.
నటి భీమినేని విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజయవాడలో ఎఐఎస్ఎఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఎందుకంటే..? ఆమె తన ఇన్స్టా ఖాతాకు డబ్బులిస్తే అర్ధనగ్న వీడియోలు, ఇమేజులు చూపిస్తానని ఓ ఆఫర్ ఇచ్చిందట… ఈ కాసుల కక్కుర్తి దందాకు తెరవేసి, ఆమె ఇన్స్టా ఖాతాను స్థంభింపజేయాలని ఆ ఫిర్యాదు సారాంశం… పోలీసులు కేసు కూడా నమోదు చేశారట కూడా..!
స్థూలంగా చూస్తే… అవును కదా, ఏమిటి ఈ అశ్లీల దందా..? తప్పు కదా, యువత డబ్బులు చెల్లించి, ఈ అశ్లీల వీడియోలకు ఎగబడతారు కదా అనిపిస్తుంది… కానీ నాణేనికి మరికొన్ని కోణాలు… అగ్రనేత నారాయణ పదే పదే బిగ్బాస్ షోను, హౌజును వ్యభిచార కొంప అని వర్ణిస్తూ, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంటాడు… అక్కడికి అదొక పెద్ద సామాజిక సమస్య అయినట్టు… అది తప్ప వేరే ప్రజాసమస్యలే లేనట్టు…
Ads
సేమ్, విష్ణుప్రియను టార్గెట్ చేయడం కూడా ఇలాంటిదే… ఏదో టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పొట్ట పోసుకుంటుంది ఆమె… ఆమధ్య బిగ్బాస్ వెళ్లొచ్చింది, డబ్బులొచ్చాయి… ఇప్పుడు ఆట షో ఏదో చేస్తోంది… ఎంతోకొంత డబ్బు వస్తూనే ఉంది కదా, మరెందుకు ఈ గలీజు ఫోటోలు, వీడియోల దందా అంటారా..?

కొంతమేరకు నిజమే… కానీ ఇన్స్టాలో హాట్ వీడియోలు పెట్టి డబ్బు సంపాదించడం అనేది ఇతర దేశాల్లో చాన్నాళ్లుగా ఉన్నదే… పెయిడ్ వ్యూ… ఫ్రీ కాదు… ఐనా నిజంగా డబ్బు పెట్టి అర్థనగ్న వీడియోలు చూసేంత సీన్ విష్ణుప్రియకు ఉందానేది మరో ప్రశ్న… నెలకు 390 రూపాయలట…
నిజానికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, బ్రాడ్ బ్యాండ్ కూడా ప్యాకేజీ ఉంటే… అరచేతిలోనే బోలెడు నీలి వీడియోలు… ఎవరిని ఎవరు ఆపగలరు..? ఎన్ని వీడియోలను డిలిట్ చేసి, బ్యాన్ పెడుతున్నా కుప్పలుతెప్పలుగా ఫ్రీ వీడియోలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి.,. సరే, అదొక గలీజు దందా అనుకుందాం…
కానీ విష్ణుప్రియ మరీ అంత రేంజ్ వీడియోలు ఏమీ పెట్టదు, అదేమీ వ్యభిచారం కూడా కాదు… తనను అలా హాటుగా చూడాలనుకునేవాళ్ల కోరికకు సొమ్ము చేసుకోవడం… ఎవడో ఆసక్తి ఉన్నవాడు డబ్బు చెల్లించి చూస్తే చూస్తాడు… లేదంటే వదిలేస్తాడు… అదేమీ కొన్ని జాతరల్లో బూతు రికార్డింగ్ డాన్సులు, ప్రదర్శన కాదు…
సో, మరీ అంతగా టార్గెట్ చేయాల్సినంత ఇష్యూ అయితే కాదు… ఒకవైపు మంగ్లీ వంటి సింగర్స్ కోట్లకుకోట్ల అక్రమ వసూళ్లకు తెగబడినట్టు పోలీస్ కేసులు నమోదవుతున్నాయి హైదరాబాదులో… పరమ రోత పాటల్ని (కేడీ, ది డెవిల్) జనంలోకి వదులుతున్నారు… కాానీ కొందరేమో విష్ణుప్రియను టార్గెట్ చేస్తున్నారు… హేమిటో..!!
Share this Article