.
రాంచరణ్ హీరోగా తీయబడిన ‘పెద్ది’ సినిమా నిజంగా సినిమా టీమ్ ప్రచారం చేసుకుంటున్నట్టు 400 కోట్లు దాటిందా..? బ్లాక్ బస్టర్ అనిపించుకున్నట్టేనా ఈ పాన్ ఇండియా మూవీ..? ఇప్పుడు ఇదొక ప్రశ్న… ఇండియన్ సినిమా వివాదాస్పద విమర్శకుడు- విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ తన సోషల్ మీడియా వేదికలపై ఈ సినిమా డిజాస్టర్ అంటున్నాడు…
సరే, తను చెప్పినవన్నీ నమ్మలేకపోయినా… ఓసారి తనేం అంటున్నాడో చూద్దాం… ‘‘హిందీలో ఈ సినిమాకు 15 కోట్ల నెట్ బిజినెస్ జరిగింది, కానీ నిర్మాతకు వచ్చేదేమో ఆరు కోట్లు… మొత్తం 350 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమాకు… ఓవర్సీస్ బిజినెస్ 35 కోట్లు, డిజిటల్ రైట్స్ 100 కోట్లు, మొత్తం థియేటరికల్ బిజినెస్ 150 కోట్లు… అంటే నిర్మాతకు 50 కోట్ల నష్టం… కరప్ట్ మీడియా దీన్ని సూపర్ హిట్ అని రాస్తోంది’’ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు…
Ads
కానీ బిజినెస్ జరిగిన లెక్కలు, గ్రాస్ వసూళ్లు, నెట్ రెవిన్యూ, షేరింగ్ ఎట్సెట్రా లెక్కల్లోకి పోకుండా… ఓసారి sacnilk అంకెలను బట్టి చూస్తే… ఇది పేరుకే పాన్ ఇండియా సినిమా… రాంచరణ్‌ను కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులకు యాక్సెప్ట్ చేయలేదని అర్థమవుతోంది… ఎలాగంటే..?
14 రోజులైంది కదా… కన్నడంలో దీని వసూళ్లు కేవలం 1.69 కోట్లు (నెట్)… మరీ రోజువారీ కలెక్షన్లు అయిదు లక్షలకు పడిపోయింది… తమిళంలో వసూళ్లు 1.96 కోట్లు మాత్రమే… 14వ రోజు తమిళ కలెక్షన్లు మరీ రెండు లక్షలు మాత్రమే… మలయాళంలో మొత్తం వసూళ్లు కేవలం 30 లక్షలు మాత్రమే… ఎనిమిదో రోజున కలెక్షన్లు లక్ష రూపాయలు, తరువాత తీసేశారు… (ఏమాటకామాట మలయాళంలో బన్నీ సినిమా అంటే మాత్రం మహా క్రేజు ఉంటుంది)…
సో, తెలుగు మినహా మిగతా మూడు దక్షిణ భాషల్లో పెద్ది ఫ్లాప్… మరి హిందీ..? కొంత నయం 21.5 కోట్ల నెట్ కలెక్షన్లు… పర్లేదు, సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే, నార్త్ బెల్టులో ఈ వసూళ్లు తక్కువేమీ కావు… కాకపోతే పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఈ రికవరీ కూడా తక్కువే.,. తక్కువ యాక్యుపెన్సీతోనైనా హిందీలో ఇంకా నడుస్తోంది…
మరి తెలుగు..? ఇదే ప్రధానం… 200 కోట్ల నెట్ కలెక్షన్లు… రోజువారీ వసూళ్లు 2 కోట్లకు పడిపోయినా సరే, మార్కెట్లో వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఇంకా రన్ అవుతోంది… మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు (నెట్) 320 కోట్లు… మిగతా భాషల్లో తీసేసినా తెలుగులో ఇంకొన్ని రోజులు నడుస్తుంది… డిజిటల్ రైట్స్ ఎట్సెట్రా కలిపితే నిర్మాత సులభంగానే గట్టెక్కుతాడు..!! సో, కమాల్ ఖాన్ పూర్తి అబద్ధం కాదు, మొత్తం నిజమూ కాదు… ఇదీ తన విశ్లేషణ లింక్…
https://www.facebook.com/reel/980164331587949
Share this Article