Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అణుదాడికి అమెరికా రెడీ..! న్యూక్లియర్ అలర్ట్ జారీ..!!

April 21, 2026 by M S R

.

Pardha Saradhi Potluri ….. న్యూక్లియర్ అలెర్ట్?
అమెరికా సహనం కోల్పోతున్నదా?
పెంటగాన్ న్యూక్లియర్ అలెర్ట్ సిస్టమ్ ని ఆక్టివేట్ చేసింది!
న్యూక్లియర్ అలెర్ట్ సిస్టమ్ ని ఆక్టివేట్ చేయడం అంటే….

అమెరికా అధ్యక్షుడు అత్యవసర సమయంలో తన ఎమర్జెన్సీ నెట్వర్క్ ని ఆక్టివేట్ చేస్తాడు.
‘All Stations ’ అనే కాల్ సైన్ ని అత్యవసర నెట్వర్క్ ద్వారా మెసేజ్ వెళుతుంది. అణు దాడి చేసే ముందు ‘All Stations ’ అనే మెసేజ్ వెళుతుంది…. అణు బాంబులని ప్రయోగించగల బాంబర్స్, అణు మిసైల్స్ ని ప్రయోగించే అన్ని సబ్ మెరైన్స్, భూమి మీద నుండి ప్రయోగించే అణు బాలిస్టిక్ మిసైల్స్ సెంటర్స్ కి ఒకేసారి సందేశం వెళుతుంది అంటే అణు దాడి కోసం సిద్ధంగా ఉండండి అని ‘All Stations ’ అనే మెసేజ్ కి అర్ధం!

Ads

రేపటితో కాల్పుల విరమణ ముగుస్తుంది.
ఇరాన్ రెండవ దఫా చర్చలకి నో చెప్పింది!
గల్ఫ్ లో మొహరించి ఉన్న అణు విమాన వాహక యుద్ధ నౌక ఐసన్ హోవర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  IRGC 6 కమికాజ్ డ్రోన్లతో దాడి చేసినట్లుగా ప్రకటించింది కానీ ఇరాన్ డ్రోన్ దాడివల్ల ఐషన్ హోవర్ దెబ్బ తిన్నదా లేక అగ్ని ప్రమాదమా అన్నది తెలియరాలేదు!

‘All Stations ’ అనే మెసేజ్ మాత్రం అణు దాడి కోసమే అని స్పష్టమవుతున్నది!
కోడ్ వర్డ్ అల్ స్టేషన్స్ ని డీ కోడ్ చేస్తేనే కానీ మెసేజ్ యొక్క పూర్తి అర్ధం ఏమిటో తెలియదు. అధ్యక్షుడి ద్వారా వచ్చే ప్రతీ కోడ్ కి ప్రతీ సబ్ మెరైన్ లో, బాంబర్స్ లలో, బాలిస్టిక్ మిసైల్ సెంటర్స్లలో ఆల్ స్టేషన్స్ ని డీ కోడ్ చేయడానికి ప్రత్యేకంగా ఆదేశాలు ఉండే డీ కోడింగ్ మెసేజెస్ లాకర్స్ భద్రపరచబడి ఉంటాయి.
అధ్యక్షుడి ఆదేశాలని ఖచ్చితంగా పాటించాల్సిందే!

ఈ రోజుకి అమెరికా కి 100 బిలియన్ డాలర్స్ ఖర్చు అయ్యాయి యుద్ధం కోసం. యుద్ధంలో కోల్పోయిన ఆస్తుల విలువ వేరేగా ఉంది!
డాలర్ విలువ, స్టాక్ మార్కెట్ నష్టాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, బంగారం ఇంకా ధర పెరగడం లాంటివి జరుగుతాయి కొద్ది గంటలలో!
రెండు రోజుల క్రితం చైనా భారీగా వెండి కొనుగోలు చేసింది బహిరంగ మార్కెట్లో! చైనా కొన్న వెండి భౌతికంగా కొన్నదే!
So! చైనా ముందే తెలుసుకొని ఉండవచ్చు ట్రంప్ ఇరాన్ మీద అణు దాడికి దిగవచ్చు అని!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అణుదాడికి అమెరికా రెడీ..! న్యూక్లియర్ అలర్ట్ జారీ..!!
  • చాణక్య నీతి..! బాబుకన్నా పదాకులు మోదీ ఎక్కువే చదివాడు..!!
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • అసలు ఖరీదు లక్షన్నర… ఖాళీ సీసాల్లో వంద రూపాయల మందు నింపి…
  • సింగర్ మధుప్రియ… నువ్వు పాడితేనే KCR ఓడి, ఇంట్లో కూర్చున్నది..!!
  • ‘తప్పకుండా నేనే విచారిస్తా’… కేజ్రీవాల్‌కు లేడీ జస్టిస్ భేషైన జవాబు…
  • ‘నా కొడకా’ … హెడింగుల్లో పత్రికలకు పబ్లిషింగ్ ఎటికేట్ అక్కర్లేదా..?
  • తిలక్ వర్మ..! భేష్… కానీ సరిపోదు… ముందుంది అసలు పరీక్ష…!!
  • గురుపరామర్శ వరకూ రాధిక గుడ్… కానీ ఆ ‘ప్రచారం’ ఆక్షేపణీయం…
  • రచయితగా హిట్… దర్శకుడిగా ఫ్లాప్… యండమూరికి ఓ ‘మరక’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions