Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చాణక్య నీతి..! బాబుకన్నా పదాకులు మోదీ ఎక్కువే చదివాడు..!!

April 21, 2026 by M S R

.

ఈ స్టోరీ వింటుంటే సినిమా స్క్రిప్ట్ కంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది…! అసలు ఆ రోజు ఏం జరిగిందో, మన “చంద్రన్న” ప్లానింగ్ ఎలా ఉండేదో కాస్త ఫన్నీగా, సినిమాటిక్ స్టైల్‌లో చెప్పుకుందాం….

సీన్ 1: కాలేజీ నాటకం – అసలు ట్విస్ట్! అనగనగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణ స్నేహితులు… ఒకరు మన నారా చంద్రబాబు నాయుడు, మరొకరు దివంగత ఎంపీ శివప్రసాద్... అప్పట్లో కాలేజీలో ఒక నాటకం వేయాలని ఫిక్స్ అయ్యారు… శివప్రసాద్ గారు అప్పటికే నటనలో ‘ఈజ్’ ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకే హీరో పాత్ర దక్కింది… మన బాబు గారికి దక్కింది కామెడీ రోల్…

Ads

కానీ అక్కడే అసలు కథ మొదలైంది! బాబు గారికి చిన్నప్పటి నుంచే ‘సెంటర్ స్టేజ్’ లో ఉండడం ఇష్టం అనుకుంటా… తెల్లవారేసరికి సీన్ రివర్స్…!

శెనక్కాయల బస్తా… సీక్రెట్ మంత్రం! పొద్దున్నే రిహార్సల్స్‌కి వెళ్ళిన శివప్రసాద్ గారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది… టీచర్ గారు వచ్చి, “రేయ్ శివా… నువ్వు కామెడీ చెయ్, బాబు హీరో!” అని ఆర్డర్ వేశారు…

శివప్రసాద్ గారికి ఏమీ అర్థం కాలేదు… అప్పుడు పక్కనున్న స్టూడెంట్స్ టీచర్ గారి ఇంట్లో ఉన్న ఓ మూలను చూపించారట… అక్కడ ఏముంది? ఓ నిండు శెనక్కాయల బస్తా! —

🎭 సీన్ 2: దోస్త్ మేరా దోస్త్.. కానీ ‘కోటా’ నాదే! మరి ఆ శెనక్కాయలు ఎక్కడివి? అక్కడే బాబు గారి ‘మేనేజ్మెంట్ స్కిల్స్’ కనిపిస్తాయి… ఆ మరుసటి రోజు శివప్రసాద్ గారి దగ్గరికి ఆయన మరో స్నేహితుడు వచ్చి, “రేయ్ శివా.. ఎవరో రాత్రికి రాత్రి మా పొలంలో శెనక్కాయలు దొంగిలించారురా” అని మొరపెట్టుకున్నాడట…

అప్పుడు శివప్రసాద్ గారికి అసలు విషయం ‘ట్యూబ్ లైట్’ వెలిగినట్టు వెలిగింది…

  1. చాణక్యం…: తనకి కావాల్సిన హీరో పాత్ర కోసం ప్లాన్ వేశారు…

  2. వ్యూహం…: టీచర్‌కు శెనక్కాయల బస్తాను ‘సమర్పించుకున్నారు’…

  3. ట్విస్ట్…: ఆ బస్తా కూడా తన సొంతం కాదు… స్నేహితుడి పొలంలో నుంచి ‘ఫ్రీ’గా తెచ్చింది..!

“చిన్నప్పుడే హీరో పాత్ర కోసం ఇన్ని ఎత్తుగడలు వేస్తే.. ఇక పెద్దయ్యాక రాజకీయాల్లో ఇంకెన్ని ప్లాన్లు ఉండాలి?” అని ఆ ఇంటర్వ్యూలో శివప్రసాద్ గారు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు…


సీన్ 3: పచ్చ మీడియా ‘జాకీలు’! అప్పటి శెనక్కాయల బస్తా నుంచి ఇప్పటి ‘వెన్నెముక’ నిర్ణయాల వరకు… బాబు గారి ప్రతి అడుగు వెనుక ఇలాంటి ఏదో ఒక ‘సరుకు’ ఉంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి…

మరి ఈ కథలో వింతేముంది? అప్పట్లో టీచర్ గారిని శెనక్కాయలతో మేనేజ్ చేస్తే… ఇప్పుడు మన ఎల్లో మీడియా (ఈనాడు, జ్యోతి, TV5) వారు ఆయన్ని ‘తోపు, తురుము’ అంటూ ఆకాశానికి ఎత్తేయడానికి అహర్నిశలు శ్రమిస్తుంటారని ఈ కథ సారాంశం..!


నాడు నాటకంలో హీరో పాత్ర కోసం శెనక్కాయల బస్తా… నేడు రాజకీయ తెరపై హీరోగా ఉండటానికి ఇంకెన్ని బస్తాలో ఆ భగవంతుడికే ఎరుక! ఏది ఏమైనా మన ‘చంద్రన్న’ స్ట్రాటజీయే వేరబ్బా!

ఇంతటి అపర చాణక్యుడు మోడీ ఎదుట ఎందుకు మోకరిల్లాడు… భలేవాడే, అదే చాణక్యం అంటారు… అంటే, తనకు మించిన చాణక్యుడికి ఎదుట సాగిలబడటం కూడా చాణక్యమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions