Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మమత పార్టీలో ముసలం..! మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు..!

June 1, 2026 by M S R

.

బెంగాల్ రాజకీయ చిత్రపటం రోజురోజుకూ చిత్రంగా మారిపోతోంది… టీఎంసీ నాయకులు బజారులో కనిపిస్తే జనం తంతున్నారు… హెల్మెట్లు పెట్టుకుని మరీ నాయకులు జనంలోకి వెళ్లడం భారత రాజకీయ చరిత్రలో ఓ కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది… గూండాయిజమే రాజకీయంగా బతికి దోపిడీలకు పాల్పడినవాళ్లు వణికిపోతున్నారు… ఇక మమత పని అయిపోయినట్టేననీ, మన దారి మనం చూసుకోవాల్సిందేనని టీఎంసీ నాయకులు ఫిక్సయిపోయారు…

నమ్మడం లేదా..? నిజం… అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి… తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత సంక్షోభం, గందరగోళం నడుస్తున్న మాట వాస్తవం… అత్త, మేనల్లుడి, వాడి గ్యాంగ్ అరాచకాలపై సొంత పార్టీలోనే ముసలం బయల్దేరింది…

Ads

మమతకు తోడుగా ఉంటే ఇక సువేందు వదలడనే నిజమూ అర్థమైంది… అందుకే అర్జెంటుగా కాషాయం ధరించే ప్లాన్ చేస్తున్నారు… ఇదుగో ఇక్కడే బీజేపీ జాగ్రత్తగా ఉండాలి… ప్రజాకంటకులను పార్ఠీలోకి అంగీకరిస్తే, అవి పాములై ఇన్నేళ్లూ బీజేపీని అంటిపెట్టుకుని, త్యాగాలకు సిద్దపడి వర్క్ చేసిన నిజమైన బీజేపీ కార్యకర్తలను కాటేసే ప్రమాదముంది… జనమూ మెచ్చరు…

ఇదంతా ఎందుకంటే… టీఎంసీ ఎంపీలు వేరు కుంపటికి రెడీ అయిపోతున్నారు… ఎమ్మెల్యేలు కూడా…  మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత మే 31, 2026న కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సింది…

  • పార్టీకి కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు…

  • దాదాపు 60 మంది (ముప్పావు వంతు) ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది… పార్టీ అంతర్గత విభేదాల వల్లే ఎమ్మెల్యేలు రాలేదనే ప్రచారం గట్టిగా సాగుతోంది… అయితే శనివారం సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కారణంగా, స్థానిక నిరసనల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమర్థించుకున్నారు…

శాసనసభలో ప్రతిపక్ష నేతగా (LoP) శోభన్‌దేవ్ చటోపాధ్యాయను ప్రతిపాదిస్తూ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు టీఎంసీ ఒక లేఖ సమర్పించింది…

  • ఈ లేఖలో కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి… ముఖ్యంగా డానింగ్ ఈస్ట్ ఎమ్మెల్యే బహరుల్ ఇస్లాం తాను ఆ సమావేశానికే వెళ్లలేదని, సంతకం ఎలా వస్తుందని ప్రశ్నించాడు…

  • అసెంబ్లీ సెక్రటేరియట్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాష్ట్ర సీఐడీ (CID) విభాగం, ఈ ఫోర్జరీ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసింది… జూన్ 1న (ఈరోజు) ఆయన్ను భవానీ భవన్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి రమ్మని సమన్లు ఇచ్చారు…

“వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టీఎంసీకి ఒక్క సీటు కూడా రాదేమో?” అనే ప్రచారం సాగుతోంది ఇప్పుడు… రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు… అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు (సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ పద్ధతి)… ఒక అభ్యర్థి గెలవడానికి నిర్దిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు (కోటా) అవసరం అవుతుంది…

ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు… కాబట్టి సంఖ్యాబలం ప్రకారం వారు ఖచ్చితంగా కొన్ని రాజ్యసభ సీట్లను గెలుచుకోగలరు… కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…

  • క్రాస్ ఓటింగ్ భయం…: ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది టీఎంసీ ఎమ్మెల్యేలు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనేది స్పష్టమవుతోంది… ఎన్నికల ఓటమి తర్వాత కొందరు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి…

  • ఒకవేళ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, వేరే పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే (క్రాస్ ఓటింగ్) లేదా ఓటింగ్‌కు దూరంగా ఉంటే.. అప్పుడు టీఎంసీ అనుకున్న సీట్లు కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది…

సో, రాజ్యసభ ఎన్నికల వేళ టీఎంసీకి పెద్ద షాక్ తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు… భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటారా లేదా అనేది చూడాలి..! ఈలోపు టీఎంసీ నేతలపై, గూండాలపై జనం ప్రతీకారదాడులు మాత్రం ఆగడం లేదు… మేనల్లుడికి దేహశుద్ధి తరువాత మరో ఎంపీని కూడా చితకబాదారు జనం..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోమల’మైన గళం… శాస్త్రీయ స్వరజ్ఞానం… ఇండస్ట్రీ గుర్తించలేదు…
  • రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!
  • మమత పార్టీలో ముసలం..! మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు..!
  • అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..!!
  • Sayaji Shinde … వెండి తెరపై విలన్ కావచ్చు… రియల్ లైఫ్‌లో ‘సూపర్ హీరో’…
  • “నో ఫిక్సింగ్, నో దందా, నో గుజరాత్..! మళ్లీ ఆర్సీబీ… జయహో కోహ్లీ..!
  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions