పెద్ద రహస్యమేమీ కాదు… ఈటీవీ వాళ్లు ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు… ఇదీ వార్త… వాళ్లే క్రియేటివ్ పీపుల్ కావాలని ప్రకటనలు కూడా ఇస్తున్నారు కదా, అందరికీ తెలిసిన వార్తే… రాబోయేది ఓటీటీల కాలమే కాబట్టి, డిజిటల్ ఎంటర్టెయిన్మెంట్ యుగమే కాబట్టి రామోజీ ఫిలిమ్ సిటీ లేదా ఈటీవీ సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన స్వాగతించదగిందే… ఇది ఒకప్పటి ఈనాడు, ఈటీవీ కాదు కాబట్టి లేటైంది లేకపోతే నాలుగైదేళ్ల ముందే ఆల్రెడీ స్టార్ట్ చేసేవాళ్లేమో… ఇతరులకన్నా ఓ పదేళ్లు, ఓ పదడుగులు ముందుంటాడు ఆయన… వృద్ధుడై పోయాడు, తన తరువాత తరం, కాదు, ఆ తరువాత తరం పగ్గాలు తీసుకుంటోంది… వాళ్లకూ రామోజీ రేంజ్ దూకుడు ఉండాలనేముంది..? చాలా మంది ఓటీటీ వార్తలు రాశారు… వాటిల్లో ఒక పాయింట్ ఇంట్రస్టింగ్ అనిపించింది… 200 కోట్లు ఖర్చు పెడుతున్నారూ అని…! ఈ విషయం కాస్త చెప్పుకోవాలి… ఇప్పటికిప్పుడు ఖర్చు తప్ప, రాబడి ఇవ్వని ఓటీటీ మీద 200 కోట్ల పెట్టుబడి పెట్టే స్థితిలో ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలిమ్ సిటీ ఉన్నాయా..?
నిజం… హిందీ, ఇంగ్లిషు ఇతర భాషల్లో ఓటీటీలు దూసుకుపోతున్నయ్… తెలుగులో అల్లు అరవింద్ ఆహా పేరిట ఒకటి స్టార్ట్ చేశాడు… ఇంకా ఈ ఫీల్డ్‌లోకి కొత్త పెట్టుబడిదారులు వస్తారు… కానీ ఇప్పుడు ఖర్చు పెడుతూ పోవడమే, రాబడి లేదు… అయితే ఆహా వాళ్లకు కంటెంటు కష్టం… అందుకే ఏదిపడితే అది తోసేస్తున్నారు… కానీ ఈటీవీకి అంత పెట్టుబడి ఇప్పటికిప్పుడు అవసరమా అనేది కూడా ప్రశ్నే… ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌తో తీసిన వాళ్ల సొంత సినిమాలున్నయ్… ఈటీవీ స్టార్టయిన కొత్తలో బోలెడు సినిమాల హక్కులు కొనేశారు… ఇన్నేళ్ల ఈటీవీ చానెళ్ల కంటెంటు ఉంది… ఇంకా వస్తూనే ఉంటుంది… కాకపోతే జనాన్ని రంజింపజేసే కొత్త కంటెంటు కావాలి… సొంతంగా వెబ్ సీరీస్, షోస్, మూవీస్ అవసరం… దానికి ఖర్చు అవసరం… నిజానికి ఖర్చుకన్నా క్రియేటివ్ పీపుల్, మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రధానం… అదొక్కటే ఇప్పుడు కాస్త సందేహాత్మకం… ఎందుకంటే..?
Ads
ఒకప్పుడు ఈటీవీ ఇతర చానెళ్లతో పోటీపడింది… కానీ ఇప్పుడు అది మూడో ప్లేసు… అనాసక్తంగా సాగే సీరియళ్లు దానికి పెద్ద మైనస్… ఈరోజుకూ ఈటీవీ టాప్ రేటింగ్ ప్రోగ్రాముల్లో ఈటీవీ న్యూస్ బులెటిన్ ఉంటుంది తప్ప మరో వినోద ప్రోగ్రాం ఉండదు… దాని బలం జబర్దస్త్,.. అది లేకపోతే ఈటీవీ మరీ నాలుగో ప్లేస్కన్నా కిందకు పడిపోయేది ఎప్పుడో… ఈ అల్లాటప్పా నిర్వహణ ఓటీటీకి సూట్ కాదు… జనాన్ని ఓటీటీకి రప్పించాలంటే కొత్త పోకడలు పోయే కంటెంటు కావాలి… అది యూట్యూబులోనూ బోలెడంత దొరుకుతోంది… వాటిని కాదని ఈ ఓటీటీకి జనం రావాలంటే వాటిని మించిన క్రియేటివిటీ కావాలి… అదే ఇప్పుడు ఈటీవీలో లోపించింది… కొత్తగా తీసుకుంటున్న టీమ్స్ ఏమైనా క్లిక్ అవుతారేమో చూడాలి…
మిగతావి చూద్దాం… ఈనాడు రేడియోలు అంతంతమాత్రం… ఈనాడు డౌన్ ఫాల్ ఎప్పుడో స్టార్టయింది… పాండెమిక్ కారణంగా ఏబీసీ, ఐఆర్ఎస్ తాజా నివేదికలు ఆపేసింది గానీ, లేకపోతే దాని పతనం ఏ రేంజులో ఉందో తేలిపోయేది… ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ హోప్లెస్… ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి వంటివి ‘‘బొకే పేరిట’’ సబ్స్క్రిప్షన్ డబ్బు కుమ్మడానికే తప్ప అవి ఎవరూ పెద్దగా చూడరు… ఫిలిమ్ సిటీ పరిస్థితీ అంతే… భారీగా ఆశలు పెట్టుకున్న ఈటీవీ భారత్ కూడా క్లిక్ కాలేదు… ఆమధ్య పలుభాషల్లో పిల్లల చానెళ్లు స్టార్ట్ చేశారు, దాని భవిష్యత్తు ఏమిటో చూడాల్సి ఉంది… ఆల్రెడీ చతుర, విపుల, సితార, తెలుగువెలుగు వంటి మ్యాగజైన్ల ప్రింటింగ్ ఆపేశారు… అంటే, రామోజీ గ్రూపుకి సంబంధించి ఏదో భారీ తేడా కొడుతోంది… అందుకే ఓటీటీ మీద అంత ఖర్చు పెడతారా అనే సందేహం తలెత్తింది..!! అయితే… ఓటీటీ ఆలోచనను మాత్రం ఆహ్వానించాలి… వెగటు వాసన కొడుతున్న ఆహా ఓటీటీకి మంచి ప్రత్యామ్నాయ ఓటీటీ అర్జెంటుగా అవసరం కాబట్టి…!!
Share this Article