దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ అంటారు కదా… నెగటివ్‌గా మాత్రమే తీసుకోనక్కర్లేదు… అప్పుడప్పుడూ దాన్ని పాజిటివ్ అంశానికీ వర్తింపజేసుకోవచ్చు… ఉదాహరణకు బిగ్‌బాస్… ఈ బాస్ షో అయిపోయే ముందు trp ధగధగ అంటోంది… తొలిసారిగా కాస్త చెప్పుకోదగిన నంబర్ కనిపిస్తోంది రేటింగ్స్ లో… ఈమేరకు నాగార్జున ఖుషీ అయిపోవాలి… ఇన్నిరోజులు 8 కోట్లు, 9 కోట్లు, 9.5 కోట్ల ఓట్లు అని వీకెండ్ షో వేదికల మీద ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సరే, నిజానికి లెక్కకు వచ్చేది ఈ trp నంబరే… ఎందుకంటే, ఆ ఓట్ల లెక్కకు ఓ రీతి ఓ రివాజు ఉండవు కాబట్టి లైట్ తీసుకోవల్సిందే…
నిజానికి ఈ హౌస్ లో బోలెడు మంది, బాగా సందడి, హడావుడి ఉన్నప్పుడేమో దీన్ని ఎవ్వడూ సరిగ్గా దేకలేదు… ఎప్పుడూ రేటింగుల వేటలో చతికిలబాటే… ఓసారి అక్కినేని నాగ సమంత వచ్చిన ఒక్క వీకెండ్ షో మాత్రం కాస్త బెటర్… అంతే… తర్వాత మళ్లీ సేమ్… పడిపోయింది… మరి ఇంత ఖర్చు పెట్టినా, ఇంత రిస్క్ తీసుకున్నా, షో లేవదు, trp పెరగదు… మరెలా..?
ఇప్పుడు ఆ బాధ కాస్త తగ్గింది… బహుశా స్టార్ మాటీవీ టీఆర్పీల టీం కాస్త ఈ షో మీద కూడా ప్రేమ చూపించినట్టుంది… అందుకే మీటర్లు కాస్త ఇటువైపు తిరిగినట్టున్నయ్… రేటింగ్స్ పెరిగినట్టు కనిపిస్తోంది… హైదరాబాద్ బార్క్ తాజా రేటింగ్స్ చూడండి… ఆశ్చర్యంగా టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో రెండుసార్లు బిగ్‌బాస్ కనిపిస్తోంది…
Ads
ఆ రెండూ నాగార్జున కనిపించే శని, ఆదివారాల వీకెండ్ షోలు… ఆదివారం 7.80, శనివారం 7.54 రేటింగ్స్… పర్లేదు, మరీ ఇజ్జత్ పోయేట్టుగా ఏమీ లేదు… కాస్త కాలర్ ఎగరేసుకోవచ్చు… బుధవారం 5.12, సోమవారం 5.08, మంగళవారం 4.99, గురువారం 4.39, శుక్రవారం 4.18… వీక్ డేస్‌లో పెద్దగా రేటింగ్స్ పెరగకపోయినా… వీకెండ్ షోల మీద కాస్త కాన్సంట్రేట్ చేసి, పంపు కొట్టినట్టున్నారు…
నిజానికి ఇక మరో రెండు వారాల్లో దుకాణం క్లోజ్ అయిపోయే స్థితిలో… కేవలం ఏడుగురు మాత్రమే ఉండి… పెద్దగా సందడి లేకపోయినా సరే… TRP పెరిగిన తీరు విశేషమే… దీనివెనుక స్టార్ మాటీవీ టీఆర్పీ టీం శ్రమ ఉండి ఉంటుంది… మరి ఇదేదో కాస్త ముందు నుంచీ తిప్పలు పడితే ఇలా అడ్డంగా పరువు పోగొట్టుకునేది కాదు కదా…
వాస్తవానికి చప్పచప్పగా ఉన్న షోలో అభిజిత్ రెబల్ పోకడ కాస్త హీట్ పెంచుతోంది… టాస్కులు చేయకపోవడం, తలెగరేయడం, తిరస్కరించడం… దీనికి నాగార్జున తనకు క్లాస్ పీకడం… అభిజిత్‌ను బ్యాడ్ చేయాలని ప్రయత్నించడం… ప్రతీకారంగా అభిజిత్ ఫ్యాన్స్ నాగార్జునను ఔట్‌రైట్‌గా ట్రోల్ చేయడం…. ఇంకోవైపు ఫినాలే సమీపిస్తుండటం… సొహెల్ బాగా పికప్ కావడం… విన్నర్ ప్రాబబుల్స్‌లో ఉంటాడు అనుకున్న అవినాష్, అరియానా ఒక్కసారిగా బ్యాడ్ అయిపోవడం…. వీటితో షో మీద కాస్త ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నిజంగానే పెరిగినట్టుంది…
కొత్త టాస్కులు, కొత్త గేములు ఏం ఆలోచిస్తాంలే అనుకున్నట్టున్నారు ఈ బిగ్‌బాస్ టీం… ఈ ఫినాలె మెడల్ పోటీని సాగదీస్తున్నారు… బోర్… ఆల్రెడీ ఆ పోటీ నుంచి అవినాష్, అరియానా, హారిక, మోనాల్, అభిజిత్ ఔట్ అయిపోయారు… సరే, అదేదే తొండి ఆటలు… చివరకు సొహెల్, అఖిల్‌కు ఉయ్యాలపై దిగకుండా ఉండాల్సిన పోటీ… సరే, చివరకు అఖిల్ గెలిచాడు, ఒకవేళ ప్రేక్షకులు తనను ఎలిమినేట్ చేస్తే, బిగ్‌బాస్ ఎడ్డిమొహం వేయాల్సిన స్థితిని కూడా మనం చెప్పుకున్నాం… ఇది ఈరోజు కూడా అయిపోలేదు… ఇంకా మిగిలే ఉంది… ప్రేక్షకుల్లో ఆసక్తిలాగే…!!
Share this Article