Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…

June 2, 2026 by M S R

.

నిజం… ఒక దశలో బీజేపీ తురుఫు ముక్కగా కనిపించిన అన్నామలై… ఇప్పుడు అనేక కారణాల రీత్యా ఆ బీజేపీ బంధనాలు తెంచుకుని, ఇక స్వేచ్ఛగా తనదైన దూకుడుతో వెళ్లనున్నాడు… ఈ ధోరణి, తన కార్యాచరణ ఫస్ట్ పళనిస్వామి అనబడే ఓ విఫలనేతకు చుక్కలు చూపించబోతోంది…

ఇన్నాళ్లు పళనిస్వామిని పట్టుకుని వేలాడి, తన షరతులకు సాగిలబడి, అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, టికెట్టు కూడా ఇవ్వక, ప్రచారానికీ అనుమతించక అన్నిరకాలుగా తనను దూరం పెట్టింది… (తెలంగాణలో కేసీయార్ కోసం బండి సంజయ్‌ను పక్కన పెట్టేసి భంగపడినట్టు…)

Ads

సౌత్‌లో బీజేపీ వ్యూహాలన్నీ తల్లకిందులే… పళనిస్వామిని పట్టుకుని వేలాడితే ఆ ద్రవిడ బరిలో ఎంతోకొంత కాళ్లూనుకోవచ్చునని భ్రమపడింది… డీఎంకే మీద వ్యతిరేకత, విజయ్ చీల్చే వోట్లు ఎన్డీయే కూటమికి ఫాయిదా తీసుకొస్తాయని అనుకుంది… కానీ అసలు అన్నాడీఎంకేలోనే పళనిస్వామికి తీవ్ర వ్యతిరేకత ఉంది…

మొన్న విజయ్ గెలిచాక, మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ పడితే ముందుగా రెడీ అయిపోయింది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకవర్గమే… (అనర్హత వేటు వేస్తామనే బెదిరింపుతో పళనిస్వామి వాళ్లందరినీ మళ్లీ అదుపులోకి తెచ్చుకున్నాడు, కానీ అది లోలోపల మండుతూనే ఉంది)… రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోకసభ ఎన్నికల్లో గానీ పళనిస్వామితో బీజేపీ ఒనగూరిందేమిటి..? పే-ద్ద జీరో..!

ఐనా పళనిస్వామిని వదలదు… ఇక తన కెరీర్ ఏమిటో పునర్ నిర్వచించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నామలైకి… బీజేపీ- పళనిస్వామి బంధం ఉన్నన్ని రోజులూ తనకు బంధనాలే… అందుకే తెంపుకున్నాడు, రాజీనామా చేశాడు… ముందుగా తన వైపు వచ్చేది అన్నాడీఎంకేలోని పళనిస్వామి వ్యతిరేకులే… పళనిస్వామి- అన్నామలై సేమ్ ఏరియా, సేమ్ కేస్ట్…

ఇప్పుడిక బీజేపీ కూడా వారించలేదు… వారించినా తను ఆగేది లేదు… తను ఎలాగూ రైటిస్టే కదా, పైగా చెప్పి మరీ రాజీనామా చేశాడు, అమిత్ షాను కలుస్తున్నాడు, రైటిస్టు… ఎప్పుడైనా మనవాడే… అందుకని లోలోపల బీజేపీ ‘వోకే గో ఎహెడ్’ అంటుంది తప్ప, వారించదు… ఒకవేళ అన్నామలై బీజేపీలోనే ఉన్నా సరే, పళనిస్వామి కోసం తనను ఎంకరేజ్ చేసే సీన్ కూడా లేదు… అందుకని బీజేపీ సైలెంటుగా ఉండబోతోంది…

అన్నామలై సరైన దీర్ఘదృష్టితోనే ఉన్నాడు… తమిళనాట జనం ద్రవిడ పార్టీలంటే విముఖత చూపిస్తున్నారు… అది వాస్తవం… స్టాలిన్, పళనిస్వామి చతికిలపడ్డారంటే అదే కారణం… ఏదో ఓ కొత్తతరహా రాజకీయాలు కోరుతున్నారు తమిళజనం… దాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోయింది… ఆ స్పేసులోకి విజయ్ దూరిపోయాడు… గెలిచాడు…

సో, ఇప్పుడిక అక్కడ బీజేపీ సొంతంగా చేయడానికి ఏమీ లేదు… ఒక శూన్యత ఆవరించింది… అందుకే అన్నామలై రాజ్యసభ సభ్యత్వమూ వద్దన్నాడు… ప్రజాక్షేత్రంలోనే పోరాడదలుచుకున్నాడు… మంచి నిర్ణయం… విజయ్ అధికారం డీఎంకే కూటమి చెప్పుచేతల్లో ఉంది, జనానికి నాలుగురోజుల్లో విసుగు, వ్యతిరేకత రావడం ఖాయం…

ఇప్పుడప్పుడే డీఎంకే మళ్లీ పుంజుకునే చాన్స్ లేదు, అన్నాడీఎంకేకు అసలే లేదు… సో, మెల్లిగా ఒక స్పేస్ క్రియేట్ కానుంది… అందులోకి ఒక ధనుష్ వంటి కొత్తవాళ్లు ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్లందరికన్నా అన్నామలైకి మంచి చాన్స్… తనకు తమిళ రాజకీయాలు, ఆ పార్టీల బలాబలాలపై మంచి అవగాహన ఉంది… దూకుడు ఉంది…

వెంటనే ఓ ప్రాంతీయ పార్టీ పెడతాడా..? లేక యువతరం, మార్పు కోరుకునే జనం కోసం ఏదైనా ఓ మూమెంట్ స్టార్ట్ చేసి, దాన్ని రాజకీయాల వైపు తీసుకెళ్తాడా ఇప్పుడే తెలియదు… తనే చెబుతాడు… విజయమో, స్తబ్దతో… డెస్టినీ చెబుతుంది… కానీ అన్నామలై తనదంటూ ఓ ముద్ర వేయగలడు… రాజకీయాల్లో ఓ ఫోర్స్‌లా మనగలడు… ఆల్ ది బెస్ట్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions