.
అసలు ఏమైంది టాటా గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!! ఈ మాట అనడానికి కారణం ఉంది… అసలు టాటా గ్రూపు అంటేనే భారతీయత, విశ్వాసం, విలువలు, ప్రమాణాలు అని పేరు కదా… టీసీఎస్‌లో ‘కార్పొరేట్ జిహాద్ స్కాం’ గురించి చదివాం… అది బయటపడ్డాక ఈ గ్రూపు ఏవేవో విఫల సమర్థనలతో ఏదో కవరింగు చేస్తున్న తీరూ చూశాం…
సరే, టాటా గ్రూపుతో సంబంధం లేకపోయినా సరే, అదే ‘కార్పొరేట్ జిహాద్’ వలలో కొట్టుమిట్టాడుతున్న లెన్స్ కార్ట్ వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి… ఇక్కడా సదరు ఫౌండర్ ఏవేవో విఫల సమర్థనలకు దిగాడు… తాజాగా అదే టాటా గ్రూపుకి చెందిన ఎయిర్ ఇండియాలో కూడా అదే నో బిందీ, నో తాళి, నో హిందూ డ్రెస్సింగు అనే వివాదం కలకలాన్ని క్రియేట్ చేస్తోంది…
Ads
1. ఎయిర్ ఇండియా & లెన్స్‌కార్ట్: ‘బొట్టు’ వివాదం …. ఈ వివాదం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది… ఎయిర్ ఇండియా, లెన్స్‌కార్ట్ సంస్థల అంతర్గత ‘గ్రూమింగ్ గైడ్‌లైన్స్’లో బొట్టు (బిందీ), సింధూరం, మంగళసూత్రం ధరించడంపై ఆంక్షలు ఉన్నట్లు వెల్లడైంది…
-
ఎయిర్ ఇండియా…: టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టాక, సిబ్బంది లుక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చే క్రమంలో ఈ నిబంధనలు తెచ్చిందట… అయితే, వెస్ట్రన్ దుస్తులపై బొట్టు పెట్టుకోకూడదనే నిబంధన భారతీయతను కించపరచడమేనని నెటిజన్లు మండిపడ్డారు… దీనిపై సంస్థ స్పందిస్తూ అది పాత మాన్యువల్ అని క్లారిటీ ఇచ్చింది…
-
లెన్స్‌కార్ట్…: హిజాబ్ ధరించవచ్చు కానీ బొట్టు పెట్టుకోకూడదు అనే నిబంధనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది… సీఈఓ పీయూష్ బన్సల్ వెంటనే జోక్యం చేసుకుని, అన్ని రకాల మతపరమైన, సాంస్కృతిక చిహ్నాలకు (హిజాబ్, తిలకం, టర్బన్, మంగళసూత్రం) అనుమతిస్తూ కొత్త స్టైల్ గైడ్‌ను విడుదల చేశాడు…
2. టీసీఎస్ (TCS) నియామక కుంభకోణం (Recruitment Scandal) … డ్రెస్ కోడ్ వివాదాల మధ్య, ఐటీ దిగ్గజం TCS లో భారీ నియామక కుంభకోణం బయటపడటం కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేసింది…
-
ఏమిటి ఈ స్కామ్?…….. టీసీఎస్ లోని ‘రిసోర్స్ అలోకేషన్ సెలెక్షన్’ (RMU) విభాగానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు, స్టాఫింగ్ కంపెనీలతో చేతులు కలిపి, లంచాలు తీసుకుని అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది…
-
తీసుకున్న చర్యలు……: ఈ అవినీతికి పాల్పడిన ఆరుగురు అధికారులను, ఆరు స్టాఫింగ్ ఏజెన్సీలను కంపెనీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది… గ్రూప్ ఎథిక్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు టాటా గ్రూప్ ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించింది…
3. విశ్లేషణ: కార్పొరేట్ పాఠాలు… ఈ మూడు సంఘటనలు మూడు రకాల పాఠాలను నేర్పుతున్నాయి…
-
సాంస్కృతిక స్పృహ…: గ్లోబల్ లుక్ పేరుతో భారతీయ సంస్కృతిని విస్మరించడం వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే భ్రమాత్మక భావనను ఎయిర్ ఇండియా, లెన్స్‌కార్ట్ ఉదంతాలు నిరూపించాయి…
-
పారదర్శకత…: టాటా వంటి విశ్వసనీయ సంస్థల్లో కూడా నియామక ప్రక్రియలో లోపాలు ఉండవచ్చని, నిరంతర పర్యవేక్షణ అవసరమని టీసీఎస్ స్కామ్ హెచ్చరించింది….
-
దిద్దుబాటు చర్యలు…: వివాదం తలెత్తినప్పుడు వెంటనే స్పందించి, తప్పులను సరిదిద్దుకోవడం (లెన్స్‌కార్ట్ చేసినట్లుగా) కంపెనీల బాధ్యత…. కానీ టాటా నుంచి ఆ స్పందన కొరవడింది…
కార్పొరేట్ సంస్థలు కేవలం లాభాలు లేదా గ్లోబల్ ఇమేజ్ మాత్రమే కాకుండా, తమ ఉద్యోగుల భావోద్వేగాలను, ఇండియన్ కల్చరల్ వాల్యూస్, నైతిక విలువలను గౌరవించినప్పుడే అవి దీర్ఘకాలం మనగలుగుతాయి…
Share this Article