్ ని ఇవ్వమని అడిగాడు ట్రంప్! ఇరాన్ తో యుద్ధం మీ సమస్య కాబట్టి మేము పేట్రియాట్ మిసైల్స్ ఇవ్వము అని తేల్చి చెప్పింది పొలాండ్!
చేసేది లేక తమ F-15 wso ని కాపాడుకోవడానికి అమెరికా కాల్పుల విరమణ కోసం సిద్ధపడ్డది!

వియత్నాం యుద్ధం నవంబర్ 1,1955 – ఏప్రిల్ 30,1975…
20 ఏళ్ళ పాటు వియత్నాం యుద్ధంలో పాల్గొని అమెరికా తీవ్రంగా నష్టపోయి, చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా అవమానంతో విరమించింది!
వియత్నాం యుద్ధం అనేది కమ్యూనిజం తూర్పు ఆసియాలో విస్తరించకుండా ఆపాలని అమెరికా చేసిన విఫలయత్నం!
ఉత్తర వియత్నాం సోవియట్ యూనియన్ ఆధీనంలో ఉన్న కమ్యూనిస్ట్ దేశమయితే, దక్షిణ వియత్నాం ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా నియంత్రణలో ఉండేది!
సోవియట్ యూనియన్ యుద్ధంలో నేరుగా పాల్గొనకుండా మద్దతు ఇస్తే దక్షిణ వియత్నాం తరుపున అమెరికా నేరుగా యుద్ధం చేసింది!

ఉత్తర వియత్నాం ప్రధానంగా గెరిల్లా యుద్ధ వ్యూహన్ని అనుసరించి అమెరికాని ఓడించింది.
ఉత్తర వియత్నాం దగ్గర అప్పట్లో సోవియట్ Mig -21 ఫైటర్ జెట్స్ ఉండేవి కానీ అమెరికన్ ఫైటర్ జెట్స్ దగ్గర జవాబు లేకుండా పోయింది ఉత్తర వియత్నాం పైలట్స్ నైపుణ్యం ముందు.
ఉత్తర వియత్నాం Mig-21 దెబ్బకి అమెరికన్ ఫైటర్ జెట్స్ సర్వీసు నుండి తప్పుకున్నవి….

  1.  మెక్ డొనేల్ డగ్లస్ F-4 ఫాంటమ్ II – 670 విమానాలు నేలకూలాయి. సర్వీసు నుండి తప్పించారు.
    2.  F-105 థాండర్ చెఫ్ లు మొత్తం ప్రోడక్షన్ లో 40% ఉత్తర వియత్నాంలో నేలకూలాయి. సర్వీసు నుండి తప్పించారు.
    3.  A-4 స్కై హాక్ లైట్ ఎటాక్ ఫైటర్ జెట్స్ కూడా Mig -21 ని ఎదుర్కొలేక కూలిపోయాయి తరువాత సర్వీస్ నుండి తప్పించారు.

ప్రస్తుతం ఇరాన్ కూడా గెరిల్లా తరహాలో దాడులు చేసి అమెరికాని ముప్పతిప్పలు పెడుతున్నది!
ఇరాన్ SA -67 కి బలి అయినవి F-35, F-15 ఫైటర్ జెట్స్. వియత్నాం యుద్ధ సమయంలో ఉత్తర వియత్నాం వెనుక సోవియట్ ఉంటే ఇప్పుడు ఇరాన్ వెనుక రష్యా ఉంది!

SA – 67 కి విరుగుడు ఉంటుందా?
ఉండకపోవచ్చు! ఎందుకంటే SA -67 లో ఎలాంటి రాడార్ ఉండదు. రేడియో సిగ్నల్స్ ని తీసుకుంటుంది తప్పితే తిరిగి విడుదల చేయదు. ఒక రకంగా హైబ్రీడ్ చీప్ అండ్ బెస్ట్ మిసైల్.
F-15 లో మిసైల్ అప్రోచింగ్ వార్నింగ్ రాడార్ ఉంటుంది కానీ SA -67 రాడార్ సిగ్నల్స్ ని విడుదల చేయదు. కాబట్టి F-15 పైలట్ కి తనని ఒక మిసైల్ వెంబడిస్తున్నది అని తెలియదు.
ఇరాన్ 2017 లో మొదలు పెట్టి, 2019 లో మొదటి SA-67 ని టెస్ట్ చేసింది!
పుతిన్ ఇల్యూమీనాటి మీద యుద్ధం చేస్తున్నాడు!
పుతిన్ క్షేమంగా ఉంటాడు అని చెప్పలేం!
ఎన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయినా సరే పుతిన్ ని హత్య చేస్తారు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాతతరం చీప్ మిసైళ్లతో అమెరికాకు చుక్కలు… నేలరాలిన విమానాలు…
  • మరిచిపోలేని మహామనీషి… మనం మరో పీవీని చూడగలమా..? నెవ్వర్..!!
  • చందమామ మీదకు వెళ్లడం కాదు… క్షేమంగా తిరిగి రావడమే పే-ద్ద ఘనత…
  • ఈ ‘సీతాకోకచిలుక’ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెరపై… అదే నవ్వుతో…
  • లెఫ్ట్, రైట్, సెంట్రల్, రీజనల్… ప్రతి పార్టీ నాదే… లాటరీ మార్టిన్ కథ…
  • భార్య… అల్లుడు… కొడుకు… మరి ‘లాటరీ మామ గారా… మజాకా…’
  • ఈ అభ్యర్థి దగ్గర 19 కిలోల బంగారం… 13 కిలోల వెండి… ఎవరీమె..?
  • విజయ్ పార్టీకి రథసారథి… తను తమిళ ప్రశాంత్ కిషోర్… కింగ్ మేకర్…
  • మహానగరంలో మాయగాడు… 39 ఏళ్లుగా మిస్టరీ వీడని ‘నగల చోరీ’…
  • అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions