.
ఆషు రెడ్డి అంటే ఎవరూ అనడిగాడు ఓ పెద్దాయన… విషయం తెలియదు, కానీ ఆమధ్య రాంగోపాలవర్మ అనబడే ఓ వెగటు కేరక్టర్ ఓ ఆడలేడీ కాలివేళ్లు చీకుతూ రోత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు గుర్తుందా అన్నాను… ఓహ్, వాడేనా..? గుర్తుంది, గుర్తుంది అని అసహ్యంగా మొహం పెట్టి ఆమె పేరేనా ఆషు రెడ్డి, వామ్మో అన్నాడు…
ఇంతకీ కథేమిటి, మీ ముసలి మనసు కూడా చలించిందా అని జోకేస్తే… నా బొంద, ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంటానని 10 కోట్లు టోకరా వేసిందట, ఆ వార్త చదువుతున్నాను అన్నాడు… వర్మ కళ్లకు ఎవరైనా శ్రీదేవిలాగే కనిపిస్తారు గానీ, ఈ ఆషురెడ్డికి నిజంంగా అంత సీనుందా ఆమెకు అనుకుని నేనూ ఆ వార్త చదివా…
Ads

ఆమె పేరు కొయ్య వెంకట అశ్వినిరెడ్డి, సింపుల్‌గా ఆషు రెడ్డి… టీవీలు, ఇతరత్రా ప్రోగ్రాములు చేసుకునే ఓ సాదాసీదా కేరక్టర్ ఆమె… వర్మకు ఈ బిగ్‌బాస్ టీమ్‌తో సాన్నిహిత్యం ఏడ్చింది కదా… అరియానా దగ్గర నుంచి ఆషురెడ్డి దాకా ఆ హౌజులోకి తోసేస్తూ ఉంటాడు… కొన్నాళ్లు హౌజులో ఉండి, అర్థంతరంగా బయటికి నెట్టేయబడింది, అది వేరే కథ…
ఇప్పుడు కేసు ఏమిటయ్యా అంటే… హైదరాబాద్, షేక్‌పేటలో ఎనుముల సత్యనారాయణ… ఆయన కొడుకు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి… 2018లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఈమె టచ్‌లోకి వచ్చింది… నేను అమెరికాలో చదువకున్నా, సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చాను అని చెప్పుకుందిట… తరువాత తనపై లవ్వు అని చెప్పిందట… ఇక ముదిరింది…

నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నమ్మించిందట… ఇంకేం… ఆమె అడిగేకొద్దీ బంగారం, కారు, ప్రాపర్టీస్ కొనుగోలు చేయించిందట… బంగారం ఎంతో తెలుసా..? 5 కిలోలు… పంతుళ్లను పిలిచి అదుగో నిశ్చితార్థం అని చెప్పి హడావుడి చేయించారట ఆషురెడ్డి కుటుంబం… ఆమే కాదు, ఆమె సోదరికీ 50 లక్షలు సమర్పించుకున్నాడట బావ గారు… తరువాత పెళ్లి లేదు, గిళ్లీ లేదుపో అని మొహం చాటేసిందట… అవును, హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసులో ఉన్న వివరాలే…
ఐతే నిజంగా అంత ఉందా… ఎక్కడో ఏదో తేడా కొడుతోంది సీనా… తను లండన్‌లో ఉంటాడు, ఎంగేజ్‌మెంట్ కూడా కాలేదు… పెళ్లి చేసుకుంటానని మగాళ్లు నమ్మిస్తారేమో గానీ ఆడవాళ్లు నమ్మించి సొమ్ములు గుంజుతారా..? అదీ ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో ఉండే ఆమెను అంత గుడ్డిగా నమ్మాడా ఆ ధర్మేంద్రుడు… ఏకంగా 10 కోట్ల చెల్లింపులా..? ఏమోలే…. లోగుట్టు పెరుమాళ్లకెరుక… సీసీఎస్ సరిగ్గా తవ్వితే అసలు నిజాలేమిటో బయటికొస్తాయి..!!
Share this Article