.
డిస్‌క్లెయిమర్… పోటీ పరీక్షలు, సీబీఎస్ఈ పరీక్షలు, మూల్యాంకనం వంటి విషయాల్లో దరిద్రపు పనితీరు కనబరిచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇంకా మోడీ కాపాడటం, కొనసాగించడం అస్సలు కరెక్టు కాదు… ఈ మంత్రి వెనుక ఉన్న కోఎంప్ట్ (పాత గ్లోబరీనా) నిర్వాకాల్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకునే దుర్మార్గం… ఇక అసలు వార్తకు, కొన్ని నిజాల దగ్గరకు వద్దాం…
సీపీఐ పత్రికలో ఒక వార్త కనిపించింది… ఎఐఎస్ఎఫ్, మహిళా సమాఖ్య, ఎఐవైఎఫ్ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ దాడి, ఇదీ హెడింగ్… విషయం ఏమిటయ్యా అంటే, ఒక సీపీఐ జాతీయ కార్యదర్శి మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేయబోయారట… ఎక్కడ..? ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర…
Ads
సందర్భం..? సీజేపీ, అనగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నా దగ్గర… మరి అక్కడికి సీపీఐ వాళ్లు ఎందుకు వెళ్లారు.? అది వాళ్ల ప్రోగ్రాం కాదు కదా..? అక్కడే ఉంది, మనం చెప్పుకోవాల్సింది… ముందుగా… ఓ సంఘటన గుర్తొచ్చింది… ఇదే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓసారి కన్హయ్య కుమార్ వస్తున్నాడంటే ఏదో రోడ్డు పక్కన కూలబడి, చాలాసేపు ఎదురుచూపుల్లో ఉన్న ఫోటో, వార్త గుర్తొచ్చింది…
తరువాత ఆ కన్హయ్య కుమార్ ఏమయ్యాడు..? ఇక సీజేపీ విషయానికి వద్దాం… చాలామంది రాస్తున్నారు, సూపర్ హిట్, బ్రహ్మాండం అంటూ… అక్కడ చేరింది ఎవరూ అంటే..? సంప్రదాయికంగా ఢిల్లీలో ఆందోళనలు, జాతి- జాతీయ వ్యతిరేక భావాలు కలిగిన సెక్షన్… అంటే అందులో ఇదుగో ఇలాంటి లెఫ్ట్ కార్యకర్తలు, తుక్‌డే జేఎన్‌యూ గ్యాంగు, ఆప్, ఖలిస్థానీ భావజాలురు ఎట్సెట్రా… ఒక్క ముక్కలో చెప్పాలంటే యాంటీ- మోడీ సెక్షన్లు ఈ సీజేపీ ధర్నాను ఓ అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నించాయి…
మొన్న బాల్క సుమన్ ఏమన్నాడు..? హైవే మీద ధర్నాకు పిలుపునిస్తే అయిదుగురు రైతులొచ్చారు, 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలొచ్చారు అని..! ఈ సీజేపీ కూడా అదే… పోలీసులు, మీడియా, యాంటీ మోడీ సెక్షన్ ఎట్సెట్రా వేల మంది… సీజేపీ నుంచి గుప్పెడు మంది…
నిజానికి సీజేపీ అంటే… నిరుద్యోగులను కాక్రోచ్‌లు అన్న సీజే అనే అక్షరాలు, నైతికంగా బీజేపీని నిందించేలా, బీజేపీ అని స్ఫురించేలా… కలిపి… సీజేపీ అని ఓ డిజిటల్ సెటైరిక్ నిరసన- మరీ సంక్షిప్తంగా చెప్పాలంటే ట్విట్టర్‌లో అప్పుడప్పుడూ సమకాలీన సమస్యలపై కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి కదా… ఇదీ అదే, అంతకుమించి సీజేపీకి ప్రాధాన్యం లేదు…
ఎందుకు లేదు అంటే..? జస్ట్, ఒకఇష్యూ మీద అప్పటికప్పుడు క్రియేటైన ఓ బ్యానర్… దానికి మిలియన్ల కొద్దీ ఫాలోయర్లు… అవి నిలబడవు… ఉద్యమాల నిర్మాణం ఇలాంటి పాలపొంగులతో కుదరవు… పైగా ఉమర్ ఖలీద్ భావజాలం సరేసరి… ఇప్పటికిప్పుడు నేపాల్, శ్రీలంక తరహాలో జెన్‌జీ విప్లవం అనే హైప్ అక్కర్లేదు…
కానీ యాంటీ సెంట్రల్ గవర్నమెంట్, యాంటీ మోడీ, యాంటీ బీజేపీ సెక్షన్లు ఈ ధర్నాను ఓ అవకాశంగా తీసుకున్నాయి… తప్పు లేదు, ధర్మేంద్ర ప్రధాన్ అనే వాడిని మోడీని కాపాడటం మీద ఎంత నిరసన వ్యక్తమైనా దాన్ని ఆహ్వానించాల్సిందే…
ఐతే ఆశ్చర్యం అనిపించింది… సీపీఐ చరిత్ర ఏమిటి..? ఎన్ని ఉద్యమాలు, ఎన్ని త్యాగాలు..? అలాంటి పార్టీ మెల్లిమెల్లిగా ఈ దేశ రాజకీయ చిత్రపటం నుంచి స్వీయ తప్పిదాలతో కనుమరుగైపోతూ… చివరకు ఓ టెంపరరీ డిజిటల్ ఉద్యమాన్ని నమ్మి, అందులో చేరడమా..? అసలు ఆ పార్టీయే సొంతంగా కేంద్ర మంత్రి మీద జాతీయ స్థాయి నిరసనను, ఇతర వామపక్షాలతో, ప్రతిపక్షాలతో చేరి నిర్మించలేదు..?
గ్రేట్ నికోబార్ ఇష్యూ తీసుకుని, సముద్రంలో దూకి, వేరే ‘ఆందోళన’ లో ఉన్న రాహుల్ గాంధీ ఎట్సెట్రా ఈ సీజేపీకి దూరం ఉన్నారు, శుభం… నిజానికి ప్రతిపక్షాలకు చివరకు సొంత ప్రోగ్రామ్స్ నిర్వహించడం చేతకాక… ఇలాంటి డిజిటల్ మంటలతో చలికాచుకోవడమా..? సీజేపీ దగ్గరకు వద్దాం… మొన్న ఓ మిత్రుడి ఫేస్ బుక్ పోస్ట్…
‘‘నాకు 8 లక్షల మంది ఫాలోయిర్లున్నారు, నా పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, వ్యూస్ ఉంటాయి, మొన్న ఓ అవసరం వచ్చి రిక్వెస్ట్ పోస్ట్ పెడితే పట్టుమని పది మంది కూడా స్పందించలేదు’’ సీజేపీని కూడా ఇంతకు మించి చూడాల్సిన పనిలేదు… ఇది నిజమేనని కాలం త్వరలో తేల్చేస్తుంది… బీజేపీ మరీ దీన్ని చూసి ఉలిక్కిపడాల్సిన పనీ లేదు… పాపం శమించుగాక..!
ఈ ధర్నాలో బలంగా వినిపించిన నినాదాలు ఏమిటో తెలుసా..? తుక్‌డే తుక్‌డే ఆజాదీ… అర్థమైంది కదా..!!
Share this Article