Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా సోర్సులు- లీకులు… రహస్యాలేమీ దాగవు, ఆగవు…

May 27, 2026 by M S R

.

Murali Buddha …. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా… క్యాబినెట్ సమావేశంలో ఒక్కోసారి మీడియాకు ఏమీ లీకులు ఇవ్వవద్దు అని మంత్రులకుగట్టిగా చెప్పేవారు. మంత్రుల ద్వారా మీడియాకు ఈ విషయం కూడా తెలిసిపోయేది .

2004 లో చంద్రబాబు ఓడిపోయాక పార్టీ ముఖ్యనాయకులు ఒక్కొక్కరితో తన సుదీర్ఘ సమావేశాలు… కుటుంబం గురించి, పిల్లలు, చదువు అన్నిటి గురించి చర్చించేవారు, అడిగేవారు … ఈ సమావేశంలో మీడియాతో ఎలా ఉండాలో కూడా చెప్పేవారు .

Ads

ఓ లీడర్‌తో బాబు మీరు రిపోర్టర్ మురళితో సన్నిహితంగా ఉంటున్నారు . అతను తెలంగాణవాది, మనకు వ్యతిరేకం, ఎక్కువ సన్నిహితంగా ఉండకండి అని చెప్పారు . ఆ లీడర్ నవ్వుతూ నాకు ఈ విషయం కూడా చెప్పారు .

ఏదో జోకులు వేస్తూ సరదాగా మాట్లాడడం వల్ల సోర్స్ విషయంలో గానీ, సమాచార సేకరణలో గానీ ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది రాలేదు నాకు . నవ్వుతూ మాట్లాడితే, నమ్మి నిజాలే చెబుతారు అనే నమ్మకం . ఈనాడులో సాయి కుమార్ అని ఉండేవారు . ఎన్టీఆర్ భవన్‌లో ఓ రోజున నేను ఓ తెలంగాణ నాయకుడితో సరదాగా కబుర్లు చెబుతుంటే, అతను వచ్చి ‘‘మురళి మీ పార్టీకి వ్యతిరేకం, మేం అనుకూలం . నాతో మాట్లాడాలి కానీ ఇతనితో మాట్లాడుతున్నారేంటీ’’ అని నవ్వుతూ అడిగినట్టే అడిగాడు .

అరగంట ఆలస్యం కావచ్చు కానీ నాయకులు మాట్లాడింది అంతా తెలిసి పోతుంది … 2014 లో రాష్ట్ర విభజనతో మీడియా వార్తలు మారిపోయాయి . ఇప్పుడంతా వాట్సప్ వార్తల జర్నలిజమే . ఏ పార్టీ మీడియా ఏదీ అనే స్పష్టమైన విభజన ఉంది .

పవన్ కు రాజకీయ అవగాహన అంతంత మాత్రమే కాబట్టి, నేను మీతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా వెళ్లాయి అని అడుగుతున్నారు . ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అన్నీ ఓ గంట ముందో వెనకో బయటకు వస్తాయి . ఓ వైపు కేసులు పెట్టి, మరో వైపు మాటలు బయటకు ఎలా వచ్చాయి అని అడగడమే విచిత్రం .

అదే రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబు గారు అయితే, మీడియాలో రావాలి అనుకుంటున్న మాటలు సమావేశంలో తనే మాట్లాడి – మీడియాలో వచ్చాక అరెరె, ఇవన్నీ ఎలా వచ్చాయి అని బోలెడు ఆశ్చర్యపోతారు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions