Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…

June 15, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta….  బ్రేకింగ్: అమెరికా–ఇరాన్ మధ్య భారీ ఒప్పందం కుదిరినట్లు సమాచారం! కానీ ఇప్పటిదాకా ఇరు వర్గాలు చెపుతున్న వాటిలో వైరుధ్యాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయింది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అలాగే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడానికి ఆయన అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

శుక్రవారం సంతకం కానున్నట్లు చెప్పబడుతున్న 14 అంశాల అవగాహన ఒప్పందం (MoU)లో ముఖ్యాంశాలు…
• అన్ని రంగాల్లో యుద్ధానికి శాశ్వత, తక్షణ ముగింపు (లెబనాన్ సహా) ( ఇది ఇజ్రాయిల్ కు ఇంకా అంగీకారం కాదు)
• ఇరాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలి
• 30 రోజుల్లో నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి ( ఇది అవదు, ఇండైరెక్ట్ గా అమెరికా నౌకలను అడ్డుకుంటూనే వుంటుంది)

Ads

• హోర్ముజ్ జలసంధిని 30 రోజుల్లో తిరిగి తెరవాలి ( ప్రతిగా ఇరాన్ కూడా నౌకలను అడ్డుకుంటూ వుంటుంది)
• ఇరాన్‌పై చమురు, పెట్రో కెమికల్ ఆంక్షల సడలింపు
• ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన $24 బిలియన్ నిధుల విడుదల
• ఇరాన్ పునర్నిర్మాణానికి కనీసం $300 బిలియన్ ప్రణాళికలు ( మేము ఒప్పుకోలేదు అని అమెరికా అన్నది )

• అణు అంశాలపై 60 రోజుల చర్చలు
• NPT ప్రకారం అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటన
• క్షిపణి కార్యక్రమం, రెసిస్టెన్స్ గ్రూపులకు మద్దతు అంశాలు చర్చల అజెండా నుంచి తొలగింపు

ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది ప్రకారం, ఇరాన్ కోరిన ముఖ్య అంశాలన్నీ ముసాయిదాలో చేర్చబడ్డాయి. అధికారిక సంతకం అనంతరం పూర్తి పాఠ్యాన్ని విడుదల చేస్తామని తెలిపారు.
పాకిస్థాన్ ప్రధాని కూడా అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతక కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకోవని, అమెరికా– ఇరాన్ ఒప్పందంలోని లెబనాన్ నిబంధన తమపై వర్తించదని స్పష్టం చేశారు.
So, సింపుల్ గా కుదిరినట్లు కనిపిస్తున్న కుదరని ఒప్పందం
అధికారికంగా సంతకం అయ్యే వరకు తుది ఒప్పందం వివరాలు మారే అవకాశం ఉంది.

ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ లు ఇంకా దోబూచులాడుతున్నాయి.
శాంతి ఒప్పందం అని అమెరికా అంటోంది, MOU అని ఇరాన్ అంటోంది, 14 పాయింట్ ఫార్ములాలో కొన్ని పాయింట్లకు ఇజ్రాయిల్ అసలు ఒప్పుకోలేదు. ఇవన్నీ ఇప్పుడే అయ్యేవి కాదు,
ఒక 30 రోజులు జల సంధి ఓపెన్ చేసి, చమురు free గా అటు ఇటు flow అయ్యేలా చేసి చమురు రిజర్వ్ లు పెంచుకొని మళ్ళీ మొదలు పెట్టే అవకాశమే ఎక్కువ.

#Iran #USA #Trump #MiddleEast #HormuzStrait #Israel #Lebanon #Geopolitics #WorldNews #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!
  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…
  • రోజులు మారాయ్ ! నువ్వెంత తోపు స్టార్ అయితేనేం- స్టోరీ ఏమిటో చెప్పు !
  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions