Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Global Headache – అనుకున్నదే – హోర్ముజ్ మళ్లీ మూతబడింది

June 21, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  హోర్ముజ్ మళ్లీ మూసివేత., ఇది కేవలం సముద్ర మార్గం కథ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హెచ్చరిక!
ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇరాన్‌కు చెందిన ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్  అమెరికా , ఇజ్రాయెల్ తమ హామీలను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ హోర్ముజ్ జలసంధిని నౌకా రాకపోకలకు మూసివేస్తున్నట్లు తెలిపింది. దీనిని “మొదటి అడుగు”గా పేర్కొంటూ, పరిస్థితి మారకపోతే మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Ads

ఇది ముందే వేసుకున్న వ్యూహమా?
నేను చాలా సార్లు చూపినట్లు, ఇరాన్‌కు లెబనాన్ అంశం కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక లీవర్ కూడా.
సాధారణంగా జరిగే చక్రం ఇలా ఉంటుంది…
➡️ హిజ్బుల్లా దాడి చేస్తుంది.
➡️ ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తుంది.
➡️ ఇరాన్ “సీజ్‌ఫైర్ ఉల్లంఘన” అంటుంది.
➡️ ఒప్పంద నిబంధనలను తిరిగి ప్రశ్నిస్తుంది.
అందుకే లెబనాన్ అంశాన్ని ఒప్పంద చర్చల్లో కీలకంగా ఉంచారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 హోర్ముజ్ ఎందుకు అంత కీలకం?
ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం ఈ ఒక్క జలసంధి గుండా ప్రయాణిస్తుంది.
ఈ మార్గం మూసివేస్తే…
– చమురు సరఫరా ఆలస్యం
– అంతర్జాతీయ క్రూడ్ ధరల పెరుగుదల
– షిప్పింగ్ ఖర్చుల పెరుగుదల
– ఇన్సూరెన్స్ ప్రీమియంల ఎగబాకడం
– ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం
ఇవి అన్నీ ఒకేసారి జరుగుతాయి.

ఇప్పటికే గనులు (mines), భద్రతా సమస్యలు, నౌకల రద్దీ కారణంగా సాధారణ రవాణా పునరుద్ధరణ త్వరగా జరగదని సముద్ర రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఎందుకు భారీ వైమానిక మోహరిస్తోంది?
ప్రస్తుతం అమెరికా  KC-135 Stratotanker విమానాలు,  E-3 Sentry AWACS విమానాలు,  కమాండ్ & కంట్రోల్ వనరులు ఆ ప్రాంతానికి తరలిస్తోంది.
KC-135లు యుద్ధ విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపుతాయి. E-3 Sentry అనేది ఆకాశంలో ఎగిరే రాడార్ కేంద్రం. ఇది వందల కిలోమీటర్ల దూరంలో జరిగే కదలికలను పర్యవేక్షిస్తుంది.
ఇలాంటి వనరులను సాధారణ పరిస్థితుల్లో పంపరు.

దీని అర్థం:
🔍 అమెరికా పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.
🔍 హోర్ముజ్ చుట్టూ సైనిక చలనం పెరుగుతోంది.
🔍 మరింత ఉద్రిక్తత వచ్చే అవకాశాన్ని ముందుగానే అంచనా వేస్తోంది.

ఇది కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కాదు. ఇది…:
ప్రపంచ ఇంధన భద్రత
అంతర్జాతీయ వాణిజ్యం
చమురు మార్కెట్లు
అమెరికా-ఇరాన్ శక్తి పోటీ
మధ్యప్రాచ్య భవిష్యత్తు
అన్నీ కలిసిన జియోపాలిటికల్ చెస్ గేమ్.

హోర్ముజ్‌లో వచ్చే కొన్ని రోజులు ప్రపంచ మార్కెట్ల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. పాము, ముంగీస ఆట ముగియలేదు, అసలు ఆట ఇప్పుడే మొదలు అయ్యింది. — ఉపద్రష్ట పార్ధసారధి

#PardhaTalks #Hormuz #Iran #Israel #USA #Hezbollah #CrudeOil #OilPrices #EnergySecurity #Geopolitics #IndiaEconomy #MiddleEast #StrategicReserves #GlobalTrade

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్‌బీఐ వివాదం – ఎవరు ఈ శెట్టి ? పనోడు కాదు- మనోడిగానూ లేడు!!
  • Global Headache – అనుకున్నదే – హోర్ముజ్ మళ్లీ మూతబడింది
  • ఒక సూర్యకాంతం, ఒక ఛాయాదేవి… ఒక మంజూష ముక్కవల్లి…
  • అసలు ఒక్క బాల్ వేయనేలేదు- మన స్కోర్ 5 రన్స్- ఎందుకంటే..?
  • NEET – నీట్ దుబాయ్ వివాదం వెనుక NTA తేల్చిన అసలు నిజం!
  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions