.
Priyadarshini Krishna …. దగ్గుమందు లాంటి సిరప్స్ ని భారత ప్రభుత్వం ఎందుకు బాన్ చేసింది …?
చాలాసార్లు భారత్ ప్రభుత్వ విధానాలు వింత విచిత్రంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడనివిగా ఉంటాయి … లేటెస్టుగా దగ్గుమందు cough syrups ని ఎటువంటి డాక్టర్ చీటి prescription లేకుండా మెడికల్ షాప్ లో అమ్మడాన్ని బాన్ చేసింది…
‘డ్రగ్స్ రూల్స్-1945’ లో సవరణలు చేసి, షెడ్యూల్ ‘K’ పరిధిలో ఉన్న ఇతర మినహాయింపులను కూడా తొలగించింది.
నాణ్యతా ప్రమాణాలు లోపించిన, విషపూరిత రసాయనాలు Diethylene Glycol, Ethylene Glycol కలిగిన కొన్ని దగ్గు మందులు వాడటం వల్ల దేశంలోనూ, విదేశాల్లోనూ చాలా మంది పిల్లలు మరణించారు. ఈ విషాద ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Ads
కోడిన్ (Codeine) ఆధారిత దగ్గు మందులను మత్తు పదార్థాలుగా వాడుకోవడం/దుర్వినియోగం చేయడం (Substance abuse) ఎక్కువైంది.
మధ్యప్రదేశ్‌లో ఇలాంటి చాలా కేసులు ఈ మధ్యకాలంలో బయటపడ్డాయి. యువత దీనికి బానిస కాకుండా అడ్డుకోవడం కోసం ఈ నిబంధనను తీసుకువచ్చింది ప్రభుత్వం.
డాక్టర్ సలహా లేకుండా ఇష్టానుసారంగా వాడటం వల్ల కిడ్నీ, కాలేయం దెబ్బ తినే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలకు తప్పుడు మోతాదులు వెళ్లకుండా నివారించడం దీని ఉద్దేశ్యం
దగ్గు మందు తయారీలో ఈ కింది రసాయనాలు -drugs తెగ వాడుతారు …
డైఇథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol – DEG) , ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol). ఇది దగ్గును అణచివేయడానికి (Cough Suppressant) వాడే రసాయనం. ఓపియాయిడ్ (నొప్పి నివారణ మందు/మత్తు పదార్థం).
దీన్ని ఎక్కువకాలం వాడితే అలవాటుపడే , వ్యసనంగా మారే (Addiction) ప్రమాదం ఉంది.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ (Dextromethorphan) ఇది కూడా దగ్గు మందుల్లో సాధారణంగా వాడేదే అయినప్పటికీ, చిన్న పిల్లలకు దీని మోతాదు ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, మత్తు, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.
పైన పేర్కొన్న painkilling కాంపోనెంట్స్ మాత్రమే కాకుండా ఇతర అనేక ఇండస్ట్రియల్ రసాయనాలను కూడా ఈ దగ్గు మందులను తయారు చేసే కంపెనీలు హద్దు అదుపు లేకుండా వాడేస్తున్నాయి.
రోగులకు రుచికరంగా ఉండేందుకు సుక్రోస్ , సోర్బిటోల్, గ్లైకాల్, సాచరిన్ వంటి రసాయనాలను అధిక మోతాదుల్లో కలుపుతున్నారు …
ఇవి రోగుల కిడ్నీ, లివర్, పాంక్రియాస్ పైన దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది… డయాబెటిక్ రోగులు ఈ దగ్గు మందులను తరుచుగా తీయుకోవడం వల్ల సుగర్ లెవల్స్ పెరిగి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది…
ఈ లెక్కన అసలు దగ్గు మందులు ఎవరు తీసుకోకూడదు అని తెలుస్తోంది. ప్రాణాంతకమైన ఈ మందు ఎంతో గొప్పది, దగ్గు నుండి వెంటనే ఉపశమనం, ఈ మందుకు తిరుగు లేదు అని ప్రచారాలు చేస్తూ కోట్లు ఖర్చుపెట్టి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నాయి చాలా కంపెనీలు….
ఇంత ప్రమాదకరమైన విషాన్ని మందు అని లేబిల్ వేసి కంపెనీలు అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ వుంది… ఇప్పటికీ కాస్త స్పృహ తెచ్చుకుని డాక్టర్ చీటితో అమ్మవచ్చునని రెగ్యులేట్ చెయ్యడంలో ఆంతర్యం అర్థం అవడం లేదు …
పైన పేర్కొన్న రసాయనాలను నిషేధించి, అలాంటి కాంపోనెంట్స్ తో వుండే syrup formula ను బాన్ చెయ్యాల్సింది పోయి, డాక్టర్ చీటితో వాడుకోండి అనడం ఏమిటో మన బోటి ప్రజలకు అర్థం కాదు….
అనేకానేక బడా కంపెనీల నుండి ఆమ్యామ్యాలు పోతాయి అని భయం అయివుంటుంది…
ఏదియేమైనా …. మనకు దగ్గు వస్తే యమగోల సినిమాలో చిత్రగుప్తునితో రాము (అల్లు రామలింగయ్య తో ఎన్టీఆర్) అన్నట్లు ‘ దగ్గు వచ్చిన.. దగ్గుము’ అనుకుని దగ్గుకోవడమే …. లేదా ఒక కరక్కాయ బుగ్గన పెట్టుకుని ఉపశమనం పొందడమే ….!
మనం దశాబ్దాల తరబడి వాడుతున్న vicks syrup తాలుకా 1950s నాటి అడ్వర్టయిజ్‌మెంట్ లో .. దాని ఫార్ములా లో వాడిన Cetamium – స్పెల్లింగ్ కూడా ఎంత మిస్లీడింగ్ గా వుందో .. ఆ కెమికల్ పేరు Ketamine … దానిని ఎందుకు, ఎందులో వాడుతారో కూడా కులంకషంగా చూడండి –
Ketamine is a fast-acting, dissociative anesthetic that distorts the perception of sight and sound while inducing feelings of detachment from pain and the environment. While primarily used in human and veterinary medicine, it is also prescribed in clinical settings for severe depression and used illicitly as a recreational club drug.
ఇలాంటి ఒక డ్రగ్ ని చంటిపిల్లకు, వృద్ధులకు, గర్భిణీలకు అప్పట్లో తెగ వాడేశారు …. ప్రభుత్వాలు కూడా ఈ దగ్గుమందు తాగి పడుకుని ఉంటాయి.
#coughsyrups
#banoncoughsyrups
#AIMcouncel
#abuseofcoughsyrup
Share this Article