.
రాజకీయ రంగస్థలం… పశ్చిమ బెంగాల్‌లోని సున్నితమైన ప్రాంతం ‘సందేశ్‌ఖాలీ’. అక్కడ టీఎంసీ గూండాలదే రాజ్యం. ఆ గాలిలో ఎప్పుడూ భయం, అప్పుడప్పుడే తిరుగుబాటు ధ్వనులు వినిపిస్తున్నాయి. మహిళలపై సాగిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు అక్కడ.
మమత టీఎంసీ గుండాల ఆగడాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ధీరవనిత ‘రేఖా పాత్ర’. ఆమె కేవలం ఒక మహిళ కాదు, ఒక రాజకీయ శక్తి. ఆ శక్తిని వేదికపైకి తీసుకురావాలన్నదే ఆ రోజు లక్ష్యం. ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చింది కూడా…
Ads
సన్నివేశం 1: వేదికపై ఆందోళన…
బిజెపి అభ్యర్థిగా ప్రచారం చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సందేశ్‌ఖాలీకి చేరుకున్నారు. వేదిక సిద్ధంగా ఉంది, వేలాది మంది జనం ఎదురుచూస్తున్నారు. కానీ, రంగంలో ఉండాల్సిన అభ్యర్థి రేఖా పాత్ర ఎక్కడ?
ప్రచార సమన్వయకర్త నిషికాంత్ దూబే కంగారుగా అమిత్ షా దగ్గరకు వచ్చి, “ఆమె ఆచూకీ తెలియడం లేదు” అని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడైతే కంగారు పడేవారు, కానీ అమిత్ షా మొహంలో ఏమాత్రం చలనం లేదు. “పర్వాలేదు, సమావేశాన్ని కొనసాగించండి” అంటూనే, ఆమె ఫోన్ నంబర్‌ను తీసుకున్నారు.
సన్నివేశం 2: గూఢచారిలా గగనతలం నుండి నేల మీదకు…
ప్రసంగాలు మొదలయ్యాయి. అదే సమయంలో తెర వెనుక మరో ఆపరేషన్ మొదలైంది. ఆయన నిషికాంత్ దూబేను పిలిచి, “ఆమె 300- 400 మీటర్ల పరిధిలోనే ఉంది, వెళ్లి తీసుకురండి” అని కచ్చితంగా ఆదేశించారు. నిషికాంత్ ఆశ్చర్యపోయారు—ఎందుకంటే నిమిషాల క్రితం వరకు ఆమె ఆచూకీ తెలియక తల పట్టుకున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన అమిత్ షాకు ఆమె ఎక్కడుందో ఎలా తెలిసింది?
ఇక్కడ జరిగింది ఒక ‘సైలెంట్ ఆపరేషన్’. ఐబీ (Intelligence Bureau) అధికారులకు ఆమె మొబైల్ నంబర్ వెళ్లడం, సెకన్ల వ్యవధిలో మొబైల్ టవర్ డేటా ద్వారా ఆమెను నిర్బంధించిన ఇంటిని గుర్తించడం, కేంద్ర బలగాలు అక్కడికి దూసుకెళ్లి గుండాల చెర నుండి ఆమెను విడిపించడం—ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన ‘యాక్షన్ సీన్’…
సన్నివేశం 3: ఆ ‘క్రాస్ ఎగ్జామినేషన్’
నిషికాంత్ దూబే ఆమెను వేదికపైకి తీసుకురాగానే, అమిత్ షా వేసిన ప్రశ్నలు అక్కడున్న వారందరినీ మరోసారి ఆశ్చర్యపరిచాయి. “ఆమె నిజంగానే రేఖా పాత్రేనా? కన్‌ఫరమ్ చేయండి జనానికి” అని నిషికాంత్‌ను పదే పదే అడిగారు. అది అనుమానం కాదు, తన వద్ద ఉన్న ‘ఇంటెలిజెన్స్ రిపోర్ట్’ను ధృవీకరించుకునే ఒక వ్యూహాత్మక అడుగు.
ఇదొక రాజకీయ సభలా కాకుండా, ఒక ఇంటెలిజెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. అభ్యర్థిని అపహరించడానికి టీఎంసీ గుండాలు వేసిన ఎత్తుగడను, ఒక మాస్టర్ మైండ్‌తో అమిత్ షా ఎలా చిత్తు చేశారో ఈ సంఘటన నిదర్శనం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంబంధిత వీడియోలు చూస్తుంటే, ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది: దేశ భద్రత, వ్యూహరచన విషయంలో అమిత్ షా స్టైలే వేరు!
నిజమో.. అబద్ధమో.. కానీ, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న ఈ కథ వింటుంటే మాత్రం ఆపరేషన్ బెంగాల్ కథలో ఇలాంటివెన్నో కథనాలు ఉన్నాయి కదా... అవునూ, ఆమెను ఆ మీటింగు స్థలానికి దగ్గరలోనే ఓ గదిలో నిర్బంధించిన ఆ గూండాలు ఎన్నికల ఫలితాల తరువాత ఏమయ్యారు..? ఎనీ ఐడియా..!!
Share this Article