Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్టీయార్ విగ్రహం..! బీఆర్ఎస్ పెడితే గొప్పట..! రేవంత్ పెడితే తప్పట..!!

May 28, 2026 by M S R

.

అవును…, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహం నగరంలో ప్రతిష్ఠిస్తే తప్పేమిటి..? బీఆర్ఎస్ క్యాంపు నిన్నటి నుంచీ ఉడుక్కుంటోంది… ఆ క్యాంపులోని వాళ్లయితే కొందరు కమ్మ సామాజికవర్గం మీద కూడా ద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియాలో..! విద్వేష రాజకీయం..! ఎన్టీయార్ కేవలం ఒక కులంతో మాత్రమే ఐడెంటిఫై కాలేదు కదా, అలా ముద్ర వేయడం మాత్రం అన్యాయం…

  • తెలుగు తెరపై వెలిగిన అగ్రనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల వోట్లు గెలిచిన రాజకీయ నాయకుడు, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పినవాడు… చివరకు కుటుంబ బాధితుడు… తనను కేవలం ఓ కులానికో, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం సంకుచితత్వమే…

కేసీయార్ పాలనకాలంలో ఆంధ్రుల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పళ్లతో తీసేస్తానని పలికితే అప్పుడు అది గ్రేట్ అట… ఆంధ్రావాలా భాగో అని పిలుపునిచ్చిన అదే కేసీయార్ మరి కుర్చీ ఎక్కాక, ఈ ఆంధ్రా ప్రేమ ఎందుకు చూపినట్టు..? తనకు సెటిలర్ల వోట్లు కావాలి కాబట్టి…! ఇప్పుడు అదే క్యాంపు పూర్తి రివర్స్ ధోరణి…

Ads

  • రేవంత్ రెడ్డి జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో జనానికి చెప్పాడు, ఎన్టీరామారావు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని… జనం ఆమోదించారు కాబట్టే, ఆ ఎన్నికలో గెలుపు… సెటిలర్లకు ప్రభుత్వపరమైన ఓ భరోసా… ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు రేవంత్ రెడ్డి… ఇదే కాదు, మరో మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకూ ఓ విగ్రహం… అమర గాయకుడు బాలు విగ్రహానికి కూడా అభ్యంతరం చెప్పలేదు…

ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది… అస్థిత్వం సిద్దించింది… ఎవరి పాలన వాళ్లది, ఎవరి బతుకు వాళ్లది… ప్రాంతీయ విద్వేషంతో- రాజకీయ లబ్ధి కోసం ఇంకా ఇంకా దూరాల్ని, అగాథాల్ని పెంచేస్తూ ఇంకా ఎన్నేళ్లు..? మిలియన్ మార్చ్ సందర్భంగా బోలెడు విగ్రహాల్ని హుసేన్ సాగర్‌లోకి కూల్చేశారు ఉద్యమకారులు… అది ఉద్యమ ఆగ్రహ ప్రకటన… పర్టిక్యులర్‌గా ఆంధ్రతనం ఉన్నవాళ్ల  విగ్రహాల్ని..,

మరి కేసీయార్ అధికారంలోకి వచ్చాక ఎవరి విగ్రహాలనైనా తీసేయించాడా..? లేదు కదా..! తెలంగాణ వైతాళికుల విగ్రహాల్ని కొత్తగా పెట్టాడా..? లేదు కదా..! మరి పాత పాలకుల విగ్రహాన్ని పెడితే తప్పేమిటి..? కొందరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని కూడా విమర్శిస్తున్నారు… అధికారంలో ఉన్న పార్టీ తమ దివంగత నేత విగ్రహాన్ని పెడితే అందులోనూ దురర్థాలను తీయడాన్ని ఏమనాలి..?

రాచరికపు పోకడలున్న తెలంగాణ తల్లి గాకుండా… ఓ దేవతా విగ్రహంగా గాకుండా… సగటు గ్రామీణ తెలంగాణ మహిళ రూపురేఖలతో… పౌరుష ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూకల్పన చేస్తే, సచివాలయంలో ప్రతిష్ఠిస్తే, చివరకు దాని మీద కూడా వ్యతిరేకత..! బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ విగ్రహాన్ని గాంధీభవన్‌కు పంపిస్తామని పేలాపనలు…

  • బీఆర్ఎస్ బ్యాచ్ మరిచిపోయిన మరో అంశం… ఎన్టీయార్ స్మృతివనం ఇక్కడే ఉంది… పీవీకి కూడా ఉంది… ఎన్టీయార్ విగ్రహాలు మాత్రమే కాదు… పాత ఉమ్మడి పాలకుల విగ్రహాలు అనేకం… అంతెందుకు? తెలంగాణకు బలంగా వ్యతిరేకించి, అడ్డుపడిన చరిత్ర ఉన్న వైఎస్ విగ్రహాలు కోకొల్లలు తెలంగాణలో… వాటిపై లేని ద్వేషం ఎన్టీయార్ విగ్రహంపైనే ఎందుకు..? ఎన్టీయార్ విగ్రహ స్థాపనలోనూ చంద్రబాబును చూసుకుంటే ఎలా..?

అంతెందుకు..? ఇవే ఎన్టీయార్ విగ్రహాల్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదా..? అందులో రాజకీయ లబ్ధికై తాపత్రయం లేదా..? అప్పుడు ఎన్టీయార్ మీద ప్రేమ కురిపించి… ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విగ్రహం పెడితే మాత్రం వ్యతిరేక ధోరణి..? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు…?

https://www.facebook.com/reel/977531758473634

  • జుబిలీ హిల్స్ ఎన్నిక ప్రచారం సందర్భంగా… కేటీయార్ మాటల్లో చెప్పాలంటే… ‘‘మేం బోలెడు ఎన్టీయార్ విగ్రహాలు పెట్టాం, ఖమ్మంలో 70 అడుగుల విగ్రహం పెట్టాం, కూకట్‌పల్లిలో ఒకేరోజు మూడు విగ్రహాలు పెట్టాం మేం…  మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో, మోతీనగర్ చౌరస్తాలో విగ్రహం ఆవిష్కరించలేదా..? మాగంటి సునీతను గెలిపిస్తే ఎన్టీయార్ కాంస్యవిగ్రహం పెట్టించే బాధ్యత నాది…’’ సో, బీఆర్ఎస్ చేస్తే సన్మార్గం, వ్యూహం, ఎత్తుగడ, గౌరవం, ఆదరణ… అదే పని రేవంత్ రెడ్డి చేస్తేనేమో… దుర్మార్గమట, నాటకమట, వోట్ల ఎత్తుగడ  అట..!! రాజకీయం అందరికీ తెలుసు కేటీయార్..!!

చివరగా…. కేటీయార్, నీ పేరులోని తారక రామారావు పదం కూడా ఆ ఎన్టీయార్ మీద గౌరవంతో, ప్రేమతో, అభిమానంతో నీ నాన్న కేసీయార్ పెట్టిందే…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎన్టీయార్ విగ్రహం..! బీఆర్ఎస్ పెడితే గొప్పట..! రేవంత్ పెడితే తప్పట..!!
  • ఇరకాటంలో పాకిస్థాన్..! అసలు ఏమిటీ ఈ అబ్రహాం ఒప్పందాలు..?
  • ఆ ఎడారుల్లో కొత్త చమురు నిక్షేపాలు… ఇండియాకు ఇంధన వరం…
  • మన వ్యవస్థల డొల్లతనాన్ని బరిబాతల చూపించే ఓ వాస్తవ కథనం..!
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే… నిజమైన ‘మహిళా సాధికారత’… రేవంత్‌కు బలం…
  • చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…
  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!
  • True Pilot … ఆకాశం నుంచి కూలిపోతున్నప్పుడు కూడా… అదే నిబ్బరం…
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, మన తెలుగు తేజం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions