.
అబ్బ, లోకేష్ మామను మించిన నటుడు సుమా… ఓ ట్వీట్ చేశాడు, దేవాన్ష్ (కొడుకు) పేరిట ఓ పుష్కర్ ఘాట్ ఉందని సోషల్ మీడియా ద్వారానే తెలిసిందట, రెడిక్యులస్, దేవాన్ష్ పేరిట ఏమీ ఉండకూడదని ఆదేశించాడట…
నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు… తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం లోని మునికూడలి వద్ద గోదావరి పుష్కర ఘాట్ ఇది… దేవాన్ష్ పుట్టింది 21 మార్చి 2015… జూలైలో పుష్కరాలు వచ్చాయి… కొత్తగా పుష్కర ఘాట్‌లు కట్టారు, ఉన్నవి డెవలప్ చేశారు, ఏమాటకామాట చంద్రబాబు ఆ పుష్కరాలను ఘనంగా నిర్వహించాడు…
Ads
కానీ ప్రచార కుతి కోసం దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ కోసం ఫోటో షూట్స్, వీడియో షూట్స్ ఏర్పాటు చేసి, భక్తులను నిలిపివేస్తే, తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది మరణించారు, అది రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ దగ్గర… చంద్రబాబుకు ఆ ఉసురు తగిలింది, అది వేరే సంగతి…
సరే, దేవాన్ష్ పుట్టిన కొన్నాళ్లకే అంటే జూలైలో పుష్కరాలు వచ్చాయి… చంద్రబాబో, లోకోషే చెప్పరు, కానీ స్థానిక కార్యకర్తలు, నాయకుల అత్యుత్సాహం, లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ దేవాన్ష్ పేరు పెట్టారు ఓ ఘాట్‌కు… దానిపై 7.2015 అని కనిపిస్తుంది కూడా…
ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ ఘాట్ డెవలప్‌మెంట్ కోసం కోటి రూపాయల ఖర్చుకు వోకే అన్నాడని ఏవో సోషల్ వీడియోలు వచ్చాయి… సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఇక లోకేష్ స్పందించాడు… ఇప్పుడే కొత్తగా తనకు ఆ ఘాట్‌కు కొడుకు పేరు పెట్టారని తెలిసినట్టుగా… నో, నో, ఇలాంటివి నాకు నచ్చవు అన్నట్టుగా ఓ ట్వీట్ కొట్టాడు…
ఇక్కడ ఓ డౌటనుమానం… దేవాన్ష్ పేరున్న ఘాట్‌కు కోటి రూపాయల్ని పవన్ కల్యాణ్ ఇవ్వడం ఏమిటి..? నెవ్వర్… అన్ని ఘాట్లనూ రాబోయే 2027 పుష్కరాల కోసం డెవలప్ చేస్తున్నారు… అందులో భాగంగా ఈ ఘాట్‌కూ నిధులు… అంతే…
థాంక్ పుష్కరా… దేవాన్ష్ పేరుతో ఘాట్ ఉందని తెలియనట్టుంది, లేకపోతే నాగబాబు ఆదేశాలతో కార్యకర్తలు రీసెంటుగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తన కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ పేరుతో ఓ ఘాట్ కట్టేసేవారేమో…
నిజానికి వారసులను వాళ్ల బాల్యాన్ని, టీన్స్‌ను అనుభవించనివ్వండర్రా… అప్పుడే ఈ రాజకీయాల్లోకి లాగకండి, ఆస్తులకు, సంపదకు కొదువ లేదు… ఈ రొంపి వార్తల్లోకి లాగడం అవసరమా..? దేవాన్ష్ వయస్సు 11 ఏళ్లు, బ్రాహ్మణి పెంపకంలో తెలివైనవాడిలాగే కనిపిస్తున్నాడు… తెలంగాణలో కాస్త డిఫరెంట్…
కేటీయార్ కొడుకు హిమాంశు కూడా సచివాలయం వెళ్తూ, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఆమధ్య వార్తల్లోకి వచ్చేవాడు… మరి కేసీయార్ మనమడు కదా, స్థానిక నాయకులు, కార్యకర్తలు క్యూలు కట్టేవారు, సాగిలబడేవాళ్లు… అదీ తప్పే… అఫ్‌కోర్స్, ఈమధ్య అలాంటి వార్తలు కనిపించడం లేదు… గుడ్…
Share this Article