Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

June 19, 2026 by M S R

.

వడ్డే నవీన్… చాన్నాళ్ల క్రితం కథానాయకుడు… బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు… వడ్డే రమేష్ కొడుకు… ఏకంగా నందమూరి కుటుంబంతో వియ్యం అందుకున్న కుటుంబం… అంత బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే. నవీన్ ఎన్నో సినిమాలు చేసినా సరే, పెద్దగా క్లిక్ కాలేదు…

తన పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ఒకటే ‘పెళ్లి’… నవీన్ కారణంగా కాదు, శారద నటన, రుక్కురుక్కు పాట, కోడి రామకృష్ణ దర్శకత్వం కారణంగా కాస్త ఆడినట్టుంది… అంతే… తరువాత కూడా ఫ్లాపులు… ఇక సినిమాల్ని మానేశాడు నవీన్…

Ads

మళ్లీ చాలా ఏళ్ల తరువాత… 55 ఏళ్ల వయస్సులో రీఎంట్రీ… ఏజ్ బార్… పైగా తనే డబ్బులు పెట్టి మరీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా తీశాడు… ఎవరో నార్ల కమల్ తేజ అనే కొత్త దర్శకుడు (?)… అసలు రీఎంట్రీ దేనికి..? ఎందుకు మళ్లీ గోక్కున్నట్టు..? అప్పట్లో యాక్సెప్టెన్స్ లేదు కదా తనకు ప్రేక్షకుల నుంచి, ఈ వయస్సులో ఆదరిస్తారని ఎందుకు అనుకున్నాడు..?

అసలే ఇండస్ట్రీలో కట్ థ్రోట్ కంపిటీషన్ ఇప్పుడు… సరే, చిరంజీవి, మమ్ముట్టి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, కమలహాసన్, మోహన్‌లాల్ వంటి ఏజ్ బార్ హీరోలు ఎందరో ఉన్నారు, అందరూ రీఎంట్రీలో చిరంజీవిలాగా క్లిక్ కారు, చిరంజీవి పాపులారిటీ వేరు… కానీ ఆల్రెడీ చాలాఏళ్లపాటు పక్కన ఉండిపోయిన నవీన్ మళ్లీ పట్టాలెక్కడం అంత ఈజీయా..? నిజం ఇలాగే కటువుగానే ఉంటుంది…

పోనీ, ఏదైనా ప్రయోగం చేశాడా..? లేదు… ఓ పాత కథ… ఓ అత్యాచారం, ఎఫ్ఐఆర్… కానీ ఓ పొలిటిషియన్ ఎంటరై ఎఫ్ఐఆర్ మార్పించేసి, అమ్మాయే డబ్బు కోసం వేధించినట్టు రాయిస్తాడు… దీంతో ఆమెకు న్యాయం చేయలేక, అదే డిప్రెషన్‌లో చనిపోతాడు… లైంగిక దాడికి గురైన గిరిజన యువతి కూడా ఓ లోయలో పడిపోతుంది…

ఆయన కొడుకే త్రిమూర్తులు… ఖతర్నాక్, ఎవరు చెప్పినా వినడు… 55 సార్లు ట్రాన్స్‌ఫర్ చేస్తారు… (అవునూ, కానిస్టేబుల్‌ను ఎన్నిచోట్లకు ట్రాన్స్‌ఫర్ చేయగలరు..? ఎన్నిసార్లు..? తిక్క లేస్తే రిజర్వులో పడేస్తారు)… తనకు ఏకంగా హోమ్ మినిస్టర్‌తోనే పడుతుంది పంచాయితీ.., కొడుకును సీఎంను చేసి, తాను ప్రధాని కావాలని ప్లాన్‌లో ఉంటాడు ఆ నాయకుడు… (అంత భారీ సాధనసంపత్తి ఉన్నవాడికి ఓ కానిస్టేబుల్ ఓ సమస్యా..?)

సరే, ఈ హీరోగారు తన తండ్రి పనిచేసిన పాత ఠాణాకు వెళ్లి, ఆ పాత ఎఫ్ఐఆర్ చూసి, ఈ నాయకుడి కొడుకే నాడు ఆ గిరిజన యువతిపై లైంగిక దాడి చేసిన నేరగాడు అని తెలుసుకుంటాడు… (ఆల్రెడీ ఎఫ్ఐఆర్ మార్పించారు కదా, అమ్మాయే డబ్బు కోసం వేధించినట్టు..? మరి ఆ ఎఫ్ఐఆర్‌లో అత్యాచారం, సదరు నాయకుడి కొడుకు పేరు ఎలా ఉంటాయి..? ఇదెలా సాధ్యం?)

ఇలా అనేకానేక లాజిక్కు రాహిత్యాలతో కథ పేలవమైన ప్రజెంటేషన్‌తో సాగుతూ ఉంటుంది… నవీన్ ఏజ్ కనిపిస్తూనే ఉంటుంది, నిజం చెప్పాలంటే ఈ సినిమాకు తనే పే-ద్ద మైనస్… హీరోయిన్ ఉందంటే ఉంది… నడుమ నడుమ పాటల అసందర్భంగా వచ్చి మరింత చికాకు పెడతాయి… ఇంతకు మించి ఏమాత్రం ఎక్కువ రాసినా, అదీ చికాకే… చదువరులకు… సెలవు…

చివరగా... నవీన్ బాబూ, డబ్బుంటే సద్వినియోగం చేయడానికి ఇండస్ట్రీలోనే చాలా మార్గాలు కలవు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?
  • కొత్త స్కూల్ కిట్..! యాభై ఏళ్ల క్రితం కథ… నేటికి నేరవేరిన ఓ కల..!
  • Ban on Cough Syrup – డాక్టర్ చీటి రాసిస్తే ఆ విషం తాగొచ్చా..?!
  • ‘మా ఇంటి బంగారం – సమంతకన్నా మంజూష ఎక్కువ మెరిసింది
  • అప్పట్లో ‘స్వాతి’ – తరువాత ‘మా నాన్నకు పెళ్లి’ – ఇప్పుడు ‘వంద దేవుళ్లు’
  • Iran War – కాగితాలపైనే శాంతి ఒప్పందాలు – తొలగని యుద్ధ మేఘాలు
  • యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…
  • Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!
  • సింగిల్ మాల్ట్ Vs బ్లెండెడ్… స్కాచ్ రకాలపై అపోహలు- నిజాలు
  • సాక్షాత్తూ ప్రభుత్వం పేరుతోనే — బరితెగించిన స్కామ్ యాడ్స్

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions