Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?

June 1, 2026 by M S R

.

ఫాఫం ఏపీ కాంగ్రెస్… కాంగ్రెస్ హైకమాండ్‌కు మాత్రమే కాదు, సేమ్, బీజేపీ హైకమాండ్‌కు కూడా ఏపీ పాలిటిక్స్ అర్థం కావు, కాలేదు… గతం నుంచీ అంతే… వైఎస్ ఉన్నప్పుడు తన ఆలోచనలు, తన కార్యాచరణ మాత్రమే కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి తప్ప హైకమాండ్‌ చేసిందేమీ లేదు… పైగా వైఎస్ కాళ్లల్లో కట్టెలు పెట్టడానికీ ప్రయత్నించింది…

ఇప్పుడు కూడా సేమ్… బీజేపీని వదిలేయండి, అది ఎన్నేళ్లుగానే టీడీపీకి తోకపార్టీయే తప్ప, దానికంటూ ఓ బలం లేదు, ఓ వ్యూహం లేదు, సమీప భవిష్యత్తులో సొంతంగా ఎదిగే సూచనలూ లేవు… మరి కాంగ్రెస్..? అది అంతకన్నా ఘోరం..? రాష్ట్ర విభజనను సజావుగా చేయలేక, ప్రాంతాల నడుమ విద్వేషాల్ని రగిల్చింది… సరే, అడ్డంగా చతికిలపడింది… మూల్యం చెల్లించుకుంది…

Ads

ఇప్పటికీ అంతే… ఏపీలో ఒక్కడూ లేడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి..? షర్మిలను తీసుకొచ్చి ఏకంగా పీసీసీ పగ్గాలు ఇచ్చారు, ఆమెతో ఏం ఫాయిదా ఆశించారు..? ఆమె నిజానికి ఓ రాజకీయవేత్త కాదు, తెలంగాణ రాజకీయాల్లో  ఏదో పార్టీ పెట్టి, వేలు పెట్టి భంగపడింది, అభాసుపాలైంది, ఆమెకు ఏపీలో చాన్సిచ్చారు, ఆమె పార్టీని నిమజ్జనం చేసుకుని, ఇన్నేళ్లయింది నయాపైసా ఫాయిదా ఉందా ఆమెతో…

ఏమీలేదు… ఎంతసేపూ జగన్‌ను తిట్టిపోయడమే తప్ప, ఆ ఆస్తి తగాదాల యవ్వారాలు తప్ప ఆమెకు ఏమీ తెలియదు… ఇప్పుడిక ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారట, కర్నాటక కోటాలో… అక్కడెవడూ పనిచేసేవాడు లేడా..? వాళ్లకు ప్రోత్సాహకం అక్కర్లేదా..? పోనీ, ఈమెకు ఎంపీ సీటు ఇస్తే ఏపీ పార్టీకి వచ్చేదేమిటట..? అంతా అగమ్యగోచరం… అయోమయం…

రాష్ట్ర విభజనకు ముందు అయిదారు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్… దాని వెనుక వ్యూహం ఏమిటో హైకమాండ్‌కూ తెలియదు… వాళ్లంతా ఇప్పుడేమయ్యారో సమీక్షించుకోవాలనే సోయి కూడా పార్టీకి… స్టిల్, అదే ఆగమాగం పాలసీలు..!

ఏపీ రాజకీయాల మర్మం ఒక చంద్రబాబుకుమాత్రమే బాగా తెలుసు… జగన్‌కు తెలియదు, తెలుసుకునే చాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేదు… చంచల స్వభావి, సిద్ధాంతరహితుడు పవన్ కల్యాణ్‌కు అంతకన్నా తెలియదు… ఏపీ బీజేపీ నేతలకు ఏమాత్రం తెలియదు… అందుకే కాంగ్రెస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నదనే వార్తలు చదివి చంద్రబాబు లోలోపల నవ్వుకుని ఉంటాడు… అఫ్‌కోర్స్, జగన్ కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …
  • నో మ్యాచ్ పాయింట్..! ఈ పెళ్ళి సంబంధం మాకొద్దు..!
  • కోమల’మైన గళం… శాస్త్రీయ స్వరజ్ఞానం… ఇండస్ట్రీ గుర్తించలేదు…
  • రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!
  • మమత పార్టీలో ముసలం..! మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు..!
  • అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..!!
  • Sayaji Shinde … వెండి తెరపై విలన్ కావచ్చు… రియల్ లైఫ్‌లో ‘సూపర్ హీరో’…
  • “నో ఫిక్సింగ్, నో దందా, నో గుజరాత్..! మళ్లీ ఆర్సీబీ… జయహో కోహ్లీ..!
  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions