Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రభాస్ ఫుడ్ కల్చర్..! పిల్లికి బిచ్చం పెట్టని ఇండస్ట్రీలో రియల్ హీరో..!!

April 14, 2026 by M S R

.

కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఏదో ఇంటర్వ్యూలో బయటపెట్టిందట… ప్రభాస్ ఫుడ్ కల్చర్ గురించి..! నిజానికి ఆమె చెప్పిన వివరాల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభాస్ రాజరికపు హుందాతనాన్ని, ఆహార సంస్కృతిని అభినందించాలి… అక్కడక్కడా ఎవడెవడో తమకు అలవాటైన నెగెటివిటీని బట్టి ఏవో కూస్తున్నారు గానీ… ప్రభాస్, నువ్వు రియల్ హీరోవి…

ఆమె చెప్పిన వివరాల ప్రకారం… రోజువారీ ప్రభాస్ ఫుడ్ ఖర్చు 2 లక్షలు… అంటే ఏటా 7 కోట్లు… అంతా తను తినడటానికి కాదు… తన చుట్టూ ఉన్నవాళ్ల కడుపులు రుచికరమైన ఆహారంతో నింపడానికి… అసలే పిల్లికి బిచ్చం పెట్టని ఇండస్ట్రీ ఇది… ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలరు… ఎంతసేపూ నిర్మాత డబ్బులతో విలాసాలకు అలవాటైన ప్రాణాలు…

Ads

ఆ వాతావరణంలో తన ఖర్చుతో షూటింగ్ స్పాట్లలో రొయ్యలు, చేపలు, చికెన్, మటన్, పీతలు… వాట్ నాట్..? ఎగిరేవి, ఈదేవి, నడిచేవి, దూకేవి, పాకేవి… అన్నీ రుచి చూపించడం రియల్లీ గ్రేట్… తన సంపాదనకు ఏటా 7 కోట్లు నథింగ్ కావచ్చుగాక… కానీ ఎందరు హీరోలకు ఈ గుణం ఉంటుంది… తిండి పెట్టే కలుపుగోలు గుణం…

చాలామంది ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు… ప్రభాస్ మంచి ఫుడీ అని… మంచి మంచి వెరయిటీల ఫుడ్ స్పాన్సర్ చేస్తాడని,, అదీ తన ఇంటి నుంచి తెప్పిస్తాడని… తనకు సపరేట్‌గా ఓ కుకింగ్ టీం ఉంది… టేస్ట్ అంటే అదీ… రాజు కదా… ఎక్కడా తగ్గేదేలే… ఇలాంటి కడుపులు నింపే ప్రేమను చూపించే హీరోలు నాకు తెలిసి ఒక్క ప్రభాస్ ఒక్కడే ఇండియన్ సినిమాలో…

prabhas

కృష్ణంరాజు మరణించినప్పుడు కూడా… పెద్ద కర్మ రోజున హాజరైన వేలాది మంది అనేక వెరయిటీలతో భోజనం పెట్టించాడు… తన చేతికి ఎముక లేదు… పది మంది సుష్టుగా తింటేనే తన కడుపు నిండినట్టు… వావ్ కదా… అవునమ్మా, అన్నీ చెప్పావు సరే… ప్రభాస్ పెళ్లెందుకు చేయలేదు ఈరోజుకూ..?!

మరీ సల్మాన్ ఖాన్ పేరెందుకులే గానీ… చివరకు సుడిగాలి సుధీర్, మాచిరాజు ప్రదీప్, హైపర్ ఆది తదితరుల జాబితాలో అలాాగే ఉంచేస్తావా తనను..!? ఆ ‘పప్పన్నం’ ఫంక్షన్‌లో పన్నెండు రకాల వెరయిటీలతో పొట్టలు పగిలిపోవాలి ఒక్కొక్కరికీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధో రో కో … ముక్కుతూ మూలుగుతూ… మ్యాచులకు దూరమవుతూ…
  • సినిమా ప్రసార హక్కులు … టీవీ చానల్స్ మధ్య పోటీ …
  • జంధ్యాల హీరోయిన్… సినిమాల్ని పక్కకు తోసేసి, అమెరికా వెళ్లి…
  • ఈ స్వరాల రాణి… రుచుల మహారాణి కూడా…!
  • ప్రభాస్ ఫుడ్ కల్చర్..! పిల్లికి బిచ్చం పెట్టని ఇండస్ట్రీలో రియల్ హీరో..!!
  • బుమ్రాలు కూడా ‘లైన్’ తప్పిన వేళ… కుర్ర బౌలర్లు కుమ్మేస్తున్నారు…
  • రేవంత్ హైబ్రీడ్ మోడల్ కేంద్రం పాటించదగిందే… అదెలాగంటే..?
  • ఆర్ఎస్ఎస్ లింకులు… జడ్జిపై కేజ్రీవాల్ డిఫరెంట్ అటాక్…
  • అహం బ్రహ్మస్మి..! ట్రంప్ కదా, పోప్‌నూ ధిక్కరిస్తాడు, వెక్కిరిస్తాడు..!!
  • సాక్షాత్తూ ఆ దేవదేవుడే ఊరేగింపుగా వచ్చి, మన దగ్గరే ఆగిపోతే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions