ఇన్‌సెన్సిటివ్… సమస్య సున్నితత్వం కూడా అర్థం చేసుకోకుండా పిచ్చి వ్యాఖ్యలు చేయడం, దురుసుగా వ్యవహరించడంలో ఎర్ర పార్టీ, గులాబీ పార్టీ, కాషాయ పార్టీ, పచ్చ పార్టీ అని భేదాలేమీ ఉండవ్… బేసిక్‌గా రాజకీయ నాయకులందరూ అలాంటోళ్లే… రాజకీయాల్లోకి వచ్చాక అలా తయారవుతారో లేక అలాంటోళ్లు మాత్రమే రాజకీయాల్లో నెగ్గుకొస్తారో తెలియదు గానీ… కొందరి వ్యవహార ధోరణి చివరకు ఆ పార్టీ పెద్దలను కూడా చిరాకుపట్టిస్తయ్, సమర్థించడానికి కూడా ఇబ్బందిని క్రియేట్ చేస్తయ్… ఎంసీ జోసెఫిన్ అని కేరళలో ఓ కేరక్టర్… చిన్నాచితకా స్థాయేమీ కాదు… సీపీఎం సెంట్రల్ కమిటీ మెంబర్ ఆమె… చాలా సీనియర్, వయస్సులో కూడా పెద్దదే… నాలుగేళ్లుగా వుమెన్ కమిషన్‌కు చైర్మన్… నోటిదురుసుకు పాపులర్… ఇప్పుడు హఠాత్తుగా ఆ పదవికి రాజీనామా చేసింది, చేయాల్సి వచ్చింది… స్వయంకృతం… నాలుక అదుపులో లేకపోవడం…
ఈమధ్య మనోరమ న్యూస్ వాళ్లు గృహహింస మీద ఓ లైవ్ షో చేశారు… ఎవరైనా సమస్యలుంటే చెప్పుకోవచ్చన్నారు… మంచి ప్రోగ్రామే… ఆ షోకు వుమెన్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఈమె వచ్చింది… ఎర్నాకుళం నుంచి ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త, అత్త తనను వేధిస్తున్నారనీ, ఈ బాధ భరించలేకపోతున్నాననీ, న్యాయం చేయాలనీ అర్థించింది… దానికి ఈమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చావా అనడిగింది… ఎవరికీ చెప్పుకోలేదనీ, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదనీ ఆమె చెప్పింది… దాంతో ఈమె ఇరిటేటింగ్‌గా ‘అయితే అనుభవించు’ (ఎన్న పిన్నె అనుభవిచో) అనేసింది… ఒక వుమెన్ కమిషన్ చైర్‌పర్సన్ మాటతీరు, స్పందన ఎంత అమానవీయం… కనీసం ఓ మహిళగా కూడా స్పందించలేకపోయింది… సవతి తల్లి భాష ఉపయోగించింది… వెంటనే ఓ లాయర్‌ను మాట్లాడుకుని, ఫ్యామిలీ కోర్టుకు వెళ్లు, కట్నం వాపస్ ఇప్పిస్తారు, పరిహారం కూడా ఇప్పిస్తారు, వింటున్నావా..? అని ఏదేదో చెప్పింది…
Ads
సోషల్ మీడియా కస్సుమంది, మీడియా గుర్రుమంది… విపక్షాలు చర్రుమన్నయ్… కేరళలో ఓ రచ్చ… ఇలాంటి వ్యక్తా వుమెన్ కమిషన్ చైర్‌పర్సన్ అని దుమ్మెత్తిపోశారు… సీపీఎం పెద్దలకు మొహం చెల్లని దుస్థితి… ఈమె ఫ్యూడల్ రాజకీయ నాయకుల్లాగే అబ్బే, నేను ఏ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పుకుంది మొదట్లో, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు అన్నది… తరువాత తనే క్షమాపణ చెప్పింది… సీపీఎం కార్యదర్శివర్గంలో ఈ వ్యవహారంపై ఆమెను కొందరు నిలదీశారు… ఆమె దగ్గర సమాధానం లేదు… తరువాత ఏమైందో ఏమో రాజీనామా ఇచ్చేసింది… నిజానికి ఈమె మొదటి నుంచీ అంతే… పార్టీలో ఆ స్థాయి దాకా ఎలా వెళ్లిందో తెలియదు… 2018లో ఓ మహిళా కార్యకర్త పార్టీకే చెందిన శశి అనే ఎమ్మెల్యే మీద వేధింపుల ఆరోపణ చేసింది… వుమెన్ కమిషన్ ఆ ఫిర్యాదు తీసుకోవడానికి, కేసు విచారించడానికి కూడా అంగీకరించేదు, పార్టీకి పంపించింది, పార్టీయే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది… అదేమంటే మాకు పార్టీయే కోర్టు, పార్టీయే పోలీస్ స్టేషన్ అన్నదీమె… అప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ రాజీనామా చేయాలంటూ విరుచుకుపడ్డయ్… కానీ పార్టీ వెనకేసుకొచ్చింది అప్పుడు… ఇప్పుడు మాత్రం ఇక తప్పలేదు..!!
Share this Article