ఓ ప్రేమ కథ… ప్రేమ కోసం, బావ కోసం పోరాటంలోకి దూకిన ఓ మహిళ కథ… నిజమైన ప్రేమ… ఏ సినిమా కథకూ తీసిపోని కథ… సాక్షిలో వచ్చిన ఓ స్టోరీ చదవగానే అనిపించింది అలా… కానీ వెన్వెంటనే తన్నుకొచ్చిన ఇంకొన్ని ప్రశ్నలు… తను ఎంతగానో ప్రేమించిన బావ కోసం, తన ప్రేమ కోసం ఓ మహిళ ‘‘నేనూ పోరాడతా, నా బావ వెంటనే ఉండి పోరాడతా, నాకు పిల్లలు కూడా వద్దు’’ అనగానే… శెభాష్, ఛలో కామ్రేడ్, ఈ తుపాకీ తీసుకుని, నీ బావ దళంతోపాటు ఉండు, నీ ప్రేమను పండించుకో’’ అని పార్టీ పెద్దలు తెలుగు సినిమా డైలాగులు చెప్పేసి, అంగీకరిస్తారా..? ఇదీ పెద్ద ప్రశ్న…! అసలు పోరాటలక్ష్యం ఏమిటి..? జనమా, విప్లవమా, ప్రేమా… ఇదొక చిక్కు ప్రశ్న… ఆమె ప్రేమ గట్టిది, గొప్పది… కానీ అది విప్లవ పోరాటచట్రంలో ఇముడుతుందా..? ఇది ప్రేమా..? త్యాగమా..? విప్లవ పోరాటమా..? లేక ప్రేమ కోసమే ప్రారంభమైనా సరే, అంతిమంగా జనం కోసం, విప్లవపథంలోకి తనను తాను పోరాటశీలిగా మార్చుకోవడమా..? ప్రేమే అంతిమలక్ష్యంగా సాగిన ఓ ప్రస్థానమా..? మావోయిస్టు పార్టీ ఆశించే లక్ష్యం,పంథా విశ్లేషణ ఎంత సంక్లిష్టమో… ఇదీ అలాగే ఉంది…
ముందుగా ఈ కథ చదవండి… ఈమధ్య కరోనాతో మరణించిన తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి యాప నారాయణ… వరంగల్‌లో చదువుతున్నప్పుడే చాలామందిలాగే పీపుల్స్‌వార్ పట్ల ఆకర్షితుడయ్యాడు… అటువైపు వెళ్లిపోయాడు… జజ్జర్ల సమ్మక్క… నారాయణ మరదలు… బావ అంటే అమితమైన ప్రేమ… చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరికి ఇష్టం… కానీ నారాయణ ప్రేమను జయించి, విప్లవాన్ని ప్రేమించి తుపాకీ పట్టాడు… పెద్దలు వద్దంటున్నా బావతోపాటే నేను అనుకుని అడవిలోకి వెళ్లింది, బావను పెళ్లి చేసుకుంది… ఆమె నిబద్ధత చూశారా..? పార్టీ శిక్షణ, కమిట్మెంట్, అవసరాలు గట్రా మినహాయింపులు ఇచ్చేసి… తుపాకీని చేతిలో పెట్టేసి బావతోపాటూ నువ్వూ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా తెలియదు… బావతోపాటే నడిచింది, ఎన్నో ఎన్‌కౌంటర్లు… అన్నీ తప్పించుకుంది… 2008లో అనారోగ్య కారణాలతో లొంగిపోయింది… ఓ సర్జరీ అయ్యేదాకా ఇక్కడే ఉంది, బావను వదిలి ఉండలేకపోయింది, మళ్లీ అడవిబాట పట్టింది… చివరకు మొన్నీమధ్య కరోనాతో ఇద్దరూ మరణించారు… 30 ఏళ్ల ప్రేమకథ అలా ముగిసిపోయింది…
Ads
నిజానికి మంచి వార్త… ఒక యువతి ప్రేమలోని గాఢతను పట్టిచ్చే కథ… బావ కోసం ఏ బాటలో నడవడానికైనా సరే అంటూ ప్రాణాలకు తెగించి, వెంట నడిచిన కథ… కాస్త మనస్సు పెట్టి రాయగలిగే సబ్‌ఎడిటర్ చేతిలో పడితే, మంచి ప్రజెంటేషన్ దక్కితే… అందరికీ కనెక్టయ్యే కథ… ఈ పాయింట్ పట్టుకున్న రిపోర్టర్లకు మాత్రం అభినందనలు… ఈ స్టోరీ చూడగానే ఓ ఫోటో గుర్తొచ్చింది… ఊడుగుల వేణు తీస్తున్న విరాటపర్వం సినిమాలోని ఓ సీన్… సాయిపల్లవి ఒక గోడమీద చిత్రించి ఉన్న సుత్తీకొడవలి చుట్టూ ఓ ప్రేమ చిహ్నాన్ని బొగ్గుముక్కతో గీస్తుంటుంది… అలాగే మరో ఫోటో… ఓ కాగితాన్ని కత్తిరించి, గోడ మీద సుత్తీకొడవలి కనిపించేలా పట్టుకుని, చూస్తూ మురిసిపోతున్న ఫోటో… అసలు కాన్సెప్టే ప్రేమ, విప్లవం… నిజానికి మనస్సుల మధ్య అల్లుకునే రొమాంటిక్ ప్రేమ వేరు… సమాజ మార్పు కోసం విప్లవాన్ని ప్రేమించడం వేరు… ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాటా కష్టం…
వేణు మనస్సులో ఏముందో, ఆ సినిమాలో ఏం చెప్పబోతున్నాడో, ఏ ప్రేమజంటను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా కథ రాసుకున్నాడో తెలియదు కానీ… ఈ హరిభూషణ్, శారద అలియాస్ నారాయణ, సమ్మక్క ప్రేమకథ చదువుతుంటే ఆ సినిమా కాన్సెప్టే గుర్తొచ్చింది… కొన్ని ప్రేమ కథలు ఏ సిద్ధాంతాల చట్రంలో ఇమడవు… నేనూ, నా బావ… ఈ ప్రేమ కోసం దేనికైనా సిద్ధం అనే సమ్మక్క సంకల్పం, కమిట్మెంట్ గొప్పదా..? అంగీకరించి ఆ భర్త వెంట నడిపించిన పార్టీ గొప్పదా..? మరదలి ప్రేమలో పునీతుడైన హరిభూషణ్ గొప్పవాడా అనేది కాదు ఇక్కడ చర్చ… వ్యక్తుల మధ్య ప్రేమ, విప్లవ పంథాల నడుమ బ్యాలెన్స్, లింక్, కోఆర్డినేషన్, అల్టిమేట్ గోల్స్… సరిగ్గా చెప్పగలిగితే ఎంత మంచి కథ..!! ఎమోషన్ ప్లస్ రివల్యూషన్…!!
అప్ డేట్ :: సమ్మక్క అలియాస్ శారద మరణించలేదు… మావోయిస్టు పార్టీయే ఓ లేఖ ద్వారా ధ్రువీకరించింది… మిగతా ప్రేమ కథంతా నిజమే…
Share this Article