.
అస్సాంలో ఒక హిమంత విశ్వశర్మ… బెంగాల్‌లో ఒక సువేందు అధికారి… అలాగే తెలంగాణలో మోడీకి ఒకరు కావాలట… ఎవరు..? హఠాత్తుగా ఈ ప్రశ్నను రేకెత్తించి ఓ చర్చకు తెరతీశాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… అది ఎవరు..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు…
నిజానికి రాధాకృష్ణ చాలా పేర్లు మరిచిపోయాడు… ఎస్, రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుని, ఎన్డీయే లేదా బీజేపీ సొంత క్యాంపును బలోపేతం చేయడం మోడీ షా కొన్నేళ్ల కార్యాచరణ… సెలక్ట్ చేసుకుంటున్న నాయకులు సంఘ్ నుంచే ఎమర్జ్ కావల్సిన అవసరం లేదు, తమ భావజాలం చట్రంలో కంఫర్టుగా ఒదిగిపోతే చాలు…
Ads
ఒక షిండే… అదే శివసేన… బీజేపీలో చేరలేదు, తన సొంత అస్థిత్వం కాపాడుకుంటూనే ఎన్డీయే క్యాంపులో కంఫర్టుగా ఇమిడిపోయాడు… ఒక టరమ్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు… ఒక సమ్రాట్ చౌదరి… బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూల నుంచి ఎదిగిన తను 2017లోనే బీజేపీలో చేరాడు, ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి… ఇంకొన్ని ఉండొచ్చు, కానీ ఇవి బలమైన ఉదాహరణలు…
మా చట్రంలో ఒదిగిపొిండి, ఎదగండి, బలంగా మద్దతునిస్తాం… ఇదీ మోడీషా యాక్షన్ ప్లాన్… సరే, బీజేపీకి తెలంగాణలో దూకుడు, సమర్థత కలిగిన నాయకుడు కనిపించడం లేదు… నిష్ఠురంగా ఉన్నా చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నదే… కొందరు ముఖ్యులు ఏకంగా కేసీయార్ ‘శ్రేయోభిలాషులు’ అనే ప్రచారమూ ఉన్నదే… (మొన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద చేసిన ఆరోపణ కూడా అదే… దొంగది కాదు, దొడ్లోకి రాదు…)
సౌత్‌లో వాళ్లకు తెలంగాణ కావాలిప్పుడు… తమిళనాడులో మొన్నటి వ్యూహాలన్నీ ఫ్లాప్, చివరకు అన్నామలై వంటి నేతలూ వెళ్లిపోయారు… కేరళ ఇప్పట్లో లొంగదు, కష్టం… కర్నాటకలో బలంగానే ఉంది… ఏపీలోనూ సరైన లీడర్ లేరు, ఎంతకూ ఎదగదు… మరి తెలంగాణ..? ఓ బలమైన లీడర్ కావాలి… అందుకే రేవంత్, హరీష్‌ల వైపు చూపు…
హరీష్ రావు మీద బీజేపీ కన్నుందనేది చాన్నాళ్లుగా ఉన్న ప్రచారమే… ఏమో, రానురాను కేసీయార్ తన కొడుకునే తన వారసుడిగా ప్రకటించేస్తే, తను రాజకీయాలకు దూరంగా ఉంటే… అప్పుడు హరీష్ రావు నిర్ణయం ఎలా ఉంటుందో గానీ… ప్రస్తుతానికి తను బీఆర్ఎస్‌ను వదలడు… నా పుట్టుక, చావు కేసీయార్ పార్టీలోనే అని హరీష్ బయటికి ఎంత గంభీరంగా చెప్పినా… కేసీయార్, కేటీయార్‌లకు కూడా తన భావి విధేయతపై సందేహాలే… సో, ఎప్పటికైనా హరీషే బీజేపీ టార్గెట్… పాజిటివ్‌గా..! ‘కలిసొస్తే ముఖ్యమంత్రివి నువ్వే’ అని చెప్పడం… రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది…
రేవంత్ ఆల్రెడీ ముఖ్యమంత్రి… తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు… ఇంకా 2029 దాకా ఈ టరమ్‌లోనే టైముంది, మొదట్లో కాస్త ఇబ్బందికరంగా అనిపించిన సీనియర్లు చల్లబడిపోయారు రకరకాల కారణాలతో… బీఆర్ఎస్ కూడా అనుకున్నంత పికప్ కావడం లేదు కాబట్టి 2029లో కూడా గెలుస్తాననే ధీమా ఉంది, హైకమాండ్‌తో సయోధ్య ఉంది… సో, మోడీ ‘కలిసి పనిచేద్దాం రా’ అని మార్మిక భాషలో బహిరంగంగానే ఆఫర్ ఇచ్చినా… ‘అది పార్టీలోకి ఆఫర్ కాదు, డెవలప్‌మెంట్‌లో కలిసి పనిచేద్దాం అన్నాడు ప్రధాని’ అంటూ దాన్ని తోసిపుచ్చాడు రేవంత్ రెడ్డి… (తన నాయకత్వ సామర్థ్యాన్ని మోడీ షా గుర్తించడం అంటే ఓ పే-ద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్టే…)
ఏతా వాతా అర్థమయ్యేది ఏమిటంటే… బీజేపీ ఈ ఇద్దరి కోసం చూస్తున్నా… మెయిన్ గురి హరీష్ రావుపైనే… బీఆర్ఎస్ కేడర్‌లో ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది కూడా హరీష్ రావుకే… సరే, ఎలాగూ అనేక గ్రూపులుగా చీలిపోయిన తన్నుకుంటున్న బీజేపీ తెలంగాణ నేతలు… ఏమో, వాళ్లంతటవాళ్లే హరీష్ రావుకు ‘బాటలు పరుస్తున్నారేమో’…!
Share this Article