.
జబర్దస్త్ షోపై, నిర్వాహకులపై నాగబాబు చాలా కామెంట్లు చేశాడు గతంలో… దాన్ని వదిలిపెట్టేసి వేరే చానెల్‌లో అలాంటిదే ఓ కామెడీ షో చేయించాడు, తనే జడ్జి… ఫ్లాప్… తరువాత టీవీకి దూరమయ్యాడు… ఇన్నేళ్ల తరువాత మళ్లీ జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చాడు అన్నీ మరిచిపోయి… రాత్రి తను జడ్జిగా ఉన్న షో ప్రసారమైంది…
సేమ్, అదే భజన… మోత… నిజానికి తన కాలంనాటి బ్యాచ్ ఇప్పుడు లేదు… హహహ అని పగలబడి నవ్వడం తప్ప జడ్జిలు చేసేదేమీ ఉండదు కూడా… ఎవరెవరినో తీసుకొచ్చి జడ్జి కుర్చీల్లో కూర్చోబెట్టారు… అందరూ ఫెయిల్… ఒక్క కృష్ణ భగవాన్ స్పాంటేనియస్ పంచులు మాత్రం కాస్త నవ్వొచ్చేవి… ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకే పరిమితం చేసిన ఇంద్రజను దీనికి జడ్జిని చేయడం మంచి నిర్ణయమే, ఆమె కాస్త పద్దతిగానే ఉంటుంది…
Ads
- కొత్తవాళ్లను పెట్టీ పెట్టీ ఫెయిలై, మళ్లీ వదిలేసి వెళ్లిపోయిన వాళ్లను తీసుకొచ్చారు కొందరిని, చాన్నాళ్లు ఉండలేదు ఎవరూ… భాస్కర్, రాఘవ, ఫైమా, రోహిణి, ఆటో రాంప్రసాద్ వంటి కొందరే రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు… సుధీర్, ఆది, చంద్ర, గెటప్ శ్రీను వంటి చాలామంది సీనియర్లు ఆ షో వదిలేశారు ఎప్పుడో…
జడ్జిల విషయంలో కూడా బహుశా ఇక ప్రయోగాలు ఉండవు…, చేసీ చేసీ, చేతులు కాల్చుకుని మల్లెమాల టీమ్ ఇక ఈ ఇద్దరికే ఫిక్స్ అవుతారేమో… (నాగబాబు రాగద్వేషాలు టీమ్స్, కమెడియన్లపై ఎంతోకొంత ఉంటుంది, ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో చూడాలిక)…
- ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు… జడ్జిలు, కమెడియన్లు ఎట్సెట్రా… యాంకర్ రష్మి మాత్రం పక్కా లోకల్… చివరకు అనసూయ కూడా ఆమెను అక్కడి నుంచి పీకేయడానికి ట్రై చేసి, తనే వెళ్లిపోయింది తప్ప రష్మి వెళ్లలేదు… చివరకు ఆమధ్య ఓ మగ యాంకర్‌ను తోడుగా పెట్టారు, తనూ ఫెయిల్… చివరకు సోలో యాంకర్ రష్మియే.,.
అందరూ వేరే చానెళ్లలో వేరే షోలు, స్పెషల్స్ చేస్తుంటారు, రియాలిటీ షోలలో పాల్గొంటారు కానీ రష్మి వెళ్లదు… ఈటీవీలోని ఆ రెండు షోలు మాత్రమే… నిజానికి ఈటీవీ జబర్దస్త్ మినహా అదే తరహాలో జీతెలుగు, స్టార్‌మా ఏవో కామెడీ షోలు చేయబోయి చేతులు కాల్చుకున్నాయి… ఈమధ్య జెమిని టీవీలో మాస్ జాతర అని ఓ కొత్త కామెడీ షో స్టార్ట్ చేశారు…ప్రతి స్కిటులో పది మంది దాకా, కొత్త యాక్టర్స్ చాలామంది… పర్లేదు… టీమ్స్, జడ్జిలు, యాంకర్స్ అందరూ బాగా సెటయ్యారు… కానీ ఆ టీవీ చానెల్ రీచ్ తక్కువ కదా, ఎక్కువగా ఈ షో జనంలోకి పోవడం లేదు…
- జబర్దస్త్ రెగ్యులర్ రేటింగ్స్ కూడా తక్కువే… కాకపోతే యూట్యూబులో వీడియోలు పెట్టి, ఆ సంపాదనతో నడిపిస్తున్నారు… సరే, పాలిటిక్స్ విషయానికి వద్దాం… రాజకీయం అనేది సీరియస్ అఫయిర్… నాయకుడు ఎప్పుడూ తమకు అందుబాటులో ఉండాలని జనం కోరుకుంటారు… నాగబాబు ఓ ఎమ్మెల్సీ ఇప్పుడు, జనసేన ప్రధాన కార్యదర్శి… తనకు డబ్బుకు కొదవ లేదు, మరి ఈ వెగటు బూతుల జబర్దస్త్ షో దేనికి..? ఏం ప్రయోజనం..? ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఓ అధికారిక, రాజకీయ హోదాలో ఉన్నప్పుడు ఆ వెగటు స్కిట్లకు నవ్వడం అంత ఉచితం అనిపించదు… జబర్దస్త్ షో ఎలాంటిదో, దాని విలువేమిటో అందరికీ తెలిసిందే కదా…
రోజాకు కూడా ఇదే పిచ్చి… జబర్దస్తే తనను మంత్రిని చేసిందని చెప్పేది… సరే, మంత్రయ్యాక ఇక బాగుండదని మానేసింది… కానీ ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ టీవీ షోలు మొదలుపెట్టేసింది అర్జెంటుగా… పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తుంటాడు, బాలయ్య ఎప్పుడూ రాజకీయాల్లో ఉన్నాడనే మాటే గానీ రెగ్యులర్ సినిమా ఆర్టిస్టు తను… అంతెందుకు, ఆ ఎన్టీయారే ఓడిపోగానే సినిమాలు మొదలుపెట్టేశాడు… చేయడం తప్పు అని కాదు… రాజకీయాలు ఫుల్ టైమ్ జాబ్… జనంలో ఉండాల్సిన జాబ్… జనానికి అందుబాటులో ఉండాల్సిన జాబ్… ప్చ్, హేమిటో మన నాయకులు..!!
Share this Article