Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…

April 22, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. వెంకటేష్ సినీయాత్రలో మరో మైలురాయి 1991 జనవరిలో వచ్చిన ఈ శత్రువు సినిమా . సూపర్ హిట్ సినిమా . కధను నేసిన సత్యమూర్తిని తప్పక అభినందించాలి . ఎక్కడా స్లో కాదు . బిరబిరా సాగిపోతుంది . అందుకు తగ్గ బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని బ్రహ్మాండగా దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ . నిర్మాత M S రాజుకి మొదటి సినిమా .

వీటన్నింటికి తగ్గట్లు సత్యమూర్తి డైలాగులు . ముఖ్యంగా చెప్పుకోవలసింది కోట శ్రీనివాసరావు పాత్ర , ఆహార్యం , డైలాగ్స్ , వాటి డిఫరెంట్ డెలివరీ , మేనరిజం . ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడురా బాబో ! ఈ బాబో ఊతపదం ఈరోజుకి వాడుకుంటున్నారు . మాట మాటకు అందరికీ థేంక్స్ అనటం . మరో హైలైట్ . ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకోండి అనటం . ఇలా కోట గారి డైలాగులు న భూతో న భవిష్యతి . కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు .

Ads

ఆయన తర్వాత చెప్పుకోవలసింది వెంకటేష్ , విజయశాంతి . ఇద్దరూ చాలా ఎనర్జిటిగ్గా చేసారు . చాలా ఇంటెన్స్ పాత్రలు . అలాగే డ్యూయెట్లలో అదరగొట్టేసారు . వీరి తర్వాత సంగీతం . ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో విషాద పాత్రలు లేక సీరియస్ పాత్రలు వేసిన సంగీత… ఈ సినిమాలో లాయరుగా నటించిన విజయకుమార్ భార్యగా, కనకపోయినా స్వంత బిడ్డల్లాగా పెరిగిన ముగ్గురు లాయర్లను ఆప్యాయంగా చూసుకునే పెంపుడు తల్లిలాగా చాలా బాగా నటించింది . హిలేరియస్ గా కూడా నటించింది .

నిజాయితీ కల లాయరుగా విజయకుమార్ బాగా నటించారు . ఇతర పాత్రల్లో మహర్షి రాఘవ , బాబ్ ఏంథొనీ , ఆనందరాజ్ , పి యల్ నారాయణ , నగేష్ , జయప్రకాష్ రెడ్డి , కెప్టెన్ రాజు , బ్రహ్మానందం , బాబూ మోహన్ , కల్పనారాయ్  తదితరులు నటించారు . చింటూ పాత్ర వేసిన మాస్టర్ సతీషుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి . అందరూ బాగా నటించారు .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , సి నారాయణరెడ్డి , సిరివెన్నెల వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర చాలా శ్రావ్యంగా పాడారు . బాగా హిట్టయ్యాయి కూడా . ముఖ్యంగా పొద్దున్నే పుట్టింది చందమామ , అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు డ్యూయెట్లు బాగా పాపులర్ అయ్యాయి .

మాట వింటారా అంటూ సాగే పాట Made for each other పోటీలో చాలా హుషారుగా సాగుతుంది . బాగా చిత్రీకరించబడింది . యమ తాకిడీ మొగ్గా బుగ్గా అందే వేళలో డ్యూయెట్ సాంగ్ కూడా బాగుంటుంది . సుందరం , ప్రభుదేవా , శివసుబ్రమణ్యం డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు . సినిమాను ఉరికించటానికి ఇవన్నీ దోహదపడ్డాయి .

సినిమాలో ఫైట్లను కంపోజ్ చేసిన రాజుని అభినందించాలి . ఈ సూపర్ హిట్ సినిమా తమిళంలోకి డబ్ అయింది . హిందీ , కన్నడ భాషల్లోకి రీమేక్ అయింది . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూ ఉంటుంది . యూట్యూబులో ఉంది . It’s a wonderful crime , action-oriented entertainer . మళ్ళీ మళ్ళీ కూడా చూడొచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!
  • పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…
  • ఏమైంది ఈ గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!
  • నిన్ను అమ్మమ్మా అనడమేంటి..? ఓ కేరక్టర్ సోయి లేని వ్యాఖ్యలు…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions