.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది తారలు వచ్చి వెళ్తుంటారు. కానీ, కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అలనాటి అగ్రకథానాయికల అందచందాల గురించి, వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఇప్పటికీ అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన మధురమైన జ్ఞాపకాలను, కొంత చేదు నిజాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అతిలోక సుందరి ఆకర్షణ మురళీ మోహన్ అప్పటి హీరోయిన్ల గురించి చెబుతూ, మొదటగా శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు. “శ్రీదేవి అంటేనే ఒక ఆకర్షణ. ఆమె అందం, కళ్ళలోని భావం, అభినయం.. అన్నీ అద్భుతం. ముఖ్యంగా నా పక్కన నటించేటప్పుడు, నా ఎత్తుకు సరిగ్గా సరిపోయే ఆమె గ్లామర్ అప్పట్లో అందరినీ మైమరిపించేది” అని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
శ్రీదేవికి దీటుగా.. నటి దీప! శ్రీదేవి తర్వాత ఆ స్థాయి అందం ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే, అది నటి దీప అని మురళీ మోహన్ పేర్కొనడం విశేషం. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దీప, తన సహజ సిద్ధమైన అందంతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆమెను చూసినప్పుడు ఒక దేవకన్యలా అనిపించేదని ఆయన గుర్తుచేసుకున్నారు.
Ads
తల్లి చేసిన ‘ప్రేమ’ భరిత తప్పిదం! అయితే, దీప కెరీర్ విషయంలో మురళీ మోహన్ చెప్పిన ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీప షూటింగ్కు వచ్చిన ప్రతిసారీ ఆమె తల్లి వెంటే ఉండేది. ఆ పర్యవేక్షణలో ఆమె తల్లి దీప పట్ల చూపే అతి జాగ్రత్తే ఆమె కొంపముంచింది.
అతిగా తినిపించడం… షాట్ గ్యాప్ దొరికితే చాలు, దీపకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర చిరుతిళ్లు తినిపిస్తూ ఉండేదట. ఎవరైనా దీప తల్లిని “తనే తింటుంది కదా” అని అంటే, “అయ్యో.. చిన్న పిల్ల కదండీ” అని ముద్దుగా సమాధానం చెప్పేదట.
దుష్ప్రభావం…: తల్లి ప్రేమగా తినిపించిన ఆ చిరుతిళ్లు, క్రమంగా దీప రూపురేఖలను మార్చేశాయి. కొద్ది రోజుల్లోనే ఆమె విపరీతంగా బరువు పెరిగి బొద్దుగా మారిపోయింది.
స్టెరాయిడ్స్ వివాదం…: ఇక మరోవైపు, త్వరగా హీరోయిన్గా ఎదగాలని ఆమెకు స్టెరాయిడ్స్ వంటి మందులు ఇచ్చారనే టాక్ కూడా అప్పట్లో గట్టిగా వినిపించిందని మురళీ మోహన్ వెల్లడించారు. ఈ రెండు కారణాల వల్ల, అనతి కాలంలోనే అద్భుతమైన కెరీర్ అందుకోవాల్సిన దీప, తన సహజ అందాన్ని కోల్పోయి ఇండస్ట్రీలో వెనుకబడాల్సి వచ్చింది.
సహజత్వానికి మారుపేరు జయసుధ! ఇక ఇదే ఇంటర్వ్యూలో జయసుధ గురించి చెబుతూ, ఆమెను “ఫ్యామిలీ లేడీ” అని అభివర్ణించారు మురళీ మోహన్. “జయసుధ నటిస్తుంటే అది నటనలా అనిపించదు, ఏదో మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. సింపుల్ మేకప్, నేత చీరలతో ఆమె ఎంత సహజంగా కనిపిస్తారో, నిజ జీవితంలో కూడా అంతే మంచి మనసున్న మనిషి. ఆమెను నేను సొంత చెల్లెలిలా భావిస్తాను” అని తన అనుబంధాన్ని పంచుకున్నారు.
ఒక నటి కెరీర్లో గ్లామర్ ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడంలో క్రమశిక్షణ, సరైన పర్యవేక్షణ ఎంత అవసరమో దీప ఉదంతం మనకు తెలియజేస్తుంది. చాలామంది తారల తల్లులు భద్రత, కాపలా, మనీ మేనేజ్మెంట్, అతి జాగ్రత్త ప్రదర్శిస్తారనీ, కానీ అవే చాలామంది తారల కెరీర్ను నష్టపరుస్తాయని చెప్పడానికీ ఇదీ ఓ ఉదాహరణ…
Share this Article