Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీఆర్ఎస్..! ఈ టైటిల్ ఓనర్ ఎవరు..? రూల్స్ ఏం చెబుతున్నయ్..!!

April 13, 2026 by M S R

.

నిన్న కేటీయార్ ఏమన్నాడు..? పదేళ్ల పాలనకాలంలో జనానికీ మాకూ దూరం పెరిగింది అని… అక్షరసత్యం… పాలన విధానాలతో పార్టీ జనానికి విపరీతంగా దూరమైంది… ఆత్మ సమీక్ష, నిజాంగీకారం పట్ల అభినందనలు… ఐతే ఈరోజుకూ జనంలోకిి సరైన పద్ధతిలో వెళ్లే సోయి అధినేతకు లేదు, సెకండ్- థర్డ్ నేతలకు అసలే లేదు…

2027లో పాదయాత్ర చేస్తానన్నాడు… మంచి నిర్ణయమే.,. పాత పాలన వైఫల్యాలు, తెలంగాణకు నష్టదాయక నిర్ణయాల పట్ల జనానికి వివరణో, క్షమాపణో కూడా అవసరం… పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతాం, అధికారంలోకి వస్తాం అనే ఓ భ్రమ రాజకీయాల్లో అలుముకుని ఉంది కదా… బెస్టాఫ్ లక్…

Ads

  • కవిత గురించి మాట్లాడుతూ ‘చెప్పేదేమీ లేదు, పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్లేదు, కానీ ఏడిపించొద్దు’ అన్నాడు… స్టిల్ ఈరోజుకూ రివర్స్ పంథాయే… ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఇంటికి దరిద్రం… అదీ తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, కుటుంబ బంధాల భావన… అందుకే తెలంగాణలో తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల కాళ్లు మొక్కుతారు… బహుశా కేటీయార్‌కు ఇవన్నీ తెలిసి ఉంటాయని మనం అనుకోలేం… ఏమో, గడీల్లో భిన్న సంప్రదాయం ఏమైనా ఉంటుందేమో…

మరోమాట అన్నాడు… టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడం తప్పే… అవును, నిజం… ప్రధాని అవుతాననే పిచ్చి భ్రమల్లో జాతీయ పార్టీగా మారి, బీజేపీయేతర పార్టీల ఎన్నికల ఖర్చంతా భరిస్తాను, డబ్బే ఈ దేశ రాజకీయాలను శాసించేది అనే కలల్లో, తప్పుడు ఊహల్లో బతుకుతూ బీఆర్ఎస్ అని పేరు మార్చి, తెలంగాణ ఆత్మను చంపుకున్న ఫలితం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది… (టీఆర్ఎస్ పేరుకు ఓ చరిత్ర ఉంది, దానికి ఓ విలువ ఉంది)…

  • హఠాత్తుగా కళ్లు తెరిచి మళ్లీ టీఆర్ఎస్ పేరు తీసుకోవడం సాధ్యమేనా..? మరి మొన్న కవిత ఎక్కడో మాట్లాడుతూ ‘పాత పేరు- కొత్త ఎజెండా’ అనేసింది… టీఆర్ఎస్ పేరు ఎవరైనా తీసుకోవచ్చు, బ్యాన్ పీరియడ్ అయిపోయింది అని చెప్పింది… దాంతో అందరూ కవిత చేతిలోనే టీఆర్ఎస్ టైటిల్ ఉంది, ఆ పేరుతో రాబోతోంది అని రకరకాలుగా రాసేశారు… (నిజానికి ఆ పేరు గనుక ఆమెకు దక్కే చాన్స్ ఉంటే, ఆమె కొత్త రాజకీయానికి భలే పంచ్ ఉండేది)…

నో, నో, టీఆర్ఎస్ పేరు సవాలే లేదు… తెలంగాణ జాగృతి పేరే ఖాయం అని ముచ్చట క్లారిఫై చేసింది… కానీ నిజానికి టీఆర్ఎస్ టైటిల్ పరిస్థితి ఏమిటి..? వివరాల్లోకి వెళ్దాం… ఆ టైటిల్ కవిత చేతుల్లోకి రాలేదు… అప్పుడే అది సాధ్యం కాదు… ఎందుకంటే..?

  • సాధారణంగా ఒక గుర్తింపు పొందిన పార్టీ తన పేరును మార్చుకున్నప్పుడు, ఆ పాత పేరు (TRS) వెంటనే వేరొకరికి అందుబాటులోకి రాదు… దీనికి సంబంధించి “కూలింగ్ ఆఫ్ పీరియడ్” (Cooling-off period) ఉంటుంది… ఒక పార్టీ పేరు మార్చుకున్న తర్వాత కనీసం 6 ఏళ్ల వరకు ఆ పాత పేరును వేరే ఏ ఇతర కొత్త పార్టీకి కేటాయించకూడదని ఎన్నికల సంఘం అంతర్గత నిబంధనలు చెబుతున్నాయి…

కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (BRS) గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నది అక్టోబర్ 2022లో… దీనికి ఎన్నికల సంఘం అధికారిక ముద్ర వేసింది డిసెంబర్ 2022లో… లెక్క ప్రకారం చూస్తే, పేరు మారి ఇంకా మూడున్నర ఏళ్లు కూడా కాలేదు… కాబట్టి, ఆ 6 ఏళ్ల నిబంధన ప్రకారం చూసినా… కనీసం 2028 డిసెంబర్ వరకు ఆ పేరును వేరే ఎవరూ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండదు…

3. మళ్ళీ కేసీఆర్ ‘టీఆర్ఎస్’ పేరు కావాలని అడగవచ్చాతీసుకోవచ్చా..?

అవును, ఒకవేళ పార్టీ తన పేరును తిరిగి పాత పేరుగా మార్చుకోవాలని భావిస్తే దానికి అవకాశం ఉంటుంది… అయితే దానికి కొన్ని షరతులు ఉన్నాయి…

  • పార్టీ తీర్మానం…: పార్టీ జనరల్ బాడీ సమావేశమై, పేరును తిరిగి మార్చుకుంటున్నట్టు ఏకగ్రీవ తీర్మానం చేయాలి…

  • ECI దరఖాస్తు…: ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించి, పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి….

  • అభ్యంతరాలు…: పేరు మార్పు ప్రక్రియలో భాగంగా ఈసీ పత్రికా ప్రకటన ఇస్తుంది… ఆ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతుంది…

  • గుర్తు (Symbol)…: ప్రస్తుతానికి ‘కారు’ గుర్తు బీఆర్ఎస్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది… పేరు మార్చుకున్నా ఆ గుర్తు వారికే ఉంటుంది కాబట్టి సాంకేతికంగా పెద్ద ఇబ్బంది ఉండదు…

సో, కేసీఆర్ తిరిగి ఆ పేరు కావాలని కోరుకుంటే, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది… ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం ‘టీఆర్ఎస్’ అనేది ఒక వ్యక్తి సొత్తు కాదు, అది ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ పేరు… ఆ పార్టీకి కేసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు…. కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు, పాత పేరు (TRS) ఆటోమేటిక్‌గా “ఖాళీ” (Vacant) అయిపోయింది…

వారసత్వ హక్కు ఎవరికి ఉంటుంది? … ఒకవేళ పార్టీలో చీలిక వచ్చి, ఒక వర్గం “మేమే అసలైన టీఆర్ఎస్” అని క్లెయిమ్ చేయాలనుకుంటే… అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు ఎటువైపు ఉన్నారనేది ఎన్నికల సంఘం చూస్తుంది… కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో అలాంటి చీలిక ఏమీ లేదు కాబట్టి, ఆ పేరు మీద హక్కు బీఆర్ఎస్ కార్యవర్గానికి (Executive Body) మాత్రమే ఉంటుంది… (శివసేన, ఎన్సీపీ విషయంలో చూశాం కదా... గతంలో చంద్రబాబు తెలుగుదేశాన్ని కూడా)...

కేటీఆర్ చెప్పినట్లు పార్టీ పేరు మార్చడం అనేది వ్యవస్థాగతమైన నిర్ణయం… ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే, అది బీఆర్ఎస్ జనరల్ బాడీ తీర్మానం ద్వారా మాత్రమే జరుగుతుంది… సో, ఆ టీఆర్ఎస్ టైటిల్ మళ్లీ పొందే చాన్స్ కేవలం కేసీయార్‌కు మాత్రమే ఉంది… అదీ పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు మాత్రమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘మీడియా ఫ్యామిలీ’ అనగానేమి..? మంగ్లి జర్నలిస్టా..? సినీ సెలబ్రిటీయా..?
  • టీఆర్ఎస్..! ఈ టైటిల్ ఓనర్ ఎవరు..? రూల్స్ ఏం చెబుతున్నయ్..!!
  • ముఖపుస్తకం కాదు… ఇది అక్షరాలా బాపు మార్క్ పెళ్లిపుస్తకం…
  • గుడి సంప్రదాయమే ‘సుప్రీం’… పాటించాల్సిందే… ధర్మో రక్షతి రక్షితః
  • మీ దుంపతెగ… 90 ఏళ్లు… స్టిల్ హెల్తీ… మీరే చంపేశారేమిట్రా…
  • ఇండియన్ సినిమాపాట @ ఆశా భోస్లే..! వైవిధ్యానికి ఐకన్ ఆమె..!!
  • విష్ణుప్రియ డబ్బు కక్కుర్తి… కానీ అది నేరమా..? అంత ఘోరమా..?
  • ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!
  • పింక్ అక్రమార్కుల పాపాల పుట్టలు పగిలిపోయాయ్… జయహో హైడ్రా…
  • అక్కినేని- అమల ప్రేమ- పెళ్లి ‘నిర్ణయం’ అప్పుడే జరిగిపోయింది..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions