Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంద్రుడి నీడకు సూరీడి మద్దతు..! ఇంకేముంది..? రేవంత్ దశతిరిగినట్టే…!!

June 29, 2021 by M S R

అనుముల రేవంత్‌రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాక చాలామందికి ఓ నమ్మకం కుదిరింది… కేసీయార్‌కు అమ్ముడుబోకుండా దూకుడుగా పోయే ఓ వ్యక్తికి పార్టీ హైకమాండ్ అవకాశమిచ్చింది, జనంలో కాస్త పాపులారిటీ కూడా ఉంది… కాంగ్రెస్ కేడర్‌లో ధైర్యాన్ని పెంచింది పార్టీ… అందరినీ కలుపుకుని పోతాడా, తన దైవసమానుడు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాడా వంటి సందేహాలు, ప్రశ్నలు గట్రా వదిలేస్తే… కేసీయార్ మాయాచట్రం నుంచి టీపీసీసీ విముక్తం పొందిందనే ఓ విశ్వాసం బయల్దేరింది… అరె, అసలు జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ ఓ దిశ, దశ లేకుండా కొట్టుకుపోతోంది, రేవంతుడు ఏం చేస్తాడు..? అసలు తనను నెగ్గనిస్తారా..? కదలినిస్తారా..? పనిచేయనిస్తారా..? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నయ్… ఈ స్థితిలో ఒక ఫోటో ఆకర్షించింది…

sureedu

నల్ల మీసాలు, తెల్ల జుత్తుతో ఎప్పుడూ వైఎస్ వెంట కనిపించే ఓ కేరక్టర్… పేరు సూరీడు… బహుశా సూర్యప్రకాష్‌రెడ్డి కావచ్చు తన పేరు… వైఎస్ వెంట తిరగడానికి వీలుగా ఓ ప్రభుత్వ కొలువు కూడా నామ్‌కేవాస్తే ఇచ్చినట్టుంది అప్పట్లో… ఏమీలేదు, వైఎస్ పక్కన ఉండే బౌన్సర్ తను… తనను నమ్ముకుని ఉండేవాళ్లను తనూ నమ్మడం వైఎస్ మెంటాలిటీ కాబట్టి నడిచింది… డిపెప్ కుంభకోణాలు గట్రా వదిలేస్తే… బేసిక్‌గా సూరీడు ఏమిటి..? ఓ బాడీ గార్డ్… ఎంత విశ్వాసాన్ని, వైఎస్ కుటుంబం పట్ల ఎంత నిబద్ధతను కనబర్చాలి తను..? ఎప్పుడైతే జగన్ మీద సీబీఐ కేసులు, విచారణలు మొదలయ్యాయో సూరీడు ప్రవర్తన, వ్యవహారశైలి అనుమానాస్పదంగా మారింది… తను సీబీఐకి ఏం చెప్పాడో, ఏం స్టేట్‌మెంట్లు రాసిచ్చాడో తెలియదు గానీ… జగన్ పది ఆమడల దూరంలో పెట్టాడు తనను…

Ads

సరే, అదంతా వేరే కథ… బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలుస్తాడు… ఇంకెవరినో కలుస్తాడు… ఫోటోలు దిగుతాడు… అవి మీడియాలో పబ్లిష్ అవుతాయి… మీడియా భావదరిద్రాన్ని కాసేపు పక్కన పెడదాం, అసలు సూరీడు ఎవరని ఈ ప్రయారిటీ ఇస్తున్నారనేదీ వదిలేద్దాం… ఇప్పుడు హఠాత్తుగా రేవంత్‌రెడ్డితో కలిసి ఫోటో దిగాడు… సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది… సూరీడు ఎవరని రేవంతుడు ఈ ఫోటోలకు ఫోజులిచ్చాడు..? తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నాడు తను..? పోనీ, తన చంద్రబాబుకు సంబంధించిన మనిషా అంటే, అదీ కాదు… కాంగ్రెస్ మనిషా అంటే అదీ కాదు… అసలు తను ఎవరు..? ఓ పొలిటిషియనా..? ఓ మాజీ బౌన్సరా..? ఎందుకీ ఫోటో రేవంతం..?! సగటు తెలంగాణ మనిషి దీన్ని ఏరకంగా తీసుకోవాలి..?

నిజానికి ఈ ఫోటో ఒక ఆఫ్టరాల్… కానీ సోషల్ మీడియా విజృంభణ పెరిగాక, ప్రతి ఫోటో, ప్రతి వాక్యం, ప్రతి అడుగూ నిశిత విశ్లేషణలకు దారితీస్తోంది… ఇప్పుడు రేవంత్ క్యాంపు జవాబు చెప్పాలి..? ఎవరు ఈ సూరీడు..? ఎందుకీ ఫోటో సెషన్..? తెలంగాణ సమాజానికి రేవంత్ ఏం చెబుతున్నాడు..? ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు అనే ఓ స్టీరియోఫోనిక్ జవాబు పనికిరాదు ఇక్కడ…!! ఎందుకంటే… కుట్రలు అర్థం చేసుకోలేని తెలంగాణ సమాజం… కేసీయార్, జగన్ తెరవెనుక దోస్తానాలు… రేవంతుడి ద్వారా పట్టు పెంచుకునే ఆంధ్రా చంద్రబాబు… రాజన్నరాజ్యం పేరిట మస్తు ప్రేమ చూపిస్తున్న షర్మిల… ఇదుగో, ఇలాంటి సూరీళ్ల దర్శనాలు… ఏం జరుగుతోంది అసలు..?! తెలంగాణ మీద ఏవో కనిపించని కథలు కమ్ముకొస్తున్నయ్…? అసలు రేవంత్ ఎంతమేరకు నమ్మబుల్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions