ఫాఫం నితిన్… ఇటు చెక్ వంటి మాస్ సినిమాలు వర్కవుట్ కావడం లేదు, మళ్లీ రొమాంటిక్ ఎంటర్టెయినర్ బాటలో వెళ్దామంటే రంగ్ దే కూడా చీదేసింది… 2017 నుంచీ ఇదే… శ్రీనివాస కల్యాణం, భీష్మ, లై… అన్నీ… త్రివిక్రమ్ తీసిన అఆ తరువాత ఇక నితిన్‌కు మంచి సినిమా పడలేదు… అంతకుముందు కూడా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్… ఏదో ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా కథ నడుస్తూనే ఉంది… వేరే హీరోలు అయితే కథ వేరేగా ఉండేదేమో… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే… తన సినిమా రంగ్ దే ఉంది కదా… దాన్ని బుల్లితెర ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు… మరీ దారుణమైన రేటింగ్స్… హైదరాబాద్ బార్క్ రేటింగ్స్‌లో జస్ట్ 5.41… చాలా పూర్… జీటీవీ కాస్త రీచ్ ఉన్న చానెలే కదా, సినిమా ఓ మోస్తరుగా ఉన్నా మంచి రేటింగ్సే రావాలి నిజానికి… ఐనాసరే నిరాశ తప్పలేదు జీటీవీ వాడికి… అసలు కొత్త సినిమాలు కొని ప్రసారం చేసే అలవాటే తక్కువ ఆ చానెల్‌కు… ఇదుగో, ఒకటీ రెండు టచ్ చేస్తే, ఇదీ ఫలితం…
నిజానికి అప్పుడెప్పుడో దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల కాలంలో నితిన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ… ఆ సినిమాల విజయాలకు కారణాలు ఎన్నున్నా సరే, నితిన్ ఖాతాలో వేద్దాం… మనది హీరోస్వామ్యం కదా… ఇక రంగ్ దే విషయానికి వస్తే ఫాఫం అందరూ పాజిటివ్ రివ్యూలే రాశారు… సినిమా చూస్తున్నంతసేపూ నువ్వే కావాలి వంటి పాత తెలుగు సినిమాలు యాదికొస్తయ్… కాస్త చిక్కిపోయినా, కొత్తకొత్తగా కనిపిస్తూ కీర్తి సురేష్ సినిమాకు అస్సెట్‌గా నిలబడింది… సినిమా కథలో, కథనంలో లోపాలు ఉన్నా… ఏదో కామెడీ, ఎంటర్టెయిన్మెంట్తో దర్శకుడు ఎలాగోలా బోర్ కొట్టకుండా నెట్టుకొచ్చినా… ఇది చూడాల్సిన సినిమా అనిపించుకోవడంలో ఫెయిలైంది… క్యాచీగా లేని పాటలు, డైలాగులు సరేసరి…
Ads
టీవీ రైట్స్ కొన్న జీటీవీ వాడే ఓటీటీ రైట్స్ కూడా కొంటాడు కదా సహజంగానే… ఆ ప్లాట్‌పాం మీద కూడా పెద్దగా క్లిక్కయినట్టు లేదు… ఇక టీవీలోనూ అంతే… వాస్తవంగా థియేటర్ల దురవస్థ కారణంగా ఇప్పుడు అసలు మార్కెట్ అంటే ఓటీటీ, టీవీ… ఓటీటీని కొందరే చూస్తారు, పైగా జీ5 పెద్దగా సబ్స్క్రయిబ్ కాబడిన ప్లాట్‌ఫాం ఏమీ కాదు… అందుకని టీవీలోనే ఎక్కువ మంది చూసి ఉండాలి… అంటే రేటింగ్స్ వచ్చి ఉండాలి… కానీ తుస్సుమన్నదీ అంటే కారణం..? సినిమాకు అంత సీన్ ఏమీ లేదనే మౌత్‌టాక్… అందుకే టీవీ ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు… అదే పెద్దగా ప్రేక్షకులు ఉండని జెమిని టీవీలో అల వైకుంఠపురాన్ని మళ్లీ ప్రసారం చేస్తే దానికి కూడా 5.4 రేటింగ్స్ వచ్చినయ్… దాని హిట్ రేంజ్ అదీ… సరే, అన్ని సినిమాలూ టీవీల్లో క్లిక్ కావాలని ఏమీ లేదు… కానీ పోయినవారం టీవీల్లో ప్రసారమైన కొత్త సినిమా రంగ్ దే మాత్రమే… ఐనాసరే, తుస్సు…!!
Share this Article