.
ఐపీఎల్ అంటే..? వేల కోట్ల బెట్టింగ్ దందాకు వేదిక… ఇదొక రేస్ కోర్స్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెటర్ క్రికెటర్లను రేసుగుర్రాల్లాగా కొని, క్రికెట్ మైదానాల్లో పరుగులు తీయించే ఓ కార్పొరేట్ క్రీడ… వేల కోట్ల యాడ్స్, బ్రాండ్ల బిల్డప్పులు… ఇదొక మాయా ప్రపంచం… అందరికే నిజమైన క్రికెట్‌ను ప్రేమించే వాళ్లు పెద్దగా ఇష్టపడరు…
కానీ ఒకకోణంలో ఐపీఎల్‌ను మెచ్చుకోవాలి…. దేశాల నడుమ జరిగే అంతర్జాతీయ మ్యాచుల్లో కనిపించని పోరాటతెగువ, సామర్థ్యం కనిపిస్తుంది… సూపర్ ఫీల్డింగ్ ప్రమాణాలు, బాల్ బాల్ కు వైవిధ్యం, కోచ్‌ల వ్యూహాలు, డేటా ఆధారిత ఎత్తుగడలు, క్యాచులు పట్టుకోవడంలో అసాధారణ నైపుణ్యం, షాట్ల ఎంపిక, కొన్ని మరీ అసాధారణం… సూపర్ ఫిజిక్, స్టామినా… వాట్ నాట్… ఫెయిలయితే మళ్లీ వచ్చే ఐపీఎల్‌కు ఎంపిక కాలేం, రేటు పలకదు అనే ఒత్తిడి క్రీడాకారుల్లోని మొత్తం నైపుణ్యాన్ని బయటికి తీస్తుంది…
Ads
పరీక్ష ఉంటేనే కదా సత్తా బయటికి వచ్చేది… ఇవన్నీ సరే, కానీ ఐపీఎల్ అంటే కొన్ని ఎమోషన్లు కూడా… నిన్న ఎల్‌ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచు మీద ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు… ఎందుకు..?
2024 కెప్టెన్ కె.ఎల్. రాహుల్‌తో సంజీవ్ గోయెంకా మైదానంలోనే బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం పెద్ద వివాదమైంది… ఇప్పుడు 2026 సీజన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్‌తో కూడా గోయెంకా చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి… మరీ జమీందారీ తరహా ఓనర్… పక్కా అన్ ప్రొఫెషనల్… ఇది లక్నో టీమ్ దురవస్థ…
కేకేఆర్ (KKR) కథ వేరు… ఈ 2026 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ₹9.20 కోట్లకు కొనుగోలు చేసింది… దాంతో పాట్రియాటిక్ ఫీలింగ్స్ ఉన్న ప్రతి ఒక్కడూ ఈ జట్టును డిజ్ ఓన్ చేసుకుంటున్నారు… గతంలో కూడా షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ వంటి ప్లేయర్ల విషయంలో ఇలాంటి చర్చలు జరిగాయి…
మొత్తం పది జట్లు కదా… హైదరాబాద్ టీమ్ మీద కాస్త తెలుగువాళ్లకు కాస్త ప్రేమ ఉండేది… అందులో తెలుగువాళ్లు లేకపోయినా సరే, కానీ లండన్ లీగ్ పోటీలకు ఓ పాకిస్థానీ క్రికెటర్‌ను ఎంగేజ్ చేసుకోవడంతో కావ్య మారన్ మీద ఇండియన్ ప్రేక్షకులు ప్రయోగించినన్ని బూతులు బహుశా ఏ ఐపీఎల్ జట్టు ఓనర్ మీద కూడా లేవేమో…
చెన్నై టీమ్, ధోనీ లేడు… ఒకప్పుడు పెద్ద పోటీ ఇచ్చే టీమ్, ఈసారి నాసిరకం… అందుకే ప్రస్తుతం టేబుల్‌లో చివరి స్థానం… పెద్దగా ఎవరికీ దీని మీద ఆసక్తి లేదిప్పుడు… ముంబై ఇండియన్స్… డబ్బు మదం… అంబానీ టీమ్… అతిరథ మహారథుల్ని కోట్లకుకోట్లు పెట్టి తీసుకుంది… ఐనా సరే నాసిరకం పర్‌ఫామెన్స్… ఒక సీఎస్‌కే, ఒక ఎంఐ, ఒక ఎస్ఆర్‌హెచ్… ఎవరూ పట్టించుకోని జట్లు ఇప్పుడు…
బెంగుళూరు జట్టుకు నిజానికి కోహ్లీ హీరో… కానీ తను ఓవర్సీస్ ప్లేయర్… జస్ట్, ఐపీఎల్ పోటీల సమయంలోనే వస్తాడు, ఆడతాడు, బ్రాండ్ ప్రమోషన్ కాపాడుకుంటాడు… గత సీజన్ విజేత అయినా సరే, విజయోత్సవాల తొక్కిసలాట తాలూకు పాపం, శాపం వెంటాడుతూనే ఉంది… బిర్లా గ్రూప్ కొన్నా సరే, అనన్య బిర్లా అచ్చు కావ్య మారన్ పాత్ర పోషిస్తున్నా సరే, ప్చ్, గత సీజన్ ఆకర్షణ ఇప్పుడు లేదు…
మిగిలిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్‌లో టాప్… బాగా ఆడుతున్నారు… జైస్వాల్, సూర్యవంశీ ఆకర్షణలు… దీటుగా పంజాబ్ టీమ్ ఆడుతోంది… ప్రీతి జింతా మరో ఆకర్షణ… ఢిల్లీ కేపిటల్స్ కూడా బాగా ఆడుతోంది… ఐసీసీ చైర్మన్ జైషా సపోర్ట్ ఉన్నా సరే గుజరాత్ టైటాన్స్ ఆటతీరు కూడా సోసో…
ఇలా ఐపీఎల్ ప్రతి జట్టుకూ ఓ కథ ఉంది… కేవలం క్రికెెట్ ఆట కాదు. ఆటను మించిన ఎమోషన్స్… బలాలు, బలహీనతలు… ఓనర్ల ఇమేజ్ కూడా పనిచేస్తోంది… అదీ ఇక్కడ చెప్పదలిచింది… చివరాఖరకు… రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, బెంగుళూరు జట్లు టాప్ ఫోర్‌లో చేరి, బలంగా పోటీపడతాయా..? అదే జరగాలా..?
.
అసలు సిటీల పేర్లతో టీమ్స్ ఉండకూడదు… ఒక కావ్య మారన్ చెత్త నిర్ణయాలకు హైదరాబాద్ మనోభావాలు ఎందుకు దెబ్బ తినాలి..।।
Share this Article