Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జానీవాకర్ విస్కీ..! అసలైన ‘కిక్’ ఏది..? ధరను బట్టి ‘థ్రిల్’ కాదు..!!

June 17, 2026 by M S R

.

చాలామంది విస్కీ ప్రియులకు జానీవాకర్ బ్రాండ్ అంటే ఓ పిచ్చి… అంతకుమించిన బ్రాండ్లు ఎన్ని ఉన్నా సరే..! కానీ చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. జానీవాకర్ బాటిల్ ధర ఎంత ఎక్కువగా ఉంటే, దాని రుచి అంత అద్భుతంగా ఉంటుందని నమ్ముతారు… అఫ్‌కోర్స్, జిహ్వకో రుచి, చూడచూడ టేస్టుల జాడ వేరయా అన్నట్టు… ఎవరి ఇష్టం వాళ్లది…

కానీ, నిజానికి ధర అనేది కేవలం మార్కెటింగ్ వ్యూహం మాత్రమే. మీ అతిథులు మెచ్చుకోవడానికి లేదా హోదా కోసం ఖరీదైన బాటిల్ కొనడం వేరు, కానీ ప్రశాంతంగా కూర్చుని గ్లాసు నింపుకున్నప్పుడు మీకు నిజమైన తృప్తిని ఇచ్చేది ఏది? ఇదే విషయాన్ని తెలుసుకోవడానికి, మొత్తం 9 రకాల జానీవాకర్ విస్కీలను బ్లైండ్ టెస్ట్ చేస్తే వచ్చిన ఆసక్తికరమైన ఫలితాల్ని ఓ లిక్కర్ రిలేటెడ్ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది…

Ads

అట్టడుగున ఉన్న జానీవాకర్ రెడ్ లేబుల్‌తో మొదలుపెడదాం.., ఇది జస్ట్ సిప్ చేయడానికి అస్సలు సరిపోదు. ఇది చప్పరించడం కాదు, తాగాలి… కేవలం జింజర్ బీర్ లేదా సోడాతో కలుపుకొని తాగే ‘మిక్సర్’ కోసం మాత్రమే తయారు చేయబడింది… ఆ తర్వాత గోల్డ్ లేబుల్ రిజర్వ్… ఇది తాగడానికి చాలా మెత్తగా, మత్తుగా, సున్నితంగా ఉంటుంది, కానీ మరీ సాఫ్ట్‌నెస్ ఎక్కువయిపోయి ఆకట్టుకునే అసలైన ఆల్కహాలిక్ ‘కిక్’ లోపిస్తుంది…

johnnei walker

ఇక డబుల్ బ్లాక్ విషయానికి వస్తే.., పేరుకు తగ్గట్టుగా ఇందులో స్మోకీ ఫ్లేవర్ ఉండాలని మనం ఆశిస్తాం, కానీ అది ఆశించిన స్థాయిలో ఉండదు… అదే విధంగా, కొత్తగా వచ్చిన బ్లాక్ రూబీ ఫ్రూటీ ఫ్లేవర్‌తో బాగుంటుంది కానీ, ఇది రెగ్యులర్ బ్లాక్ లేబుల్ ఇచ్చే సంతృప్తిని అందుకోలేదు…

లిస్టులో ఐదవ స్థానంలో ఉన్న జానీవాకర్ బ్లూ లేబుల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అత్యంత ఖరీదైన బాటిల్ అయినప్పటికీ, బ్లైండ్ టెస్ట్‌లో ఇది కేవలం ఓ సాదాసీదా, అంటే సాధారణ అనుభూతినే ఇస్తుంది. ఇది చాలా సాఫ్ట్, బ్యాలెన్స్‌డ్‌గా… కానీ, మీరు పెట్టే భారీ ధరకు తగ్గట్టుగా ఇందులో ఎలాంటి ‘థ్రిల్’ ఉండదు…

ఆ తర్వాత వస్తుంది XR 21… 21 ఏళ్ల పాత విస్కీలతో తయారైన ఇది, బ్లూ లేబుల్ కంటే మెరుగైన క్యారెక్టర్,  అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇక మొదటి మూడు స్థానాల విషయానికి వస్తే, జానీవాకర్ 18 ఇయర్ ఓల్డ్ అద్భుతమైన లగ్జరీని, డెప్త్‌ని అందిస్తుంది. ఇది బ్లూ లేబుల్ కంటే తక్కువ ధరలో ఎక్కువ రుచిని ఇస్తుంది. రెండవ స్థానంలో ఎప్పటికీ నమ్మదగ్గ బ్లాక్ లేబుల్ 12 ఇయర్ నిలుస్తుంది. ఇది ప్రతి మద్యాభిమాని ఇంట్లో ఉండాల్సిన, ఎంతో సమతుల్యమైన విస్కీ…

చివరగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ అగ్రస్థానంలో నిలిచింది జానీవాకర్ గ్రీన్ లేబుల్ 15 ఇయర్. ఇందులో గ్రెయిన్ విస్కీ అస్సలు ఉండదు, కేవలం మాల్ట్ విస్కీల మిశ్రమమే. 43% స్ట్రెంత్ ఉన్న ఈ విస్కీ, స్మోకీ, పెప్పరీ , ఫ్రూటీ ఫ్లేవర్ల కలయికతో ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. తక్కువ ధరలో ఇంత క్యారెక్టర్ ఉన్న విస్కీ దొరకడం నిజంగా గొప్ప విషయం.

సో, బాటిల్ మెరుపులను లేదా ధరను చూసి నిర్ణయం తీసుకోకండి. అసలైన విస్కీ ప్రియుడికి రుచి ముఖ్యం. ఆ టెస్ట్‌లో గ్రీన్ లేబుల్ విజేతగా నిలిచింది… ఇఖ వష్తాణు… షెళవు…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!
  • జానీవాకర్ విస్కీ..! అసలైన ‘కిక్’ ఏది..? ధరను బట్టి ‘థ్రిల్’ కాదు..!!
  • క్రుయల్ టాలీవుడ్… ఇక్కడ మనుషులుండరు… జస్ట్, కరెన్సీ నోట్లు మాత్రమే…
  • కేసీఆర్ దోస్త్ ఆగవ్వ… ఇల్లు కూల్చి ఆగం చేస్తే, కాంగ్రెస్ కట్టించి ఆదుకుంది…
  • పంజాబ్ ఆప్ సర్కారులో ముసలం..! ముదురుతోంది వివాదం..!
  • Obsession … థియేటర్ వదిలినా చాలాసేపు ఆ పాత్ర మనల్ని వదలదు…
  • అక్రమ బంధం..! రేవంత్ కిషన్‌రెడ్డిని కొడితే కేటీఆర్‌కు వాతలు..!
  • విజయాలెన్ని వరిస్తున్నా… తన కెమెరా పనిని మాత్రం వదల్లేదు…
  • బాలయ్యతోనే తొలి తెలుగు సినిమా… మళ్లీ ఇటువైపు రాలేదు పెద్దగా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions