సమంతకు చైతూతో పెళ్లి బాగా కలిసొచ్చింది… ఎప్పుడైతే అక్కినేని ఇంటి కోడలు అయ్యిందో అప్పట్నుంచీ ఆమె పాత్రల ఎంపిక మారిపోయింది… ఆ పెళ్లే జరక్కపోతే హీరోల పక్కన అరకొర బట్టలతో పిచ్చిగెంతులు వేస్తూ, అప్రధానంగా ఉండిపోయేది… కానీ పెళ్లయ్యాక ఏదిపడితే అది చేయకూడదనే ఓ సూత్రం పెట్టుకుని, తనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే అన్వేషిస్తోంది… తనలోని నటిని చంపుకుని ఇంటికి పరిమితం కాలేదు… ఆ అన్వేషణలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరీస్ దొరికింది… రాబోయేది డిజిటల్ కాలమే, ఇప్పటికే ఓటీటీలు ఓ రేంజులో దూసుకుపోతున్నయ్… సో, వెంటనే అందులోకి అడుగుపెట్టేసింది వేరే ఆలోచన లేకుండా…! డీగ్లామర్ పాత్రలో… ఆడ పులి రాజి పాత్రలో అదరగొట్టింది… తమిళ, తెలుగు స్థాయి దాటేసి ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయింది… ఐఎండీబీ తాజా ర్యాంకింగుల్లో నాలుగో ట్రెండింగ్ ఆ సీరీస్… మొదటి వంద స్థానాల్లో ఇండియన్ షోలు ఏవీ లేవు… అంటే ఈ వెబ్ సీరీస్ ఏమేరకు హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు… అయితే… రూటు మార్చి, ప్రయోగాలకు రెడీ అంటున్న సమంత అంతే పేరు తీసుకొచ్చే ఓ అవకాశాన్ని ఎందుకు వదులుకుందనేది ఆశ్చర్యమే…
ఆ అవకాశం ఏమిటీ అంటే..? నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నిర్మించే బాహుబలి ప్రీక్వెల్… అంటే రాజమౌళి తీసిన బాహుబలి కథకు ముందస్తు కథ అన్నమాట… అంటే శివగామి, కట్టప్ప తదితరుల ఎర్లీ జీవితాలు, మాహిష్మతి సామ్రాజ్య పాలకులు, రాజకీయాలు గట్రా ఉండే కథ… బాహుబలి రెండు పార్టులు ఎంత హిట్టో తెలుసు కదా… అలాంటి కథనే ఆనంద్ నీలకంఠన్ రాశాడు… అవును, విజయేంద్రప్రసాద్ కాదు… సహజంగానే ఆనంద్ మంచి ఫ్లో ఉన్న రైటర్… 2017లో విడుదలైన ఆ నవల బాగా హిట్టయింది కూడా… దాన్ని రెండు మూడు పార్టులుగా విభజించి, ‘‘బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్’’ అనే ఆ పేరుతోనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరీస్ స్టార్ట్ చేసింది… దేవ కట్టా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం… ముందుగా శివగామి పాత్రకు మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు… తరువాత వామికా గబ్బి అన్నారు… ఒక పార్ట్ షూటింగ్ కూడా మృణాల్తో పూర్తిచేసినట్టు చెప్పారు…
Ads
ఏమైందో ఏమో గానీ… అది ఎంతకూ ముందుకు కదల్లేదు… నెట్‌ఫ్లిక్స్‌కు ఆ ఔట్పుట్ నచ్చలేదనీ, అందుకని ఆ ఫీడ్ అంతా కోల్డ్ స్టోరేజీలో వేసేశారనీ ప్రచారం జరిగింది… అకస్మాత్తుగా ఇప్పుడు వార్తలు ఏమిటంటే..? విశ్వేష్ కృష్ణమూర్తి (ఏఆర్రెహమాన్ 99 సాంగ్స్ తీశాడు) దర్శకత్వంలో కొత్త టీంతో ఈ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట… అర్క్ మీడియా, వన్ లైఫ్ స్టూడియో వాళ్లు నిర్మించాలి, నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయాలి… స్క్రిప్ట్ కూడా వేరేవాళ్లతో రాయించారుట… అందులో శివగామి పాత్రకు సమంతను అడిగారు, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామన్నారు… కానీ ఎందుకో సమంత ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట… నిజానికి ఇది చాలెంజింగ్ పాత్రే… కానీ ప్రతి ఒక్కరూ బాహుబలిలో రమ్యకృష్ణ నటనతో పోల్చుతారనే భావనతో ఆమె వెనక్కి తగ్గినట్టుంది… ఏమో, ఆమెకన్నా మంచి పేరు వచ్చేదేమో… ఎందుకంటే బాహుబలిలో రమ్యకృష్ణది సీరియస్ రోల్… కానీ ఈ వెబ్ సీరీస్ కథలో పాత్ర చాలా డిఫరెంట్, యంగ్ వెర్షన్… బాహుబలిలో ప్రభాస్, రాణాలు హైలైట్ అయ్యారు… కానీ ఆనంద్ నీలకంఠన్ రాసిన కథలో హీరోయిజం లేదు… పైగా శివగామిది చాలా డైమెన్షన్స్ ఉన్న పాత్ర… సమంత అంగీకరించి ఉండాల్సింది…!!
Share this Article