Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

June 2, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో మంచి రౌడీ సినిమా ఇది … హీరో రౌడీ ఎందుకు అవుతాడు !? ఓ కధ ఉంటుంది . ఓ పురాణం ఉంటుంది . 1992 లో వచ్చిన ఈ పబ్లిక్ రౌడీకి కూడా ఓ కధ ఉంది . అందరు సినిమా హీరోల్లాగానే ఈయన కూడా శిష్ఠ రక్షకుడు . దుష్టులు చేసే అన్యాయాలను ఎదిరించే పబ్లిక్ రౌడీ .

ఇతని ధైర్య సాహసాలను చూసి ఓ డబ్బున్నామె లక్ష్మి కిరాయికి రమ్మంటుంది . ఆమె శత్రువు నాజర్ ఫేక్టరీలను బాంబులు పెట్టి పేల్చేయమని అడుగుతుంది . అలా చేయటం వలన చాలామంది అమాయకులు చనిపోతారు కాబట్టి తన తెలివితేటలతో అతన్ని పతనం చేస్తానని చెప్పి పనిలోకి దిగుతాడు .

Ads

నాజర్ని పతనం చేస్తాడు . అప్పుడు బయటపడుతుంది . ఈ లక్ష్మి నాజర్ చేతిలో మోసపోయిన అతని మొదటి భార్య అని . ఆ తర్వాత తెలుస్తుంది హీరో భానుచందరే నాజర్ , లక్ష్మీల కొడుకని . నాజర్ , రెండో భార్య సంగీత పెంచుకున్న కొడుకు తల్లిదండ్రులను , లక్ష్మిని బంధించి ఆస్తి వ్రాయమని అడుగుతాడు . అతని ఆట కట్టించి అందరినీ విడిపిస్తాడు హీరో . ప్రేయసి హీరాతో పెళ్ళితో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమా బాగుంటుంది . అందాల భామ హీరా హీరోయిన్ గా మొదటి సినిమా . హీరా అంటే సతీ లీలావతిలో అసలు సిసలు హీరోయిన్ . గ్లామర్ స్పేసుని ఫిల్ చేసింది . ఇంక లక్ష్మి . వెటరన్ . అయితే అంత రఫ్ గా చేయలేకపోయిందని అనిపిస్తుంది . ఒంటరి పోరాటం సినిమాలో జయసుధ పాత్ర వంటిది ఈ పాత్ర .

ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్ , సంగీత , బ్రహ్మానందం , సి యస్ రావు , బాబూ మోహన్ , మహర్షి రాఘవ , వల్లభనేని జనార్దన్  తదితరులు నటించారు . కధను నేసిన సత్యమూర్తిని , స్క్రీన్ ప్లేని అందించిన దర్శకుడు సాగర్‌ను తప్పక అభినందించాలి .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , సాహితి పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . హీరాని భానుచందర్ టీజ్ చేసే అడ్డంగా దిడ్డంగా వాగావా పాట ఒకటి . యమ్మా యమ్మా దరువేసి అంటూ సాగే క్లబ్ సాంగ్ హుషారుగా ఉంటుంది .

అబ్బా నీ తస్సాదియ్యా , బంజారా బంజు కొట్టు అంటూ సాగే రెండు డ్యూయెట్లు భానుచందర్ , హీరా మీద ఉంటాయి . సుందరం మాస్టారు , ప్రభుదేవా , దిలీప్ డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .‌ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు చూడవచ్చు . It’s a good action entertainer .



ఇక్కడ నటి హీరా రాజగోపాల్ గురించీ కాస్త చెప్పుకుందాం… ఓ మిలిటరీ కుటుంబం… మొదట్లో మోడల్… సౌత్- హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 1999లో సినిమాలు మానేసింది… తన లైఫ్ స్టయిల్, తన ఆలోచనలకు తాను చేస్తున్న పాత్రలకు శృతి కుదరడం లేదని వివరణ ఇచ్చుకుంది… కొన్నాళ్లు అజిత్‌తో డేటింగ్, 1998లో దానికీ ముగింపు…

తరువాత పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత్తను 2002లో పెళ్లి చేసుకుంది, 2006 కల్లా విడాకులు… హీరా ఆలయ అని పేరు మార్చుకుని తరువాత సినిమాలకు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా.,. రచనలు, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది… ఆమె సొంత వెబ్‌సైట్‌లో ఎక్కువగా ఫిలాసఫీ సంబంధ ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions