Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ భార్య సంగతి సరే- కానీ ముసలి పేద తల్లిదండ్రుల గతేమిటి?

June 22, 2026 by M S R

.

Priyadarshini Krishna …. అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన AN-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత వైమానిక దళ సిబ్బందిలో శుభమ్ కుమార్ ఒకరు.
ఈ ప్రమాదం రొటీన్ ఫ్లయింగ్ సోర్టే సమయంలో జరిగింది. భారత వైమానిక దళం తర్వాత ఐదుగురు సిబ్బంది మరణించినట్లు ధృవీకరించింది, కర్తవ్య నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసినందుకు వారికి నివాళులు అర్పించింది.

మరణించిన సిబ్బందిని స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్వాయు ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్వాయు దానిష్ ఆలమ్‌గా డిపార్ట్మెంట్ గుర్తించింది.
ఈ విమాన ప్రమాదంలో మరణించిన శుభమ్ కుమార్ మరణానంతరం ఇచ్చిన ఎక్స్ గ్రేషియో ఇప్పుడు వివాదానికి దారి తీసింది…

Ads

దివంగత శుభమ్ కుమార్ సర్వీస్ లో చేరి ఐదేళ్లు. ఆయన భార్యకు 21 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం exgratia చెల్లించింది.
అయితే తమ కొడుకు పెళ్లి చేసుకున్న విషయమే తమకు తెలియదని శుభమ్ కుమార్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైమానిక దళ రికార్డుల్లో మాత్రం ఆయనకు శ్రేయరాయ్ భార్యగా, నామినీగా ఉంది. ఇప్పుడు ఇరవై ఒక్క లక్షలు రూపాయలు ఆమెకు చెక్కుగా ఇచ్చారు. అయితే ఈ విషయమై శుభమ్ కుమార్ తండ్రి మాట్లాడుతూ తాము పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళమని, కొడుకును కష్టపడి చదివించుకున్నానని చెప్పాడు.

శుభమ్ కుమార్ భార్యకు పరిహారం ఇవ్వడాన్ని తప్పుగా భావించడం లేదని, బాధపడడం లేదని, అయితే భర్త చనిపోయిన తర్వాత పిండ ప్రదానం జరిగే వరకు ఆమె తన ఇంట్లోనే ఉండాలని కోరినా, అంత్యక్రియలు జరిగిన రోజే ఆమె వెళ్లిపోయిందని, పిండ ప్రదానం రోజు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ధోరణి హిందూ సంప్రదాయం ప్రకారం తప్పు. పిండ ప్రదానం చేయకుండా ఆమె వెళ్లిపోవడం తమకు బాధ కలిగించిందని ఆ తండ్రి ఆవేదన. ప్రభుత్వం తమ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరాడు. శుభమ్ కుమార్ విమాన ప్రమాదంలో చనిపోయే గంట ముందు కూడా తన తల్లితో వీడియో కాల్ లో మాట్లాడాడు. తాను సరిహద్దులు పహారాకి వెళుతున్నానని, తిరిగి వస్తూనే మళ్లీ వీడియో కాల్ చేస్తానంటూ చెప్పి పెట్టేశాడు . తీరా ఆయన శవం ఇంటికి చేరింది..

ఇక్కడ చాలా సున్నితమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. సైనిక దళాల్లో కానీ ఇతర ప్రభుత్వ రంగాల్లో కానీ తమకు సంబంధించిన పర్సనల్ వివరాలు తెలిపేటప్పుడు నామిని పేరు కూడా పొందుపర్చాల్సిన విషయం మనకు తెలిసిందే. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమవివాహాలు చేసుకుని, సర్వీస్ పేపర్స్ లో జీవిత భాగస్వామి పేరునే నామినీ పేరుగా పెట్టుకుంటే, ఈ విషయాలు తల్లిదండ్రులకు కూడా తెలియకపోతే..?

అందులోనూ తల్లిదండ్రులు నిరుపేద గ్రామీణ నిరక్ష్యరాస్యులైనప్పుడు ఇలాంటివి వెలుగులోకి రావు, ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే ఇవి బయటపడతాయి.
ఇలాంటి సంఘటనల్లో ‘papers’ లో ఉన్న విషయాలనే ప్రాథమిక సాక్ష్యాలుగా, ఆధారాలుగా పరిగణిస్తారు. రూల్స్ ప్రకారం పేపర్స్ లో నామినీ ఎవరు ఉంటే, కాంపెన్సేషన్ కూడా వారికే అందుతుంది.
కానీ మానవతా కోణంలో గానీ, ధర్మం పరంగా చూసినప్పుడు తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు ఇక్కడ.

తల్లిదండ్రులకు తన భార్యా పిల్లల విషయం చెప్పకుండా దాచడం ఉద్యోగి సొంత విషయం. కానీ ఇంతకాలం సాకి చదివించి ఒక స్థాయికి తీసుకువచ్చిన కొడుకు తమకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాలి అనుకోవడం సహజం…. కానీ విధి వల్ల యువకుడైన కొడుకును పోగొట్టుకుని, తమకు ముసలి వయసులో ఆసరా పోగొట్టుకుని, ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్, పెన్షన్ వగైరాలు పోగొట్టుకుని నిస్సహాయులుగా మిగిలిపోవడం విషాదమే.

ఇటువంటి కేసులలో డిపార్ట్మెంట్స్ మానవతా దృక్పథంతో ఆలోచింది నిర్ణయాలు తీసుకొంటే, ఇలాంటి నిస్సహాయ తల్లిదండ్రులకు ఆసరా దొరుకుతుంది….!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్, ఈమె నాగశౌర్య సొంత మేనత్త? ఒకప్పటి స్టార్ సిస్టర్! కానీ…
  • ఈ భార్య సంగతి సరే- కానీ ముసలి పేద తల్లిదండ్రుల గతేమిటి?
  • ఈమె ఓ ఫైర్ బ్రాండ్..! ప్చ్, మగపెత్తనాలు రాజీనామా చేయించాయి..!!
  • కలిసి నడుస్తారా? కైలాట్కమా? – కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ!
  • ఆ బుజ్జి ఉడుత కథ పెద్దదే – పర్ణశాల నుంచి రామేశ్వరం దాకా…
  • ప్రకాష్ రాజ్‌కు కోర్టు సమన్లు..! ఈసారి కేసు మల్టిపుల్ ఓటరు కార్డులు..!!
  • వరుస ఫ్లాపులతో అమితాబ్ కెరీర్ ఇక క్లోజ్ అనుకునే దశలో ..!
  • మా నాన్నను నిజంగానే చాలా అడగాలనుకున్నాను…
  • అదే పాట – అదే సిరివెన్నెల- భానుమతి పాడితే నో – తనే పాడుకుంటే నంది
  • రష్మిక Vs సమంత…! పోలికే అనవసరం… 2 సినిమాలు వేరు- 2 బతుకులు వేరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions