ముందుగా ఒక పోస్టు చదవండి……….. ‘‘ కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ..
ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు
కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.
Ads
పుత్రధర్మాన్ని కావుమంటూ(రక్షించుమంటూ)
అప్పుడొచ్చాయి ఒక్కసారిగా!
కావు.. కావు మంటూ!!
అంతవరకు ఎక్కడాలేని కాకులు!!!
“కాకిపిండాన్ని ” తినడానికి!!!!
.
.
ఎవరు రాశారో గానీ… ఫేస్ బుక్, వాట్సప్ ప్లాట్‌ఫారాల్లో బాగా వైరల్ అవుతోంది… ఆ అజ్ఞాత రచయితకు అభినందనలు… నిజమే కదా… తండ్రి ప్రేమను నిర్వచించడం, విశ్లేషించడం ఎవరికీ చేతకాదు… చేయలేరు… అది అంత నిగూఢం, మార్మికం… తండ్రి ప్రేమలో ప్రేమకన్నా బాధ్యత ఎక్కువ… భయం ఎక్కువ… జాగ్రత్తలు ఎక్కువ… బయటికి కనిపించదు, బయటపడదు… అది కాకులకు తెలుసు, కానీ లోకులకేం తెలుసు..? ఇప్పుడు కాస్త నయం, తండ్రులు-పిల్లలు పరస్పరం ప్రేమల్ని వ్యక్తీకరించుకుంటున్నారు… గతంలో అదీ లేదుగా… తండ్రి అంటే భయం… తను ఒక గదిలో ఉంటే పిల్లలు మరో గదిలో… తల్లే సంధానకర్త… ప్రేమ లేదని కాదు… తల్లి మనసారా కౌగిలించుకుని కన్నీళ్లు కారుస్తుంది… తండ్రి లోలోపల ఏడుస్తాడు… అంతే తేడా… తల్లి కడుపు చూస్తుంది, తండ్రి భుజం మీద చెయ్యేస్తాడు… తను దూరమైనా సరే, కొన్నేళ్లపాటు కలల్లో పదే పదే కనిపిస్తుంటాడు అదేమిటో… తను కనిపిస్తే అదొక భరోసా… బెత్తం పట్టుకోని ఓ మాస్టారు… తన కొడుకులు తనను నిర్దాక్షిణ్యంగా చూస్తున్నప్పుడైతే తండ్రి మరీ మరీ గుర్తొస్తాడు… నాన్నా… నాన్నా… అనే ఏడుపు తప్ప ఇంకేమీ పెగలదు… నిజంగా తండ్రి ప్రేమను నిర్వచించడం ఈలోకంలో ఎవడివల్లా కాలేదు… కాదు…!! అందుకే ఈ పోస్టు అంత వైరల్ అవుతుందేమో…!!!
Share this Article