Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…

June 17, 2026 by M S R

.

నేడు వరంగల్ లో పవన్ కళ్యాణ్ పర్యటన. హనుమకొండలో బాలుడిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ (17). బాలుడు నిరంజన్ కోరిక మేరకు ఇంటికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్…. ఇదీ వార్త.

ఈసారి ఎవరూ తనను విమర్శించకుండా ఓ హ్యూమన్ యాంగిల్‌లో వస్తున్నాడు తెలంగాణ పరమవిద్వేషి పవన్ కల్యాణ్… నిజానికి రేవంత్ రెడ్డి పవన్ కల్యాణ్ పోకడను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టుంది. బీజేపీ-జనసేన-బీఆర్ఎస్ జాయింట్ పొలిటికల్ ఎత్తుగడ అని అర్థమవుతున్నట్టు లేదు తనకు…

Ads

పదే పదే అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తాడు తెలంగాణలో జనం థూత్కరిస్తారు… ఐనా వదలడు, కొండగట్టు అంటాడు, తెలంగాణ కోసం 11 రోజులు నిద్రాహారాలు మానేసిన విపరీత విషద్వేషి ఇప్పుడేమో తెలంగాణను విభజించిన తీరు నచ్చలేదు అంటాడు… ఫేక్… అబద్ధాలు, అలవాటైన అబద్ధాలు, తన ప్రతి అడుగు చంచలమే…

pk

మాయావతి కాళ్ల మీద పడ్డ ఈ చేగువేరా భక్తుడు హఠాత్తుగా సనాతన ధర్మరక్షకుడు కావడంలోనే తన చంచల స్వభావం ఉంది… తెలంగాణ మీద వ్యతిరేకత లేదంటాడు, తనే తెలంగాణ దిష్టి తగిలి కోస్తాలో కొబ్బరిచెట్లు ఎండిపోయాయి అంటాడు… పవన్ కల్యాణ్‌ను సమర్థిస్తూ, నెత్తి మీద మోస్తున్న తెలంగాణ బీజేపీ నేతలను చూస్తే జాలిపడటమే… కాదు, అదీ ఓ కుట్రలో భాగమే…

చంద్రబాబుకు చేదు భంగపాట్లు గుర్తున్నట్టు లేదు, అందుకే పవన్ కల్యాణ్‌ను ముందుకు నెడుతున్న బీజేపీ – బీఆర్ఎస్ జాయింట్ కుట్ర అర్థమవుతున్నట్టు లేదు… పవన్ కల్యాణ్ వస్తాడు, మీటింగు అంటాడు, తెలంగాణ నవనిర్మాణ సంకల్పం అట, నువ్వెవడివిరా అని తెలంగాణ ఛపో అన్నది, ఐనా సరే, పోలీసులు ప్రెస్‌మీట్‌కు కనీసం అనుమతిస్తారా అని వెటకారం చేశాడు… ఏవో పిచ్చి కూతలు మళ్లీ…

ఇప్పుడు మరో సాకుతో వరంగల్ వస్తాడు, వచ్చినవాడు ఊరుకోడు, ఏదో కూస్తాడు… తెలంగాణ సెంటిమెంట్ రగిలించే కాషాయ ఎత్తుగడ… దీంతో బీఆర్ఎస్‌కు లాభం, ఎంతసేపూ కేసీయార్ కాళ్ల మీద తాకట్టు పెట్టే బీజేపీ కొందరు నేతలకు ఆనందం… బీఆర్ఎస్‌తోపాటు తమకూ నాలుగు వోట్లు పడతాయని…

నిజానికి పవన్ కల్యాణ్ కావాలనే పదే పదే గోకుతున్నాడు రేవంత్ రెడ్డిని… బీఆర్ఎస్ హయాంలో అంతా బాగానే ఉందట, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ ఆంధ్రా ద్వేషం కనిపిస్తోందట… ఏమైనా చటాక్ గుజ్జున్న మాటలేనా ఇవి..?

ఒక సినిమా నటుడు, ఏదో జగన్ దుష్టపాలన పుణ్యమాని, అంతకు ఎవడూ పట్టించుకోని పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. దాంతో తనకు తాను తోపు అనుకుంటున్నాడు… సో, తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీ చేస్తే తప్పేమిటి అనడిగాడు ఓ మిత్రుడు… తెల్లారిలేస్తే తెలంగాణను ద్వేషించేవాడిని తెలంగాణ ఎందుకు సహించాలి..? దశాబ్దాల పీడన అప్పుడే మరిచిపోయి ఆలింగనం చేసుకోవాలా..? ఇలాంటి ద్వేషులను..!

మొన్నెవరో ఓ ఆర్టికల్‌లో రాసుకొచ్చాడు… దక్షిణ తెలంగాణలో పవన్ కల్యాణ్‌ను తురుఫు ముక్కగా వాడుకోవాలని మోడీషా ఆలోచిస్తున్నారు అని… అబ్బో, మరి మొన్న తమిళనాడులో బలిజ మార్క్ వోట్లు బాగా ఉన్న ఏరియాలకూ ఎందుకు వెళ్లలేదు..? కేరళ ? చివరకు ఎవరూ పట్టించుకోరు తనను అని తెలిసీ చంద్రబాబు వెళ్లాడు తమిళనాడు… అఫ్‌కోర్స్, తను వెళ్లిన ప్రతిచోటా భంగపాటే, అది వేరే సంగతి…

ఏతావాతా పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మార్చాడు, పొలిటికల్ కాదు, ఈసారి హ్యూమన్ యాంగిల్‌లో వస్తాడు, గెలుకుతాడు… రేవంత్ రెడ్డి కొంత లోతుగా అర్థం చేసుకోవాల్సిన కేరక్టర్ పవన్ కల్యాణ్… బహుపరాక్ పాలకా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!
  • జానీవాకర్ విస్కీ..! అసలైన ‘కిక్’ ఏది..? ధరను బట్టి ‘థ్రిల్’ కాదు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions