.
Priyadarshini Krishna … ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటుడు యుధ్వీర్ అహ్లావత్!
కలలతో మొదలైన ప్రయాణం… ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు!
Netflix లో గతవారం విడుదలైన సైఫ్ అలీ ఖాన్ నటించిన “కర్తవ్య” అనే ఇండివిడ్యుయల్ మూవీ ఇప్పుడు టాప్ స్లాట్ లో వుంది…
ఈ సినిమా చూసిన ఎవరికైనా అందులో నటించిన ఒకానొక పాత్ర ఖచ్చితంగా గుర్తుండిపోయేవుంటుంది … ఆ కథకి మూలం హర్పాల్ అనే ఒక మైనర్ పాత్ర…. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతూ ఈ పాత్రవల్లనే మలుపులు తిరుగుతుంది…
హర్పాల్ పాత్ర మనల్ని కన్నీరు పెట్టించక మానదు…. ఈ పాత్రని పోషించిన యుధ్వీర్ ఇప్పుడు దేశంలో ప్రముఖ నటుల జాబితాలో చేరిపోయాడు.
Ads
33 ఏళ్ళ యుధ్వీర్ 14 ఏళ్ళ బాలునిలాగా సరిగ్గా సరిపోవడమే కాకుండా చాలా బాగా నటించాడు… నటించాడు అనకూడదు … జస్ట్ జీవించాడు ….!
దర్శకుడు పుల్కిత్ తెరకెక్కించిన చిత్రంలో హర్పాల్ పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యుధ్వీర్ అహ్లావత్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. 33 ఏళ్ల ఈ నటుడు 2019లో సాండ్ కీ ఆంఖ్ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించగా, 2022లో విడుదలైన లవ్ హాస్టల్ చిత్రంతో మరింత గుర్తింపు సంపాదించాడు.
IMDb తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో యుధ్వీర్ అహ్లావత్ పేరు చోటు చేసుకోవడం విశేషం. ప్రజాదరణ పరంగా షారుఖ్ ఖాన్, విజయ్, ఐశ్వర్య రాయ్ వంటి అగ్ర తారలను వెనక్కి నెట్టి ఆయన ఈ జాబితాలో నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన యుధ్వీర్…
‘’ఈ క్షణాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. సినిమాల గురించి కలలు కనే స్థితి నుంచి IMDb ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కడం నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
సినిమా, టెలివిజన్, రంగస్థలం… ఏ మాధ్యమమైనా తనదైన నటనతో ఆకట్టుకునే యుధ్వీర్ అహ్లావత్, లవ్ హాస్టల్ చిత్రంలో రాకేష్ దిలావర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన తీవ్రత, సహజత్వం విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది.
#Kartavya
#yudhvirahlavath
#saifalikhan
Share this Article