.
రేవంత్ రెడ్డి తన ధోరణి కాస్త మార్చాడు… బీఆర్ఎస్ మీద రాజకీయ దాడిలో ఇప్పుడు కొత్త పంథా చూపిస్తున్నాడు… ఈసారి హరీష్ రావు టార్గెట్… ‘నువ్వు ఏయే పార్టీల వాళ్లతో మాట్లాడుతున్నావో, ఎటు పోతున్నావో నాకు మొత్తం తెలుసు, చెప్పడం నైతికత కాదు కాబట్టి చెప్పడం లేదు, నువ్వు బీఆర్ఎస్‌లో ఉండవు, వచ్చే ఎన్నికల నాటికి మామకు హ్యాండిస్తావు’ అని వ్యాఖ్యానించాడు కదా మొన్న…
మైండ్ గేమ్… దీనికి హరీష్ రావు రియాక్టవుతాడనీ తెలుసు… కానీ ఈ చర్చ బీఆర్ఎస్ కేడర్‌లోనే ఓ ‘సందేహ పర్వానికి’ దారి తీస్తుందనీ రేవంత్‌కు తెలుసు… ఏమో, ఏదో ఉన్నట్టే ఉంది, హరీష్ రావు వెళ్లిపోతే మరి పార్టీ పరిస్థితి ఏమిటి, కేటీయార్ నిభాయించగలడా..? పెద్దాయన ఇక జనంలోకి వచ్చే సూచనల్లేవు… ఇదుగో ఈ భావన బీఆర్ఎస్ కేడర్‌ను అయోమయంలోకి నెట్టేస్తుంది… అదే రేవంత్ రెడ్డి ఆశించింది కూడా…
Ads
ఆల్రెడీ కవిత వెళ్లిపోయింది… కేటీయార్ వారసత్వాన్ని హరీష్ రావు అంగీకరించడు అనే కేడర్ బలంగా నమ్ముతోంది… మరి కేసీయార్ గనుక కేటీయార్‌కు మొత్తం పార్టీని అప్పగిస్తే నిజంగానే హరీష్ రావు ఏం చేయాలి..? తను సెకండ్‌గా ఉండలేడు, కేటీయార్ కింద అనుచరుడిగా అస్సలు మనలేడు…
రేవంత్ అనుకున్నట్టే… హరీష్ రావు స్పందించాడు, నా పుట్టుక, నా మనుగడ బీఆర్ఎస్‌తోనే అని వివరణ ఇచ్చుకున్నాడు అర్జెంటుగా… సరే, ఏం జరుగుతుందనేది కాలం డిసైడ్ చేస్తుంది, కాకపోతే బీఆర్ఎస్ కేడర్‌లో సందేహవ్యాప్తి మరింత బలపడింది…
సరే, రేవంత్ రెడ్డి కొత్త పంథాలో మరొకటి… నేరుగా సవాల్ విసరడం… తెల్లారిలేస్తే ఏవేవే అబద్ధాల్ని కూర్చి రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటారు కదా హరీష్, కేటీయార్… ఈసారి వాళ్ల నుంచి సమాధానం లేకుండా చేయడం కోసం… వాళ్లే క్రియేట్ చేసిన ఓ అబద్దాన్ని వాళ్ల మీదే ప్రయోగించాడు రేవంత్…
‘‘రైతుల ఉచిత విద్యుత్తును తీసేస్తామనీ, మీటర్లు పెడతామని ఏవేవో ఆరోపిస్తున్నారు కదా… నేను ఉచిత విద్యుత్తును ఇలాగే కంటిన్యూ చేస్తే, మీటర్లు పెట్టకపోతే మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా..? ఉచిత విద్యుత్తు రద్దు చేస్తే, మీటర్లు పెడితే నేను ఎన్నికల్లో నిలబడను, నా సవాల్‌కు మీరు సిద్ధమా..?’’ ఇదీ సవాల్…
స్ట్రెయిట్‌గా వేశాడు స్టంప్స్ ముందు పడింది యార్కర్… మింగలేక, కక్కలేక… సవాల్ స్వీకరించలేక… ఆ ఇద్దరూ సైలెంటు… పైగా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నానికి దిగారు… మీటర్లు, ఉచిత విద్యుత్తు గురించి వదిలేసి… 24 గంటల కరెంటు రద్దు చేస్తాడని కొత్త పాట ఎత్తుకున్నారు… నిజానికి కేసీయార్ పాలనలోనే 24 గంటల కరెంటును ఏనాడో కుదించారు… అది మాత్రం చెప్పరు వీళ్లు…
అవసరమైనంత, నాణ్యమైన కరెంటు ఇస్తారా లేదానేదే ప్రధానం… కానీ వక్రీకరణలు, తప్పుడు బాష్యాలు అలవాటై… జనంలోకి అబద్ధాల్ని ప్రసారం చేస్తూ విషయాన్ని తప్పుదోవ పట్టించడం ఇది… నిజానికి రైతు డిస్కమ్ ఖచ్చితంగా మంచిదే… ఉచిత విద్యుత్తు పేరిట జరిగే దుర్వినియోగం ఆగాలి, లెక్కలు తేలాలి, ప్రభుత్వ సబ్సిడీలు- సాయానికి సార్థకత చేకూరాలి…
అవునూ, అసెంబ్లీలో చర్చిద్దాం, దమ్ముంటే సమావేశాలు పెట్టు అంటున్న హరీష్ రావు రెగ్యులేటరీ కమిషన్ ఎదుట తన వాదనను, తన సందేహాల్ని ఎందుకు వినిపించలేదు మరి… అది అసలైన సాధికార వేదిక… కవిత వస్తుందని తెలిసి, తప్పించుకోవడానికి, ఆమెకు ఎదరుపడకుండా ఉండటానికి కమిషన్ ఎదుటకు రాలేదా..?! హవ్వ..!!
Share this Article