Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుప్రీం కోర్టూ కొట్టేసింది… కిం కర్తవ్యం..? ఏమీ లేదు… అంగీకరించడమే..!!

June 12, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  కోర్టులు, వ్యవస్థలు భావోద్వేగాలపై కాదు… సాక్ష్యాలు, నిబంధనలు, ప్రాసెస్‌లపై పని చేస్తాయి!
అయ్యో, ఆవిడ నిజాయితీ పరురాలు, గాంధేయ వాది , చాల సింపుల్ గా తిరుగుతుంది అని బుగ్గలు నొక్కుకున్నారు; నిజమే అయ్యి వుంది ఉండచ్చు ;
నేను నాలుగు రోజుల క్రితమే చెప్పాను… ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ అని.

 కోర్టు స్పష్టంగా ఏమంది?
– నామినేషన్ తిరస్కరణకు కారణం స్పష్టంగా ఉంది.
– నామినేషన్ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోము.
– మీకు అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించండి.

Ads

మధ్య ప్రదేశ్ నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎన్నికల సంఘము ప్రకటన కూడా చేసేసింది ; ప్రాసెస్ ప్రకారము నామినేషన్ల ఉపసంహరణ , రివ్యూ తరువాత 9 రాష్ట్రాల్లో 22 మంది ఎన్నిక అయినట్లు దాని ప్రకటన అది చేసేసింది ; వెళ్లి ఎన్నికల సంఘములో పిటీషన్ వేసినా మేము చెప్పిన కారణము సహేతుకం , మేము దాని మీద నిలపడి ఉంటాము , ఎన్నికల ప్రక్రియ ముగిసింది , ఇప్పుడేమి చేయలేము అని మళ్ళి ఆ పిటీషన్ తిరస్కరిస్తారు ;

 అందుకే ముందే చెప్పాను… ఈ కేసులో పెద్దగా మారేది ఏమీ లేదని.
నేను 4 రోజుల క్రితమే చెప్పా . అభిషేక సింగ్వికు ఇంకొక 4 గంటలు వాదించినందుకు ఒక 15, 20 లచ్చలు ముట్టాయి అంతే ( అయన వాదించినందుకు గంటకు లక్షల్లో వసూలు చేస్తాడు అని ఢిల్లీ సర్కిల్లలో పేరు ) అంతకంటే ఏమి అవ్వలేదు అక్కడ. ఆయనంటే ఇలాంటి కేసులు ఎప్పుడొస్తాయా , ఎప్పుడు కోర్ట్ కు పోదామా అని వేచి ఉంటాడు ; కోర్ట్ లో ఏమి చెపుతారో ఆయనకు అనవసరం . గెలిస్తే అయన ప్రతిభ , గెలవకపోతే కోర్ట్ తీర్పు ; కానీ ఆయనకు ముట్టేది ఆయనకు ముట్టుతుంది

 అసలు కేసు ఏమిటి?
మళ్ళి కేసు వివరాలు చెప్పాలి అంటే ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య లొల్లిని పార్టీ లెవెల్ లో హేండిల్ చేయటము చేతకాకపోతే , బాధితురాలు వెళ్లి అన్ని సాక్ష్యాలతో కోర్ట్ లో ప్రైవేట్ కేసు వేసింది; నిందితుడు , నిందితుడి కుటుంబ సభ్యులు, పార్టీ జిల్లా అద్యక్షుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఇలా అందరిని కలిపి ఆవిడ కేసు వేసింది. వేసాను అని ఆవిడే మీడియా కు చెప్పింది.

దాదాపు నాలుగేళ్లుగా నడుస్తున్న లొల్లి ఇది ; పార్టీలో అందరికి తెలుసు ; కేసులో వున్న అందరికి నోటీసులొచ్చాయి; పార్టీ ఇన్ ఛార్జ్ కు గాంధీ భవన్ అడ్రస్ తో నోటీసులొచ్చాయి, నోటీసులు తీసుకున్నారు, ఇది ప్రైవేట్ కేసు, నాకేమి సంబంధము , నన్ను కేసు నుండి తీసెయ్యండి అని కౌంటర్ అఫిడవిట్ కూడా వేశారు , కోర్ట్ వొప్పుకోకుండా కేసు విచారణ కొనసాగిద్దాము అని ముందుకు వెళ్ళింది , కోర్ట్ విచారణలో వుంది; ఈ రోజు కూడా నాంపల్లి కోర్ట్ లో హియరింగ్ వుంది అట.

 ముఖ్యమైన విషయం ఏమిటంటే…
కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసు గురించి అఫిడవిట్ లో పెట్టాలి , simple అదొక నిబంధన, అది ఇగ్నోర్ చెయ్యాల్సిన తప్పిదం అయితే కాదు, ఇది చిన్న తప్పిదం కాదు. చట్టపరమైన నిబంధన. అదే తిరస్కరించే సమయములో ఎన్నికల సంఘము చెప్పింది

 ఇప్పుడు కాంగ్రెస్ చేయాల్సింది
ఇంత పెద్ద విషయాన్ని అఫిడవిట్ లో పెట్టకుండా ఇగ్నోర్ చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? కావాలని చేసారా ? అసలు ఈ విషయాన్నీ మధ్యప్రదేశ్ లోని బీజేపీ నాయకులకు ఉప్పు అందించింది ఎవరు , ఇవన్నీ కాంగ్రెస్ అంతర్గతముగా విచారణ చేసుకోవాలి ; ఇవన్నీ వదిలేసి ఎన్నికల సంఘాన్ని , కోర్ట్ లను నిందిస్తూ కూర్చుంటే ఉపయోగము ఉండదు.

మీడియా భాద్యత…
ఈ రోజు మీడియా మిత్రులంతా చెయ్యాల్సింది, నాంపల్లి కోర్ట్ కెళ్ళి కేసు పెండింగ్ లో లేకపోతే మీనాక్షి నటరాజన్ న్యాయవాదులు కోర్ట్ కు ఎందుకు హాజరు అవుతున్నారో వారినే అడగాలి , ప్రజలకు అసలు వివరాలు వివరించాలి. మీడియా కూడా సగం సగం నిజాలు చెప్పే ప్రయత్నాలు చేయకూడదు;
రాజకీయాల కంటే నిజాలు ముఖ్యం… భావోద్వేగాల కంటే చట్టం ముఖ్యం! – UPS

#RajyaSabha #ElectionCommission #CourtProceedings #Congress #MeenakshiNatarajan #PoliticalAnalysis #IndianPolitics

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీం కోర్టూ కొట్టేసింది… కిం కర్తవ్యం..? ఏమీ లేదు… అంగీకరించడమే..!!
  • ఆ సినారె పాట… భారతీరాజా చిత్రీకరణలో… మరుపురాని ఆపాతమధురం…
  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!
  • ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్… ఈ యుద్ధం ఏం నేర్పింది మనకు..?
  • కమ్‌తాయి… అపరిచితుడు… విరోధా‘బాసుడు… వెరసి వీరలౌక్యుడు…
  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions