Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బూతు, వెగటు, రోత, జుగుప్స… ఈ-తరం స్టాండప్ కామెడీ తీరు…

June 13, 2026 by M S R

.

Ashok Kumar Vemulapalli …. స్టాండప్ కామెడీలో ఇదొక ఛండాలం
మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్స్ వైద్య పరీక్షలు చేసిన మృత శరీరాలపై కుళ్ళు జోకులు వేసిన డాక్టర్ సెజల్ పవార్
ఒక స్టాండప్ కామెడీ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసిన సేజల్
మెడికల్ క్లాసుల్లో శవాల తల భాగాన్ని కట్ చేయడం, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పరిశీలించడం గురించి జోకులు వేసిన సెజల్
అలాగే మృతదేహాల ప్రవేట్ పార్ట్స్ సైజుల గురించి హేళన చేసిన సెజల్

వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసిన మృతదేహాల పట్ల, వారి ప్రైవేట్ భాగాల పట్ల అంత బాధ్యతారహితంగా, హేళనగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, వైద్య నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది మెడికల్ ఎథిక్స్ కు విరుద్ధమని మండిపడ్డారు.

Ads

మెడికల్ అసోసియేషన్ ఖండన…: ‘ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్’ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
మృతదేహాలను, బాడీ డొనేట్ చేసిన వారిని వినోదం కోసం ఇలా అవమానించడం ఎంతటికీ అంగీకారయోగ్యం కాదని, ఇది వైద్య విద్య యొక్క పవిత్రతను దెబ్బతీస్తుందని పేర్కొంది.

ఈ వివాదం కేవలం సోషల్ మీడియాతోనే ఆగలేదు. మృతదేహాల గౌరవానికి భంగం కలిగించేలా, అశ్లీలంగా మాట్లాడారనే ఆరోపణలపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వీడియోలో ఉన్న మెడికల్ స్టూడెంట్ సెజల్ పవార్ తో పాటు స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరేలపై FIR నమోదు చేసి, విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

వివాదం పెద్దదవ్వడం, నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఆ అమ్మాయి సేజల్ పవార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పింది.
తాను మాట్లాడిన మాటలు తప్పేనని, ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని పేర్కొంది.

సమాజానికి అత్యంత ప్రమాదకరంగా ఈ స్టాండప్ కామెడీలు మారబోతున్నాయి .. బూతుకి , జుగుప్సకి , సిగ్గులజ్జ లేని వైనానికి అడ్డాగా మారుతున్నాయి .. ఇలాంటి స్టాండప్ కామెడీలను బ్యాన్ చేయాలి .. అశోక్ వేములపల్లి



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బూతు, వెగటు, రోత, జుగుప్స… ఈ-తరం స్టాండప్ కామెడీ తీరు…
  • పువ్వులను గాలి ముద్దాడితే వాటికి సన్నగా నవ్వొచ్చిందట …!
  • *ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక* ఎందుకు సక్సెస్ అంటే..?!
  • కొడుకు మాటే నెగ్గింది… పగ్గాలన్నీ లోకేష్ చేతుల్లోకి వచ్చేసినట్టే…
  • Unsolved Mystery … ఇందిరా గాంధీ 60 లక్షల బ్యాంకు సొమ్ము కథ…
  • మీనాక్షి నటరాజన్ కేసు డిస్మిసల్ కాదు, రిజెక్షన్ కాదు… రిటర్న్..!
  • న్యాయం వచ్చేసరికి నష్టం జరిగిపోయింది… మీనాక్షి నటరాజన్ కేసు
  • సుప్రీం కోర్టూ కొట్టేసింది… కిం కర్తవ్యం..? ఏమీ లేదు… అంగీకరించడమే..!!
  • ఆ సినారె పాట… భారతీరాజా చిత్రీకరణలో… మరుపురాని ఆపాతమధురం…
  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions