.
పన్నెండేళ్ళ పాప వేసవి సెలవులకు అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ చేసే తాత గారింటికి వచ్చింది. కొన్ని రోజులు ఆడుకుని, నవ్వుకుని, మళ్లీ ఇంటికి వెళ్లాల్సింది. (తెలంగాణ, ఖమ్మం)
అదే అపార్ట్ మెంట్ లో మూడో అంతస్తులో ఉండే ఒక గౌస్ గాడు పాపను ఫ్లాట్ కి పిలిచి, చేతులు కట్టేసి పాడు చేసి మరీ మూడో అంతస్తు నుండీ కిందకి తోసేశాడు.
Ads
ఒక 12 ఏళ్ల పిల్ల కేక.
భయంతో వేసిన కేక.
ప్రాణం కోసం వేసిన కేక.
ఆ కేకతో ముగియాల్సిన నేరం…
ఆమెను కిందకి తోసేసేంత దారుణంగా మారింది.
నేరం చేసిన వాడు
తన పని కొన్ని నిమిషాల్లో చేసేశాడు.
ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేయడానికి
అతనికి అంతకంటే ఎక్కువ సమయం అవసరం పడలేదు.
చచ్చిపోవాల్సిన పాప ఎన్నో దెబ్బలు తగిలి
బ్రతికి, హాస్పటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
పాప తల్లి తండ్రులు వాళ్ళ సర్వం కోల్పోయి,
హాస్పిటల్ బిల్లులు వాళ్ళే కడుతూ,
కూతురు బ్రతుకుతుందో లేదో తెలియక
ప్రతి రాత్రి నరకం అనుభవిస్తూ లోపలే విరిగిపోతున్నారు.
ఒకడు నేరం చేసి ముగించేశాడు.
ఒక కుటుంబం మాత్రం
ఇంకా ఆ నేరం మధ్యలోనే బతుకుతోంది.
ఈ దేశంలో నేరం చేయడం కంటే… నేరం జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడడమే కష్టంగా మారిందా…?
నేరం చేసిన వాడు పార్టీ జెండా వెనుక దాక్కుంటే…
అరెస్ట్ అనే చిన్న ప్రక్రియ కోసం కూడా
పోరాడటం ఏదైతే ఉందో…
అసలు వాడ్ని అరెస్ట్ చేసేది ఏందీ..?
కొన్ని కొన్ని నేరాలకు అరెస్టు అనేది
చాలా చిన్న పదంలా అనిపించి నవ్వొస్తోంది.
నేరం చేయడానికి కొన్ని నిమిషాలు.
ఒక చిన్నారి బాల్యాన్ని నాశనం చేయడానికి
కొన్ని నిమిషాలు.
ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేయడానికి
కొన్ని నిమిషాలు.
కానీ న్యాయం చేయడానికి…?
నెలలు.
సంవత్సరాలు.
విచారణలు.
వాయిదాలు.
ప్రస్తుతం ప్రపంచంలో అన్నీ జెట్ పవర్ తో సూపర్ స్పీడ్ తో వస్తున్నాయ్, అందుతున్నాయ్.
ఒక్క న్యాయం తప్ప.
వాడికి బెయిల్ వస్తుంది, మళ్లీ జనంలో తిరుగుతాడు, చుట్టూ అనేకమంది పిల్లలు.
ఇంత లావు రాజ్యాంగం.
ఇన్ని చట్టాలు.
ఇంత పోలీస్ వ్యవస్థ.
ఇన్ని న్యాయస్థానాలు.
అయినా…
ఒక చిన్నారి బాల్యాన్ని కాపాడలేని చట్టాలు…
ఘటన జరిగిన తర్వాత మాత్రమే మేల్కొనే వ్యవస్థ…
బాధిత కుటుంబం కన్నీళ్లు చూసిన తర్వాతే
కదిలే యంత్రాంగం…
ఇవి ఎవరి కోసం పనిచేస్తున్నాయి..?
ఈ వ్యవస్థకు
బాధితుల కన్నీళ్ల కంటే ప్రక్రియలే ఎక్కువ ముఖ్యమా..?
ఈ వ్యవస్థకు
ఒక చిన్నారి బాల్యం కంటే ఫైళ్లే ఎక్కువ విలువైనవా..?
సమాజం సిగ్గుపడటం మర్చిపోయిందా..?
అసలు వెలుగు చూడని ఇలాంటి
ఘోరాలు…
ఇంకెన్ని జరుగుతున్నాయి..?
నేరం ఆటవికంగా జరిగినప్పుడు…
న్యాయం ఆధునికంగా ఎందుకు..?
ఒక రోజు భయం కాదు.
ఒక సంఘటన కాదు.
ఒక 12 ఏళ్ల పిల్ల
జీవితమంతా మోసుకెళ్లాల్సిన గాయం.
నేరం చేసిన వాడికి
అది కొన్ని నిమిషాలు మాత్రమే.
కానీ ఆ 12 ఏళ్ల పాపకు…
అది జీవితాంతం మిగిలిపోయే రోజు! (వాట్సప్ సేకరణ)
.
ఒక్కడూ మాట్లాడడు… వీర సెక్యులర్‌వాదులు ఒక్కడూ మాట్లాడడు… భయం… ఎందుకురా మీ పార్టీలు..? మీ సంఘాలు..? సో కాల్డ్ ఎర్ర మహిళా సంఘాలు, అల్ట్రా లిబరల్స్, వీరాభ్యుదయవాదం, కమ్యూనిజం మన్నూమశానం… జాతికి అరిష్టం..!!
.
(అయ్యా, చీఫ్ జస్టిస్ గారూ… ఇలాంటి పిశాచాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సత్వర శిక్షలు కోరుకుంటున్నారు జనం… కానీ మీ బెయిళ్లు, మీ వాయిదాలు, మీ విచారణలు… అంతా ఓ డొల్ల న్యాయం అనుకుంటుంది సమాజం…. కాక్రోచ్ వంటి వెటకారాలు కాదు… మీకు ఏమైనా చేతనవుతుందా..? మీరేమైనా చేయగలరా..?)
Share this Article