.
ముందుగా సోషల్ మీడియాలో సర్క్యులేటవుతున్న ఓ పోస్టు చూడండి… ‘‘బ్రిటన్ కింగ్ చార్లెస్ భారత ప్రధాని మోడీకి ఓ కీలక బాధ్యత అప్పగించాడు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశాడు కదా, కొత్త ప్రధానిని ఎన్నుకునే జ్యూరీ చైర్మన్‌గా చార్లెస్ నరేంద్ర మోడీని నియమించాడు. ప్రస్తుతం కీర్ స్టార్మర్తోపాటు రిషి సునాక్, లిజ్ ట్రస్ కూడా ఈ పోటీలో ఉన్నారు…
…… కాదు, ఇది నిజమైన వార్త కాదు. ఇది ఒక వ్యంగ్య (satirical) పోస్ట్. సోషల్ మీడియాలో, ముఖ్యంగా X (ట్విట్టర్), ఫేస్బుక్లో వైరల్ అయిన జోక్‌ను కొంతమంది నిజమైన వార్తలా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులోనే వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తుంది.
Ads
Narendra Modiను జ్యూరీ చైర్మన్‌గా పెట్టడం,
King Charles III నామినేట్ చేశాడని చెప్పడం,
Keir Starmer, Rishi Sunak, Liz Truss మధ్య “బ్రిటన్‌లో అత్యల్ప కాలం ఎన్నికై పనిచేసిన ప్రధానమంత్రి” టైటిల్ కోసం పోటీ పడుతున్నారని చెప్పడం.
ఇది బ్రిటన్‌లో ఇటీవల వరుసగా ప్రధానమంత్రులు మారడం, ముఖ్యంగా లిజ్ ట్రస్ కేవలం 49 రోజులు మాత్రమే పదవిలో ఉండటం వంటి రాజకీయ పరిణామాలపై చేసిన సెటైర్. వాస్తవానికి రాజు చార్లెస్‌కు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానమంత్రుల గురించి ఇలాంటి “జ్యూరీ”లు ఏర్పాటు చేసే అధికారమే లేదు.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన దేశం. సూర్యుడు అస్తమించని విశాల సామ్రాజ్యం. పాలన ఎలా ఉండాలో అన్ని దేశాలకు చెప్పిన దేశం. కానీ ఇప్పుడు ఏ ప్రధానీ పట్టుమని పది రోజులు ఉండటం లేదు, రాజీనామాలు చేస్తున్నారు. వైదొలుగుతున్నారు. లేబర్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఆ దేశాన్ని నగుబాటు చేస్తున్నాయి.
తాజాగా కీర్ స్టార్మర్ రాజీనామాతో, అక్కడ 2014 నుంచి 2026 వరకు ఆరుగురు ప్రధాన మంత్రులు మారిపోయినట్టు లెక్క. డేవిడ్ కామెరూన్ ➜ థెరిసా మే ➜ బోరిస్ జాన్సన్ ➜ లిజ్ ట్రస్ ➜ రిషి సునాక్ ➜ కీర్ స్టార్మర్
లేబర్ పార్టీలో అంతర్గతంగా పెరిగిన అసమ్మతి, నాయకత్వ మార్పు కోసం జరిగిన అంతర్గత తిరుగుబాటు స్టార్మర్ నిష్క్రమణకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ నుంచి స్టార్మర్‌కు సవాల్ ఎదురైంది. బ్రిటన్ రాజకీయ సంప్రదాయాల ప్రకారం ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలంటే సదరు నేత తప్పనిసరిగా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై ఉండాలి.
కిందటి వారం జరిగిన ఉప ఎన్నికల్లో బర్న్‌హామ్ ఘన విజయం సాధించారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. దీంతో కీర్ స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేయాలనే డిమాండ్లు లేబర్ పార్టీలో బలంగా వినిపించడం ఆరంభమైంది. 100 మంది ఎంపీలు తన రాజీనామాను డిమాండ్ చేశారు. ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని హుందాగా పేర్కొన్నాడు, దిగిపోయాడు. స్టార్మర్ తర్వాత బర్న్‌హామ్ వస్తే ఏడో ప్రధాని అవుతాడు. అంటే 12 ఏళ్లల్లో ఏడుగురు ప్రధానులు.
ఇక్కడే మరో విషయం… అదే 2014 నుంచి ఇప్పటివరకు బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారితే, ఇండియాలో అదేకాలంలో ఒకడే ప్రధాని… తనే మోడీ. ఏ అనిశ్చితి లేదు, సుస్థిర ప్రభుత్వం, ఇండియాయే నయం!

Share this Article