Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇద్దరూ హోం మంత్రులే… అప్పట్లో తండ్రి బందోబస్తు- ఇప్పుడు కొడుకు కొరడా

June 21, 2026 by M S R

.

Devika Rani …. 2002 జనవరి నెల. అప్పటికీ ఆరెస్సెస్ రిజిష్టర్ కాలేదు. అప్పుడు కర్నాటక రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే హోమ్ మంత్రి. బెంగుళూరు నగరంలోని నాగవారలో విశాలమైన మైదానం ఉండేది. అందులో ‘ సమరసతా సంగమ ‘ పేరుతో ఆరెస్సెస్ ఒక పెద్ద శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిర నిర్వహణ కోసం అక్కడ ‘ మాన్యతా నగర ‘ అనే కొత్త నగరమే ( కాలనీ ) నిర్మాణమైంది.

రాష్ట్రం నలు మూలల నుండి 30,000 కు పైగా స్వయంసేవకులు గణవేష్ ధరించి క్రమశిక్షణతో బెంగుళూరు నగరంలోని అయిదు చోట్ల భవ్యమైన పథసంచలనం ( రూట్ మార్చ్) నిర్వహించారు. పది అడుగుల పొడవున్న త్రివర్ణ ధ్వజాన్ని 120 అడుగుల ఎత్తైన స్తంభం మీద ఎగురవేయడం జరిగింది.

Ads

ఆరెస్సెస్ కార్యకర్తల రాకపోకల కోసం కర్నాటక ప్రభుత్వం 300 బిఎంటిసి ( బెంగుళూరు మహానగర సారిగె సంస్థ ) కి చెందిన బస్సులను అందుబాటులో ఉంచింది. ప్రపంచస్థాయిలో భారత గౌరవాన్ని ప్రతిబింబించే గొప్ప వస్తు ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ శిబిరంలో ఆనాటి ఆరెస్సెస్ సర్ కార్యవాహ ( ప్రధాన కార్యదర్శి ) అయిన మోహన్ భాగవత్ ఉపన్యాసం ఉండింది. రాష్ట్రంలోని నలుమూలల నుండి అనేక మఠాలకు చెందిన సాధుసంతులు పాల్గొన్నారు.
విశేషమేమిటంటే ‘రిజిష్టర్ ‘ కాని ఒక సంఘం నిర్వహించే పెద్ద కార్యక్రమానికి ‘రాజ్యాంగబద్ధంగా ‘ అనుమతి ఇవ్వడమేగాక , అక్కడ ఉన్న 30,000 మంది ఆరెస్సెస్ కార్యకర్తల రక్షణ బాధ్యత స్వీకరించింది ఆనాటి రాష్ట్ర మంత్రి మల్లికార్జున ఖర్గే.

మంత్రి ఖర్గే ఆరెస్సెస్ శిబిర స్థలానికి వచ్చి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. తమ మాట మీద నిలబడ్డారు కూడా !

దురదృష్టమేమిటంటే ఆనాడు రిజిష్టర్ కాని ఆరెస్సెస్ శిబిరానికి రాజ్యాంగబద్ధంగా అనుమతినివ్వడమేగాక , ఆ శిబిర రక్షణ బాధ్యతను స్వీకరించి , విజయవంతం చేసిన మల్లికార్జున ఖర్గే కొడుకు , ఈనాటి రాష్ట్ర హోమ్ మంత్రి ప్రియాంక ఖర్గే ఆరెస్సెస్ సరసంఘ చాలకులకు ఉత్తరం వ్రాసి , సంస్థను రిజిష్టర్ చేసుకోమని ఆర్డర్ వేస్తున్నాడు.

ప్రియాంక ఖర్గేకు వాళ్ళ నాన్న గతంలో ఆరెస్సెస్ కు చేసిన సేవ తెలుసో తెలీదో మరి ! క్రింది చిత్రంలో  మల్లికార్జున ఖర్గేతోబాటు అనాటి పర్యాటక శాఖ రాష్ట్ర మంత్రి రోషన్ బేగ్, పోలీస్ కమీషనర్ సాంగ్లియానా కూడా ఉన్నారు….. ( Rajareddy Aleti పోస్ట్ )

kharge

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇద్దరూ హోం మంత్రులే… అప్పట్లో తండ్రి బందోబస్తు- ఇప్పుడు కొడుకు కొరడా
  • ఎస్‌బీఐ వివాదం – ఎవరు ఈ శెట్టి ? పనోడు కాదు- మనోడిగానూ లేడు!!
  • Global Headache – అనుకున్నదే – హోర్ముజ్ మళ్లీ మూతబడింది
  • ఒక సూర్యకాంతం, ఒక ఛాయాదేవి… ఒక మంజూష ముక్కవల్లి…
  • అసలు ఒక్క బాల్ వేయనేలేదు- మన స్కోర్ 5 రన్స్- ఎందుకంటే..?
  • NEET – నీట్ దుబాయ్ వివాదం వెనుక NTA తేల్చిన అసలు నిజం!
  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions