ప్రపంచంలో బహుశా ఇంత దరిద్రమైన ఇంటర్వ్యూ ఇప్పటివరకూ లేదేమో… తెలుగు వదిలేయండి, బహుశా విశృంఖలంగా సాగే కొన్ని భాషల ఇంటర్వ్యూలు, ట్రిపుల్ ఎక్స్ బాపతు చిట్‌చాట్‌లకు మించిపోయింది… అదే అరియానా, రాంగోపాలవర్మ ఇంటర్వ్యూ… వర్మ అనేవాడు ఇంకా జారిపోవడానికి ఏ లోతులూ లేవు అనుకునేవాళ్లకు కనువిప్పు… ఇంకా జారిపోవడానికి ఈ ప్రబుద్ధుడు (ఈ మాట కావాలనే రాయబడుతోంది ఇక్కడ… ఇంకా ఏమీ తిట్టలేక…)… కిందకు తవ్వుతూనే ఉన్నాడు… లేకపోతే ఆ ఇంటర్వ్యూ ఏమిటి..? అరియానాతో ‘భళా ఎంటర్టెయిన్మెంట్స్’ పేరిట విడుదలైన ఆ వీడియో యూట్యూబులో ఉంది… ఏ రాత్రిపూటో రహస్యంగా చూడాలనుకుంటే మీ ఇష్టం… దిగువన లింక్ కూడా ఇచ్చాను… నెవర్, ఇంకా లోతుకు వర్మ పోలేడు అనుకుంటున్నారా..? అక్కడే తప్పులో కాలేశారు… వర్మ ఇంకా పాతాళానికి దిగువన పది లోకాలకు కూడా దిగిపోగలడు… అసభ్యత, అశ్లీలం, అనైతికం, అసహ్యం వంటి పదాల్ని మీరు ఎన్ని వాడినా సరే… ‘‘వాడు’’ ఇక మారడు… (వాడు అనే పదం కూడా కావాలని రాసిందే…) ఇప్పుడు జస్ట్, ఇంటర్వ్యూయర్ ఎక్స్పోజింగుతోనే సరిపోయింది… నీ పిర్రలు నాకు ఇష్టం, నీతో మాట్లాడుతూనే నీతో సంభోగం చేస్తున్నాను నా ఊహల్లో… ఈ స్థాయికి చేరాక, ఇక రాబోయే ఇంటర్వ్యూలకు హద్దేముంది..? అడ్డేముంది..? ‘‘భావప్రాప్తి, సుఖకర భంగిమల దాకా’’ వెళ్లిపోతాడు… చూస్తూ ఉండండి…
ఇదీ సదరు గొప్ప ఇంటర్వ్యూ లింక్… అసలు ఇంటర్వ్యూ అంతా బూతే… అసలు వర్మ ఇంటర్వ్యూలు అంటేనే స్త్రీలు కావాలి, బూతులు తప్ప ఇంకేమీ మాట్లాడొద్దు… వీడొక దర్శకుడు, ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేశాడు, ఇప్పటికీ బూతు సినిమాలు తీస్తుంటాడు అనేది మరిచిపొండి… ఓ సంభోగ నిపుణుడితో మాట్లాడుతున్నట్టే ఇంటర్వ్యూ ఉండాలి… ఇవెందుకు..? వర్మ ఏమైనా సమరం వారసుడా వంటి పిచ్చి ప్రశ్నలు వేయకండి… వంద మంది సమరాలు కూడా వర్మ కాలిగోటికి సరిపోరు… ఆయనది శృంగారం మీద అవసర జ్ఞానం… వీడిది బట్టలిప్పి ఎగిరే అశ్లీలం… ఏమంటాడో తెలుసా..? ‘‘నాకు స్త్రీలతో రిలేషన్ అనేది కేవలం గంట ముచ్చట… సంభోగానికి ఆ టైం చాలదా..? అందుకే గంట దాటాక నో రిలేషన్… అమ్మాయిలను ఇష్టపడే అమ్మాయిలు, అబ్బాయిల్ని ఇష్టపడే అబ్బాయిలు మాత్రమే నాకిష్టం… లెస్బియనిజం ఇష్టపడని మనిషి అసలు మనిషే కాదంటాడు… నేరుగా ఇంటర్వ్యూయర్‌తో అలాగే మాట్లాడుతూ ఉంటాడు… ఆహా అని సదరు లేడీ ఇంటర్వ్యూయర్ హొయలు పోవాలి, ఇంకాస్త ఎక్స్పోజ్ చేస్తూ రెచ్చిపోవాలి…
Ads
అసలు ఇంటర్వ్యూ అంటే సదరు లేడీ యాంకర్‌ను ఎక్కడెక్కడో పట్టేసుకుంటూ… నీలో ఏ పార్ట్స్ అంటే నాకిష్టమో చెప్పగలవా అనడిగేస్తాడు… మరి అరియానా కదా… ఏం ఫ-కిం-గ్ డ్రెస్ వేశావు డియర్ అనగానే వర్మను హత్తుకుపోయింది… నీకూ నాకూ ఎఫైర్ ఉందని అందరూ అనుకుంటున్నారు డియర్ అని కళ్లల్లో కళ్లు పెట్టి గోముగా అడిగేస్తుంది… వర్మ కారణంగానే ఆ బిగ్‌బాస్‌లో ఎంట్రీ సంపాదించి, ఫైనలిస్టుల్లో చేరి… ఆ కృతజ్ఞత బాడీ అంతా నింపుకున్న ఆమె… నా తొడలంటే అందరూ ఇష్టపడతారు, నీకూ ఇష్టమే కదా అవంటే అనేస్తుంది… వర్మ తాజా సినిమాల్లో హీరోయిన్లు అనబడే ఆబ్జెక్ట్స్‌ను రకరకాల యాంగిల్స్‌లో రంజుగా చూపించినట్టే… ఈ ఇంటర్వ్యూలో కూడా అంతే… గతంలో వర్మను జాలేసేది… ఇప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ కూడా లేదు… ఏమాటకామాట అరియానా చాలా తెలివైంది… వర్మకు ఇంటర్వ్యూలు ఎలా ఉంటే ఇష్టమో పట్టేసింది… పట్టు దొరికింది… ఆ కరోనా వైరసుకు ఈమె ఓ డెల్టా ప్లస్ వేరియంట్…!!
Share this Article