.
Pardha Saradhi Upadrasta … భారత్ ₹22 లక్షల కోట్ల చమురు దిగుమతి గొలుసును ఎథనాల్ తెంచగలదా?
భారతదేశం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్లుగా ఎథనాల్ ఆధారిత ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు.
ఇటీవల E100 (100% ఎథనాల్) ఇంధనానికి సంబంధించిన నియంత్రణలకు ఆమోదం లభించడంతో దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాలపై చర్చ మరింత వేగం అందుకుంది.
జూన్ 12 వ తారీకు రాత్రి గడ్కరీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమక్షంలో 100% ఎథనాల్‌తో నడిచే WagonR Flex-Fuel వాహనాన్ని కూడా మార్కెట్ లోకి విడుదల చేశారు.
Ads
ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్న అంశాలు…
– టయోటా, సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ వంటి సంస్థలు Flex-Fuel వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అంటే మార్కెట్ కూడా 100% ఎథనాల్ కు సరిపోయే వాహనాలు తయారు చేసే పనిలో పడింది. దీని కోసం కంపెనీలు ఎక్కువ డిజైన్ మార్పులు చెయ్యాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న వాహనాలకు 100% ఎథనాల్ ను సపోర్ట్ చేసే ఇంజన్ లను ఉత్పత్తి చేసి ఫిట్ చేస్తే చాలు.
ఎథనాల్ ధర పెట్రోల్‌తో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దేశానికి భారంగా మారిన సుమారు ₹22 లక్షల కోట్ల చమురు దిగుమతి బిల్లుపై ప్రభావం చూపగల ప్రత్యామ్నాయంగా ఎథనాల్‌ను చూస్తున్నారు.
ఎథనాల్ అంటే ఏమిటి?
ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయో-ఇంధనం. ఇది పునరుత్పాదక ఇంధనం కావడంతో భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నారు.
రైతు నుంచి ఇంధన ఉత్పత్తిదారుడి వరకు…
ఎథనాల్ విస్తరణ వల్ల…
✅ రైతులకు అదనపు మార్కెట్
✅ వ్యవసాయ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్
✅ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు
✅ దేశ ఇంధన భద్రతకు బలం
లభించే అవకాశం ఉంది.
పెట్రోల్ బంకుల్లో ఏం మారుతుంది?
భవిష్యత్తులో పెట్రోల్ బంకుల్లో కింది ఎంపికలు ఉండే అవకాశం ఉంది:
🔹 E20 / E30 – సాధారణ వాహనాల కోసం
🔹 E85 – Flex-Fuel Vehicles కోసం
🔹 E100 – ప్రత్యేకంగా రూపొందించిన Flex-Fuel వాహనాల కోసం…
అంటే ఇప్పుడు చాలా పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ (E20 / E30) , డీజిల్ పోయించుకోవటానికి ప్రత్యేక పంపు లు విడివిడిగా ఎలా ఉన్నాయో, E 85/100 పంపు లు కూడా ఏర్పాటు చేసి అక్కడ E 85/100 పోస్తారు. చాలా పెట్రోల్ బంక్ లలో CNG గ్యాస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఈ మధ్య EV కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ లు పెడుతున్నాయి, అలాగే E 85/100 పంప్ లు అంతే. అంటే పెట్రోల్ బంక్ లు కూడా అప్గ్రేడ్ అవుతాయి.
అంటే ఒక పెట్రోల్ బంక్ లోకి ఒక వాహనము రాగానే ఎవరికి కావలసిన లైన్ లోకి వారు వెళ్ళి కొట్టించుకొని వెళ్ళిపోతారు. మార్కెట్లోకి కూడా నెమ్మదిగా E 85/100 సరిపోయే Flex-Fuel వాహనాలు వస్తాయి. కంపెనీలు ఉత్పత్తి అప్పుడే మొదలు పెట్టాయి. పెట్రోల్ బంక్ లు అప్గ్రేడ్ అవుతాయి.
ప్రతి వాహనం E100 వాడగలదా?
లేదు.
ప్రస్తుతం రోడ్లపై ఉన్న సాధారణ E20 వాహనాల్లో నేరుగా E100 పోయలేరు.
దానికి ప్రత్యేకంగా:
✔️ Flex-Fuel ఇంజిన్
✔️ ప్రత్యేక ఇంధన వ్యవస్థ
✔️ తుప్పు నిరోధక భాగాలు
✔️ అధునాతన ECU, సెన్సర్లు అవసరం.
దేశానికి కలిగే ప్రయోజనాలు
రైతుల ఆదాయం పెరిగే అవకాశం
విదేశీ మారక ద్రవ్య పొదుపు
చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం
పర్యావరణహిత ఇంధన వినియోగం
గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం
ఇంకా ఉన్న సవాళ్లు
🔸 దేశవ్యాప్తంగా E85/E100 పంపుల ఏర్పాటు
🔸 భారీ స్థాయిలో ఎథనాల్ ఉత్పత్తి
🔸 Flex-Fuel వాహనాల విస్తరణ
🔸 నీటి వినియోగం , వ్యవసాయ సమతుల్యత
ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ దశల వారీగా జరిగేది. ముందు ముందు పెట్రోల్. దీసిల్ , గ్యాస్. EV కొనాలా అనే చాయిస్ ల నుండి E 20 లేదా Flex-Fuel అనే ప్రత్యామ్నాయాలు ప్రజల ముందుకు వస్తాయి. ప్రజలకు ఎన్నిప్రత్యామ్నాయాలు ఉంటే అంత మంచిది.
ఎథనాల్ రేపే పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేయకపోవచ్చు. కానీ భారతదేశం ఇంధన స్వావలంబన వైపు, రైతు కేంద్రిత ఇంధన ఆర్థిక వ్యవస్థ వైపు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వేస్తున్న అతిపెద్ద అడుగుల్లో ఇది ఒకటి.
ఒకప్పుడు చమురు బావులు ఉన్నవారే ఇంధన శక్తులు, రేపు పంట పొలాలు ఉన్నవారు కూడా ఇంధన శక్తులుగా మారే అవకాశం ఉంది. 85% వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ దేశములో, పంట పొలాలు ఇంకా ఎక్కువ అందుబాటులో ఉన్న ఈ దేశంలో ఇదొక పెద్ద విప్లవం. ఇప్పటికే ఎథనాల్ కు కావలసిన ముడి సరుకును పండించే రైతులకు కేంద్రం సబ్సిడీలు ఇస్తోంది. సాంప్రదాయ పంటల నుండి రైతులు ఈ పంటల సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
దిగుమతి మీద బాగా ఆధారపడుతున్న భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవటంలో తప్పు లేదు. ఒక 10%, 20% ఈ ఎథనాల్ తో కూడిన వాహనముల వినియోగం వైపు మళ్లీనా ఇంధన భద్రతలో చాలా మార్పు వస్తుంది. ముందు ముందు వాహనాల వినియోగం, చమురు డిమాండ్ పెరిగేది తప్పితే తగ్గేది వుండదు.
ఎథనాల్ భారతదేశం పెట్రోల్ వ్యసనానికి ముగింపు పలుకుతుందా? లేక పెట్రోల్ బంక్ దగ్గరే ఆగిపోతుందా?కాలమే సమాధానం చెప్పాలి.
#EthanolFuel #BioFuel #FlexFuel #GreenEnergy #NitinGadkari #EnergySecurity #AtmanirbharBharat #IndianEconomy #Farmers #E100 #E85 #SustainableIndia #PardhaTalks
Share this Article