వెరీ బిగ్ గేమ్… స్టార్ మాటీవీ ఇతర వినోద చానెళ్లను తొక్కేయడానికి, మోనోపలీ వైపు ఓ పెద్ద గేమ్ సంకల్పించింది… దాదాపు వంద కోట్ల పైమాటే తాజా పెట్టుబడి… ఒక్కసారి ఆలోచించండి, ఒకేసారి జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, సాయిపల్లవి, నితిన్, నాని, రవితేజ, అఖిల్, మహేష్‌బాబు… ఇంకెవరున్నారు టాప్ హీరోలు తెలుగులో..? వాళ్లందరి ప్రిస్టేజియస్ సినిమాలన్నీ మాటీవీ కొనేసింది… థియేటర్లు లేవు గానీ లేకపోతే వీటిల్లో అధికశాతం కోట్లకుకోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేవే… వీటి టీవీ రైట్స్ మాటీవీ దక్కించుకుంది… ఆ సినిమాలేమిటో చెప్పుకుందాం గానీ, అసలు మాటీవీ ఒకేసారి ఎందుకిలా దూకుడుగా పోతోంది..? అదీ చెప్పుకోవాలి…
తెలుగులో వినోద చానెళ్లు నాలుగు… మాటీవీ, జీటీవీ, ఈటీవీ, జెమిని… అప్పుడొకటి ఇప్పుడొకటి కొత్త సినిమాలు రిలీజ్ చేసి, నాలుగు రేటింగ్స్ సంపాదించడం తప్ప జెమినికి ఇంకేమీ తెలియదు, రాదు… అంతటి సన్‌నెట్‌వర్క్ ఉండీ చేజేతులా చెడగొట్టుకుంటున్న వ్యాపారం ఇది… రియాలిటీ షోలు తెలియవు, నాన్-ఫిక్షన్ చేతకాదు… సీరియళ్లు మరీ దరిద్రం… ఇప్పుడు మిగతా మూడు చానెళ్లకు చాలా దూరంలో ఉన్న ఈ చానెల్ త్వరలో ఇంకా దెబ్బతినబోతోంది… ఎందుకంటే, ప్రిస్టేజియస్ సినిమాలన్నీ మాటీవీ కొనేసింది కాబట్టి… ఇక జెమిని ఏ స్థానంలోకి వెళ్తుందో చెప్పుకోవడం వేస్ట్… ఇక ఈటీవీ… మూడో స్థానం… దిక్కుమాలిన సీరియళ్లు దీని మైనస్, కానీ నాన్-ఫిక్షన్, అంటే రియాలిటీ షోలు, క్యాష్, వావ్, ఆలీతో సరదాగా, జబర్దస్త్ ఎట్సెట్రా రేటింగ్స్ తెచ్చిపెడుతున్నయ్… సినిమాల సంగతి మరిచిపొండి… ఇకపైనా దానికి జబర్దస్తే దిక్కు…
Ads
ఇక కాస్తో కూస్తో మాటీవీకి పోటీ ఇస్తున్నది జీటీవీ… మిగతా ప్రాంతాల్లో మాటీవీ నంబర్ వన్… కానీ హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో అది మరీ మూడో ప్లేసు… దాని రీచ్, దాని మార్కెటింగ్, మీటరింగ్, రేటింగ్ టెక్నిక్స్ హైదరాబాదులో పనిచేయవు ఎందుకో మరి..! సీరియళ్లలో కూడా మాటీవీకి ఢీఅంటేఢీ… ఎటొచ్చీ ఈ రెండింటికీ శాపం ఏమిటంటే..? కామెడీ, డాన్స్, మ్యూజిక్ వంటి రియాలిటీ షోలు క్లిక్ కావడం లేదు… దొందూ దొందే… మరీ మాటీవీ మహా వీక్… కామెడీ స్టార్స్, డాన్స్ ప్లస్ కూడా ఫ్లాప్స్… ఇక ఇలా కాదని పెద్ద సినిమాలతో కొట్టాలని నిర్ణయించింది మాటీవీ… అదీ గేమ్… ఇది డిస్నీ, హాట్‌స్టార్ తరహా టాక్టిస్… మిగతావాటిని తొక్కేసి మోనోపలీ సాధించే ఓ ప్రయత్నం…
అసలే రేటింగ్స్ కిటుకులు తెలిసిన గ్రూపు కదా… ఖచ్చితంగా ఈ సినిమాలతో పెద్ద హైప్ క్రియేట్ చేయబోతోంది… ఉప్పెన సినిమాకే 18 రేటింగ్ తెప్పించి, మొన్న మళ్లీ ప్రసారం చేస్తే 10 దాకా రేటింగ్ వచ్చిన రేంజ్ చానెల్‌ది… ఇక ఈ స్టార్ హీరోల సినిమాలతో ఏ రేంజ్ యాడ్స్ దందాకు దిగబోతున్నదో చూడాలి… టీవీ, సినిమా సర్కిళ్లలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్… సరే, ఈ వినోద దందాలో ఎవరి ప్రయత్నం వాళ్లది… ఓసారి వీళ్లు కొన్న సినిమాల సంగతి చూద్దాం…
- బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చే అఖండ మీద ఆల్‌రెడీ హైప్ ఉంది… అఘోరా పాత్ర, పలు ఫ్లాపుల తరువాత ఇద్దరూ కసిగా చేస్తున్న సినిమా…
- ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా… దాని వ్యాపారం ఏ లెవల్‌లో ఉండబోతున్నదో అర్థం చేసుకోవాలి… పైగా చాలారోజులుగా ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్… ఆలియా భట్ సరేసరి… మాటీవీ వాడు రెండుమూడేళ్లపాటు నలభైయాభై సార్లు ప్రసారం చేస్తాడు దీన్ని…
- లవ్ స్టోరీ… శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్… ప్లస్ చైతూ… సారంగదరియా లిరికల్ సాంగే యూట్యూబ్‌ను దున్నేస్తోంది… ఇక సినిమా మీద ఏ రేంజ్ హోప్స్ ఉంటాయో ఊహించాల్సిందే… ఫిదా సినిమా 19.5 రేటింగ్స్ తెలుసు కదా… బంపర్ హిట్…
- పుష్ప… అల వైకుంఠపురంలో సినిమాతో బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు… ఇప్పుడిక పుష్ప సినిమా మీద ఫుల్ బజ్ క్రియేటై ఉంది… పైగా భిన్నమైన మాస్ స్టోరీ… ఇదీ ప్రిస్టేజియసే…
- సర్కారువారి పాట… అసలే మహేష్ బాబు… ఇక చెప్పేదేముంది..? సరిలేరు నీకెవ్వరు హిట్ తరువాత దాన్ని కంటిన్యూ చేయడానికి మరో ప్రయత్నం… చాలారోజులుగా ఏ స్టార్ హీరో సినిమాలూ థియేటర్లలోకి రాలేదు… పైగా స్టార్ హీరోలందరి ప్రిస్టేజియస్ సినిమాలు వస్తున్నయ్… అందులో ఒకటి ఇది… సో, దీని మీద కూడా ఓ హైప్ ఉంది…
- రవితేజకు తన తాజా సినిమా ఖిలాడీ ఓ పరీక్ష… ఇప్పటికీ గాడినపడని అఖిల్‌కు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా తన కెరీర్‌ను నిర్దేశించబోతోంది… అంధాధున్ రీమేక్‌గా వస్తున్న నితిన్ మ్యాస్ట్రో మీద తన హోప్స్ బాగానే ఉన్నయ్…
- నాని వి ఫ్లాప్ తరువాత ఓ హిట్ కావాలి… టక్ జగదీష్ మీద తనకు ఆశలున్నయ్…
ఇవీ సినిమాలు… ఇప్పటికి మాటీవీ టీవీ రైట్స్ కొనేసినట్టుగా అధికారికంగానే చెబుతున్న సినిమాలు… ఇవి ప్రసారం అయ్యేలోపు ఇంకొన్ని సినిమాలూ కొంటుంది… సో, ఈ గేమ్‌లో ఫస్ట్ దెబ్బతినేది జెమిని… నాన్-ఫిక్షన్‌లో నానాటికీ వెనకబడిపోతున్న జీటీవీ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలిక… ఎంతసేపూ ఆ ప్రదీప్‌ను పెట్టేసి, ఆ సీరియళ్ల నటీనటులతో చేయించే రొటీన్ ప్రోగ్రాములు గాకుండా ఏమైనా కొత్తగా, క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే జీవాడు ఈ పోటీలో నిలబడతాడు… ఛలో గేమ్ స్టార్ట్స్ నవ్… హియర్ వుయ్ గో…
Share this Article